E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ఎమోషనల్ అయిన అవని.. రాజేశ్వరిని నిజం చెప్పిన చక్రధర్.. పార్వతికి టెన్షన్..

Intinti Ramayanam Today Episode: ఎమోషనల్ అయిన అవని.. రాజేశ్వరిని నిజం చెప్పిన చక్రధర్.. పార్వతికి టెన్షన్..
Advertisement

Intinti Ramayanam Today Episode March 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. నేను ఒక విషయం చెప్పాలి అని చక్రధరం అంటాడు. అవని ఏదో చెప్తాను అంటున్నాడు కదా అత్తయ్య చెప్పనివ్వండి అని అంటుంది. మీనాక్షిని దగ్గరికి తీసుకుని వచ్చి క్షమాపణ చెప్తాడు.. అందరూ ఎందుకు మీనాక్షికి అతను క్షమాపణలు చెప్తున్నాడు అని ఆశ్చర్యపోతారు.. కానీ చక్కగా మాత్రం మీనాక్షిని దగ్గరకు తీసుకొని వస్తాడు.. ఈ మీనాక్షి ఎవరో కాదు నా మొదటి భార్యని కుండ బద్దలు కొట్టే నిజాన్ని బయటపెడతాడు.. అవని, భరత్లో నా కన్న పిల్లలు అని నిజాన్ని ఒప్పుకుంటాడు చక్రధర్.. ఎన్ని రోజులు వాళ్ళిద్దరిని దూరం పెట్టి చాలా బాధ పెట్టాను అని చక్రధర్ బాధపడతాడు.. ఇన్నేళ్లు వీళ్ళని చాలా బాధ పెట్టాను అందుకే ఇప్పుడు ఈ నిజాన్ని ఒప్పుకుంటున్నాను అని చక్రధర్అంటాడు.

ఏంటి మీరు మాట్లాడేది నిజమా అని పార్వతి అడుగుతుంది.. చక్రధర్ అవునమ్మా నిజమే నాకు ఈమధ్య ఈ విషయం తెలిసింది.. నాన్న కు కూడా ఈ విషయం ఎప్పుడో తెలుసు.. అందుకే ఆరోజు పార్టీని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని అందరితో చెప్పాలని అనుకున్నాడు.. అందుకే ఇలా జరగకుండా ఉంటే కచ్చితంగా అందరితో చెప్పేసేవాడు అని అక్షయ్ అంటాడు. వీళ్ళ ఎమోషన్ చూసిన పల్లవి.. ఏంటి ఇన్ని రోజుల తర్వాత మా డాడీ చేత నిజం చెప్పించామని సంతోష పడుతున్నారా బాగుంది మీ ఫ్యామిలీ డ్రామా అని వెటకారంగా మాట్లాడుతుంది.. చక్రధర నిజం చెప్పిన తర్వాత కూడా పల్లవి అవని మీనాక్షి లపై రెచ్చిపోతుంది. కానీ అవని మాత్రం దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్రధరతో పల్లవి ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించినా సరే వినకుండా చక్రధర్ ఇంటికి వెళ్ళిపోతాడు.. అయితే చక్రధర్ వెనకాల ఇంటికి వెళ్లిన పల్లవి ఏం జరుగుతుందని చూస్తూ ఉంటుంది. రాజేశ్వరి తన భర్త ఇంకా ఇంటికి రాలేదు అని కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంటికి వచ్చిన చక్రధారిని చూసిన రాజేశ్వరి భయపడిపోతుంది. ఆ ఒంటి మీద దెబ్బలు ఏంటి అండి. మళ్లీ మిమ్మల్ని ఎవరైనా కొట్టారా? మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ అయిందా అని కంగారు పడిపోతూ అడుగుతుంది.. మొన్ననే కదా యాక్సిడెంట్ అయింది మళ్ళీ ఎందుకు ఈ దెబ్బలు అని రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే చక్రధర్ ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు.

అప్పుడే ఇంటికి వచ్చిన పల్లవి మాత్రం మామ్ అడుగుతుంది కదా.. డాడ్ అసలు నిజం ఏంటో చెప్పండి అని అంటుంది.. అయితే పల్లవి జరిగిన విషయాన్ని మొత్తాన్ని చెప్పేస్తుంది. ఏంటండీ మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను అని రాజేశ్వరి నిలదీస్తుంది. ఎందుకు మిమ్మల్ని ఇన్ని రోజులు నమ్మినందుకు నాకు నిజం చెప్పలేదా? నన్నెందుకు మోసం చేశారు అని రాజేశ్వరి చక్రధరిని నిలదీస్తుంది. నేను అనుకోని పరిస్థితుల్లో అలా పెళ్లి చేసుకున్న అనే తప్ప వేరే ఉద్దేశం లేదు అని చక్రధర అంటున్న సరే రాజేశ్వరి మాత్రం ఆవేశంగా అతన్ని అసహ్యించుకుంటుంది.. ఆమె అందానికి ఆమెని వాడుకుందాం అనుకున్నారు. ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అంతేనా అని రాజేశ్వరి ఎమోషనల్ అయిపోతుంది. అంతే కాదు రాజేశ్వరి కళ్ళు తిరిగి పడిపోతుంది. రాజేశ్వరిని చక్రధర్ ముట్టుకో పోతుంటే పల్లవి మాత్రం మీరు మామ్ ని ముట్టుకోవద్దు అని గట్టిగా అరుస్తుంది.

Advertisement

అవని తన తండ్రి చక్రధర అని చెప్పడంతో చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇన్ని రోజులు మేము ఎన్నో అవమానాలని భరించాము. ఇప్పుడు మా తండ్రి ఎవరో తెలిసింది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మా అమ్మ 30 ఏళ్లు ఈ బాధని తనలో తానే భరించింది అని అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్షయ్ తో మీరు చాలా మంచివాళ్లండి ఇన్నేళ్లకు మా బాధను తీర్చారు మీరునాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని తన కాళ్ళ మీద పడుతుంది. ఏంటి అవి ఇదంతా ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాల్సిన సమయం ఇన్ని రోజులు నిన్ను నానా మాటలు అన్న వాళ్ళకి బుద్ధి వచ్చేలా ఇప్పుడు చెప్పేశావు.. మీ అమ్మగారు నువ్వు పడ్డ బాధలకి ఇప్పుడు పరిష్కారం దక్కింది. మీరిద్దరూ చాలా సంతోషంగా ఉండాలి అని అక్షయ్ అంటాడు.. అయితే అవని మాత్రం మీరు చేసిన మంచి పనికి నేను ఎప్పుడు మీ దాసోహినే.

Also  Read : ‘పొదరిల్లు’ మహా రియల్ లైఫ్ లవ్ స్టోరీ.. ఇదేం ట్విస్ట్ మావా..

మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను అని అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నేను ఇదంతా చేసింది నీ ప్రేమ కోసమే.. మీరు సంతోషంగా ఉండడం కోసమే అని అవనిని ఓదారుస్తాడు అక్షయ్.. ఇక రాజేశ్వరి కోసం వచ్చిన డాక్టర్ ఆమెను పరీక్షించి పరిస్థితి కాస్త క్రిటికల్ గానే ఉంది అని చెప్పడంతో పల్లవి చక్రధర్ షాక్ అవుతారు. ఏమైంది డాక్టర్ మా మామ్ కి ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు కదా అని పల్లవి అడుగుతుంది. ప్రస్తుతమైతే ఎటువంటి ప్రమాదం లేదండి ఆమెకు ఏదైనా షాకింగ్ న్యూస్ విని ఇలా మారింది అని డాక్టర్ అడుగుతుంది. అవును డాక్టర్ మా మామ్ కి నమ్మలేని నిజం ఒకటి తెలిసింది. దానివల్లే ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది అని పల్లవి అంటుంది. ఆమె బిపి ఎక్కువైపోయి పడిపోయింది ఇంకొకసారి ఇలా ఎక్కువ అవ్వకుండా చూసుకోండి అని మందులు రాసిస్తుంది.. చూసావా డాడీ మీ వల్లే మామ్ కి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని పల్లవి బాధపడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×