E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ఆస్తి కోసం రచ్చ చేసిన శ్రీయ.. పల్లవిపై కమల్ సీరియస్.. చక్రధర్ కీలక నిర్ణయం..

Intinti Ramayanam Today Episode: ఆస్తి కోసం రచ్చ చేసిన శ్రీయ.. పల్లవిపై కమల్ సీరియస్.. చక్రధర్ కీలక నిర్ణయం..
Advertisement

Intinti Ramayanam Today Episode March 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాక్షి లోపల నిజాలు చెప్పకుండా మొండిగా ఉండడంతో పల్లవి రెచ్చిపోతుంది. పల్లవి నీ ఫాలో అవుతున్న కానిస్టేబుల్ అవినీకి ఫోన్ చేసి ఆ లొకేషన్ ని పంపిస్తాడు. ఇక ఆ అవని అక్కడికి చేరుకుంటుంది పల్లవి ఇలాంటి నిర్మానుష ప్రాంతానికి ఎందుకు వచ్చింది అని అనుమానం కలుగుతుంది.. అంటే పల్లవి మా అమ్మని కిడ్నాప్ చేసిందా..? లేదంటే ఇంకేదైనా ఇక్కడ చేస్తుందా అన్నది తెలుసుకోవాలి అని ఫాలో అవుతూ లోపలికి వెళ్ళబోతుంది..

ఇలాంటి ప్రాంతంలోకి పల్లవి ఎందుకు వచ్చింది. ఇంటికి తాళం వేశారు కదా ఇక్కడ ఎవరూ లేరా అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి మనుషులు అక్కడ ఏం చేస్తున్నారు ఇది ఒక భయంకరమైన ప్లేస్. ఇక్కడికి మనుషులు ఎవరూ రావడానికి భయపడుతూ ఉంటారు.. ఇక్కడి నుంచి వెళ్ళండి అసలే ఆడపిల్లని పల్లవి రౌడీలు అవని పంపించేస్తారు.. అవని మాత్రం తన తల్లి ఎక్కడుందో తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే పల్లవి మాత్రం అవనికి తన తల్లిని దొరక్కుండా చేయాలి అని అనుకుంటుంది.. పార్వతి రాజేంద్ర కోసం పూజ చేయాలి అని పువ్వులను తీసుకొని వచ్చి అందరిని దండ కట్టమని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పువ్వులు కట్టడం అయిన తర్వాత పూజకి అన్ని సిద్ధం చేసి దేవుడికి పువ్వులు వేస్తారు. ఆ తర్వాత పూజ చేసిన తర్వాత హారతిస్తుంటే పల్లవి ఇచ్చిన హారతి ఆరిపోతుంది. పల్లవి ఎన్నిసార్లు హారతి వెలిగించిన సరే ఆరిపోతుంది. అందరికీ పల్లవి పై అనుమానం మొదలవుతుంది. గాలికి ఆరిపోయి ఉంటుంది అని రెండోసారి వెలిగించిన కూడా మళ్లీ ఆరిపోతుంది.. అసలు నీ దరిద్రం ఏంటో తెలియలేదు కానీ నాన్నకి ఇలా జరగడానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి పూజ చేస్తే నీకు దెయ్యం పట్టింది. ఇప్పుడు మళ్లీ పూజ చేస్తుంటే ఇలా హారతి ఆరిపోయింది అని కమల్ అంటాడు.. ఏదో గాలికి ఆరిపోయింది లేరా ఇప్పుడేంది అని పార్వతి మళ్ళీ వెలిగించి హారతి ఇస్తుంది. ఆ తర్వాత అక్షయ్ వాళ్ళందరూ కూర్చుని బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

ఇవాళ మన బిజినెస్ డీల్ పూర్తి కాబోతుంది నాన్న అనేసి అనగానే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.. ఇకపోతే బిజినెస్ గురించి మాట్లాడుతున్న వాళ్ళ దగ్గరికి శ్రేయ వస్తుంది. నేను చెప్పింది అడిగావా శ్రీకర్ అని అంటుంది. నేను చెప్పాను కదా మీ అన్నయ్యని అడగమని నువ్వు ఇంకా ఎందుకు అడగలేదు అని శ్రేయ అంటుంది.. దేని గురించి శ్రియా ఏ దాని గురించి మాట్లాడాలి అని అక్షయ్ అడుగుతాడు. మీరు ముగ్గురు కలిసి బిజినెస్ చేస్తున్నారు కదా అందులో లాభాలు వస్తే శ్రీకర్ కి ఎంత ఇస్తారో కనుక్కోమని చెప్పాను.. కానీ అతను కనుక్కోలేదు అతనికి సమానంగా వాటా ఇస్తారా లేదా అన్నది చెప్పాలి అని శ్రేయ అంటుంది..

Advertisement

మీ ముగ్గురుము కలిసి బిజినెస్ చేస్తున్నప్పుడు వచ్చిన వాటాని ముగ్గురు సమానంగా పంచుకుంటాము అందులో ఎటువంటి డౌట్ లేదు అని అక్షయ్ అంటాడు. కానీ శ్రీయ మాత్రం ఈరోజుల్లో నోటిమాటకి లెక్కలేదు. అలాగే అని మీరు ఒక నోట్ రాసి ఇవ్వండి అని అడుగుతుంది శ్రేయ.. శ్రేయ మాటకి పల్లవి కూడా తోడవడంతో ఇద్దరు కలిసి ఇంకాస్త రెచ్చిపోయి ఆస్తి గురించి మాట్లాడుతారు.. శ్రేయ అన్న దాంట్లో తప్పేమీ లేదు. రేపు మీరు మొండి చెయ్యి చూపించరని గ్యారెంటీ లేదు కదా అందుకే ఇప్పుడు ఆ నోటు రాసివ్వాల్సింది అని పల్లవి కూడా తోడు అవుతుంది. వీరిద్దరూ కలిసి పెద్ద రచ్చ చేస్తారు.. దాంతో అవని మా ఆయన మీద నమ్మకం లేదా అని అంటుంది. ఆ పెద్ద కొడుకుని అవమానిస్తావా అని పార్వతి కూడా అంటుంది. ఇక శ్రేయ పల్లవి ఇద్దరు కూడా తమకు ఆస్తి కావాలి అని పెద్ద రచ్చ చేస్తారు..

Also Read : ‘ బ్రహ్మముడి ‘ అనామిక బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

అవని వాళ్ళు అడిగినట్లు ఆ నోటి ఏదో రాసివ్వండి.. మావయ్య గారు చూడండి ఈ గొడవలు వల్ల ఎంత టెన్షన్ పడిపోతున్నారు అని అవని అంటుంది. ఇక అక్షయ్ అవని చెప్పినట్లుగా నోటు రాసే ఇస్తాడు. ఆ తర్వాత అవనిని ఫోన్ చేసి అభి రమ్మని చెప్తాడు. అవని అభి దగ్గరికి వెళ్లి పల్లవి గురించి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అని అంటాడు. పల్లవి ఎవరికో ఈమధ్య 47 సార్లు కాల్ చేసింది అని చెప్పగానే అవని షాక్ అవుతుంది. ఇక ఆ వ్యక్తి గురించి నేను తెలుసుకుంటాను అని అభి అంటాడు.. చక్రధర్ మాత్రం అవనికి న్యాయం చేయాలి అని అనుకుంటాడు. పల్లవి పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉండగా అవని వచ్చి పల్లవి పై రెచ్చిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్చక్రధర్ మీనాక్షిని కాపాడతాడేమో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×