E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ఆరాధ్య మిస్సింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న అవని.. పల్లవికి వార్నింగ్.. నెక్స్ట్ ట్విస్ట్ ఇదే..

Intinti Ramayanam Today Episode: ఆరాధ్య మిస్సింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న అవని.. పల్లవికి వార్నింగ్.. నెక్స్ట్ ట్విస్ట్ ఇదే..
Advertisement

Intinti Ramayanam Today Episode March 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. తండ్రికి భోజనం తీసుకుని వెళ్లి ప్రేమగా వడ్డించాలని అనుకుంటుంది. ఏంటమ్మా నువ్వు ఈ టైంలో అల్లుడుగారు వచ్చారా ఏంటి అని అడుగుతాడు చక్రధర్.. లేదు నాన్నా మీరు భోజనం చేయలేదని అన్నారు అందుకే నేను నా చేతులతో నేను వండి తీసుకొని వచ్చాను అని అవని అంటుంది. మీ పిన్ని ఎంత మొండిగా ఉందో మారడం లేదు అని చక్రధర కూడా అంటాడు. పిన్నికి మీరంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిమ్మల్ని జైలు నుంచి తీసుకురాలేదని నన్ను ఆయన్ని రోజు వచ్చి తిట్టేది మీ మీద అంత ప్రేమ ఉంది అని అవని అంటుంది. తను మొండిగా ఉంది ఎప్పుడు మారుతుందో అర్థం కావడం లేదు అని చక్రధర్ బాధపడతాడు.

సరే నాన్న మీరు అవన్నీ పక్కన పెట్టేసేయండి టైం కి తిని మందులు వేసుకోవాలి కదా అందుకే మీకు నేను భోజనం తీసుకొచ్చాను అని అవని అంటుంది.. ఇక తన తండ్రికి గోరుముద్దలు పెడుతుంది. రాజేశ్వరి అక్కడికి వచ్చి ఆ ప్లేటును విసిరి కొడుతుంది. కన్న తండ్రికి ఆకలితో ఉన్నాడని భోజనం తీసుకొచ్చి గోరుముద్దలు తినిపిస్తున్నావా అని రాజేశ్వరి అంటుంది. ఇవాళ గోరుముద్దలు తినిపించావు రేపు ఈ ఇంట్లోకి వచ్చి నాకు నా కూతురికి అన్యాయం చేయాలని అనుకుంటున్నారా..? మీరు ఎలాగూ మీ తండ్రికి దూరమయ్యారు నన్ను నా కూతుర్ని కూడా అలాగే ఈ ఇంటికి దూరం చేయాలని చూస్తున్నారా అని రాజేశ్వరి కఠినంగా మాట్లాడుతుంది… అవని మాత్రం దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆరాధ్య కోసం స్కూల్ కి వెళ్ళిన అవనికి షాక్ ఎదురవుతుంది. స్కూల్ కి వెళ్ళినా అవనికి వాచ్మెన్ ఆరాధ్య వెళ్ళిపోయింది అండి ఎవరూ లేరు అని చెప్పగానే ఒకసారిగా షాక్ అయిపోతుంది.. ఎవరు తీసుకొని వెళ్లారు వెళ్లి ప్రిన్సిపల్ ని అడగండి అని చెప్పగానే.. లోపలికి వెళ్ళిన అవని ప్రిన్సిపాల్ కి ఎవరిని ఎలా పంపించాలి మీకు తెలియదా ఫీజులు కట్టాలి అది ఇది అని అంటారు పిల్లల్ని కేర్ గా చూసుకోవాలన్న బాధ్యత మీకు లేదా అని దిమ్మ తిరిగిపోయేలా షాకేస్తుంది.. ఇంటికి వెళ్లి చూస్తాను అక్కడ అమ్మాయి లేకపోతే ఆ తర్వాత మీ సంగతి చెప్తాను అని అవని ప్రిన్సిపాల్ కి వార్నింగ్ ఇచ్చి వస్తుంది.. ఆరాధ్య ఎవరు తీసుకెళ్లారు అర్థం కావడం లేదు అని కంగారుపడుతూ ఇంటికి వచ్చిన అవని పార్వతిని ఆరాధ్య కనిపించడం లేదు అత్తయ్య అని అడుగుతుంది..

ఇంటికి రాలేదమ్మా ఆరాధ్యను తీసుకురావడానికి నువ్వెలావు కదా.. లేదా అత్తయ్య నేను స్కూల్ కి వెళ్లలేక ఎవరు ఆరాధ్యను తీసుకుని వెళ్లారట. ఎవరు తీసుకెళ్లారు అర్థం కావడం లేదు.. ఒకవేళ అక్షయ్ వాల్ ఏమైనా తీసుకొని వచ్చారేమో అడగాల్సింది కదా అని పార్వతి అంటుంది. అవని పిలవడంతో ఇంట్లోని వాళ్ళందరూ బయటికి వస్తారు.. నేను ఆఫీస్ కి వెళ్లే ఆ తర్వాత స్కూల్ కి వెళ్ళాను అత్తయ్య వాళ్ళు ఎవరు తీసుకురాలేదు నేనే తీసుకొద్దామని వెళ్లాను కానీ అక్కడ ఆరాధ్య కనిపించడం లేదు. ఎవరు తీసుకెళ్లారు. నాకు అర్థం కావడం లేదు అని అవని కంగారు పడిపోతూ ఉంటుంది.

Advertisement

అప్పుడే కారు వచ్చి అక్కడ ఆగడంతో ఆ కారులోంచి ఆరాధ్య దిగి వస్తుంది. అమ్మ నన్ను తాతయ్య తీసుకెళ్లడమ్మా ఈ బొమ్మలన్నీ నాకు తాతయ్య కనిపించాడు అని చెప్పగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆరాధ్యను స్కూల్ నుంచి ఇంటికి నేరుగా తీసుకొని వద్దాం అనుకున్నాను అమ్మ కాకపోతే బొమ్మలు కొనుక్కొని వచ్చేలోగా లేట్ అయింది అని చక్రధర్ అంటాడు.. ఏంటి నాన్న ఒక మాట ఫోన్ చేసి చెప్పి ఉంటే మేము కంగారు పడే వాళ్ళం కాదు కదా అని అవని అడుగుతుంది. చేద్దాం అనుకున్నానమ్మా కానీ తాతయ్య అన్న పిలుపు విన్న తర్వాత నేను అన్ని మర్చిపోయాను అని చక్రధర అంటాడు..

సరే అమ్మ నేను వెళ్లి వస్తాను అని చక్రధర్ అనగానే అదేంటి నాన్న ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతారని అవని అడుగుతుంది. రండి అన్నయ్య గారు భోజనం చేసి వెళ్దురు అని పార్వతి అనగానే.. నాకు నీ భోజనం తిని అదృష్టం కలిగింది అని చక్రధర్ లోపలికి వస్తాడు.. పక్కనే ఉన్న పల్లవి నీ కనీసం చక్రధర పట్టించుకోవడం కూడా పట్టించుకోడు. లోపలికి వెళ్లిన అవని వంటకి ఎన్ని సిద్ధం చేస్తుండగా పల్లవి వచ్చి మా నాన్న నీ వంట కోసం అంతగా తాపత్రయపడుతున్నాడు. అని మాట్లాడుతుంది దాంతో పల్లవికి అవని దిమ్మ తిరిగిపోయేలా వార్నింగ్ ఇస్తుంది. ఇక ఈ కూరగాయన్ని కడిగి వంటని ఇలా చెయ్ అలా చేయని అవని పల్లవి తోనే వంట చేస్తుంది.

Also Read :అస్మిత సీరియల్స్ నుంచి తప్పుకోవడానికి కారణం ఇదే.. ఇన్నాళ్లకు బయటపెట్టిన నిజాలు..

వంట ఇవాళ చాలా బాగుంది అని అందరూ అవనిని మెచ్చుకుంటూ ఉండగా..అవని మాత్రం ఈరోజు పల్లవిని వంట చేసింది అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. వంట చేసింది నేను కాదు పల్లవి అని చెప్పగానే ఏంటి పల్లవి ఇంత అద్భుతంగా వంట చేసిందా చాలా బాగుంది అని అందరూ మెచ్చుకుంటారు. ఇక తర్వాత చక్రధర వెళ్ళిపోతూ ఉంటే పల్లవి పిలిచి మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. కానీ పల్లవికి చక్రధర్ దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×