E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్.. పార్వతి దెబ్బకు మైండ్ బ్లాక్.. అవని నిజం చెప్పేస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్.. పార్వతి దెబ్బకు మైండ్ బ్లాక్.. అవని నిజం చెప్పేస్తుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode March 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేశ్వరి మాటతో బాధపడిన అవని బయటకు వెళ్ళిపోతుంది. అవని దగ్గరికి చక్రధర్వస్తాడు పల్లవి గురించి నువ్వు నిజం చెప్పద్దని నేను ఎన్నిసార్లు బ్రతిమలాడను నువ్వు నా మాట విని చెప్పలేదు. నువ్వు చెప్పినట్టుగా పల్లవి చేస్తుందా కానీ తనకి నిజం చెప్పకపోవడమే మంచిది. తనంతట తానే మారుతుంది అని అవని అంటుంది. నేను చక్రధర్ వల్లే నిజం చెప్పలేదని అనుకుంటున్నాడు. ఒకందుకు ఇది కూడా మంచిదే అని అవని అనుకుంటుంది..

పల్లవి మారలేదు అనుకోండి నాకు ఓపిక నశిస్తుంది. అప్పుడు నేను నిజం చెప్పాల్సి వస్తుంది అని అవని అనగానే చక్రధర్ నేను తనతో మాట్లాడి నిజం చెప్పిస్తాను అని అంటాడు. అప్పుడే పల్లవి ఫోన్ చేసి చక్రధర్ తో మాట్లాడుతుంది.. అవని ఇక్కడే ఉంది నా పక్కనే ఉంది నీ పల్లవి తో చెప్పడంతో పల్లవి షాక్ అవుతుంది.. పల్లవి ఇంట్లో పని అంతా చేసుకుని బాధ పడిపోతూ ఉంటుంది.. పల్లవి ఇంతగా మారిపోవడానికి కారణం ఏదో ఉంటుంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని శ్రీయ అనుకుంటుంది.. ఒకసారి తన మార్పు కి గల కారణం ఏంటో తెలుసుకుంటాను అని శ్రేయ అనుకొని పల్లవి దగ్గరికి వస్తుంది.. పల్లవి మాత్రం శ్రేయ ఏం చెప్పిన సరే మౌనంగా చేస్తాను అని అంటుంది. చక్రధర్ మాత్రం పల్లవికి ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా పల్లవి మాత్రం అసలు మాట వినదు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రాజేశ్వరి ఇంటికి వెళ్లి వచ్చిన అవని పార్వతి ఇద్దరూ కూడా పల్లవిని సీరియస్గా చూస్తూ ఉంటారు. అక్షయ్ అత్తయ్య ఏమంటుంది.. అని అన్నా కూడా పార్వతి మాత్రం ఆమె ఎప్పటిలాగే కోపంగా ఉంది అవనికి మాత్రం చాలా ఓపిక ఉంటుంది. అవని చాలా మంచిది ఇంత ఓపికగా ఉండడానికి తనకి ఆ దేవుడు అంత శక్తి ఇచ్చాడు అని పార్వతి అవని పై పొగడ్తలు వర్షం కురిపిస్తుంది. కానీ పల్లవిని ఇండైరెక్టుగా తిట్టేస్తుంది పల్లవి అత్తయ్యకి ఏమైంది నామీద ఊరికే చిరాకు పడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. శ్రేయ ఎంతగా పల్లవిని విసిగించిన సరే పల్లవి మాత్రం మౌనంగా తన పని ఏంటో తాను చేసుకుంటూ వెళుతుంది.

అందరూ రాత్రి అన్నదమ్ముల ముగ్గురు కలిసి మందు కొడదామని అనుకుంటారు. కానీ అవని రావడంతో తమ ఆలోచనని పక్కన పెట్టేసి సరదాగా ఉంటారు. ఇకపోతే చక్రధర్ తన ఫ్రెండ్ తో కలిసి ఇంకొక నిజాన్ని చెప్పాలి అని బాధపడిపోతూ ఉంటాడు. చక్రధర్ ఇంకొక భయంకరమైన నిజాన్ని నేను మనసులోనే దాచుకుని ఉన్నాను దాని గురించి చెప్పాలంటే నాకు భయమేస్తుంది అని అంటాడు. మనసులోని బాధని పక్కవాళ్ళకి చెప్పుకుంటే కాస్త తగ్గుతుంది అని అంటారు కదా.. ఆ బాధ ఏంటి నాకు చెప్పు అని చక్రధర్ ని తన ఫ్రెండు ఎంతగా అడిగినా సరే.. తాను మాత్రం ఆ నిజాన్ని త్వరలోనే బయటపెడతాను అని అంటాడు..

Advertisement

ఇక పార్వతీ ఎందుకు తన గురించి అలా ఆలోచిస్తుందో తెలుసుకోవాలి అని పల్లవి తనకోసం పాలు తీసుకొని వెళ్లి అసలు నిజం ఏంటో కనుక్కోవాలి అని అనుకుంటుంది. పార్వతి దగ్గరికి వెళ్ళిన పల్లవి ఎంతగా పాలు తీసుకోమని బ్రతిమిలాడిన సరే పార్వతి మాత్రం తనపై కోపంగా ఉంటుంది. ఇక పల్లవి పార్వతిని బలవంత పెట్టడంతో ఆ పాలని విసిరి కొట్టేస్తుంది. ఏంటి అత్తయ్య ఎందుకు పాలని విసర కొట్టారు మీకు అవని అక్కంటేనే ఇష్టమా నేనంటే ఇష్టం లేదా అని పల్లవి అడుగుతుంది. పార్వతీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన పల్లవి నీ చూసి అవని నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళు అనేసి పంపిస్తుంది.

ఏంటి అత్తయ్య నాకు మీరు చెప్పొద్దు అని మీరు ఎందుకు తనపై కోపంగా ఉన్నారు అని అడుగుతుంది పార్వతి. నా కట్టుకున్న భర్తని చంపాలి అనుకున్న దానిపై నాకు కోపం రగిలిపోతుంది. ఓపిక పట్టలేక పోతున్నాను. మొదటినుంచి పల్లవి చేసిన అన్ని పనులు నీకు తెలియడంతో నువ్వు ఇంత ఓపిక ఉన్నవంటే నీకు చేతులెత్తి దండం పెట్టవచ్చు అని పార్వతి అంటుంది.. పల్లవికి పిల్లలు పుట్టి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలి. అప్పుడు ఇలానే ఉంటే ఎలా సాధ్యమవుతుంది. పల్లవి మారుతుందని నమ్మకం నాకు లేదు అని పార్వతి అంటుంది.. పల్లవి తను తను మార్చుకోవాలి అంటే కష్టం చిన్నప్పటినుంచి తన తండ్రిని చూస్తూ పెరిగింది. నేను పల్లవిని మార్చే పనిలోనే ఉన్నాను మీరు ఏమి కంగారు పడకండి అత్తయ్య నేను చూసుకుంటాను అని అవని అంటుంది.

Also Read :రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా.. ఆ ‘ఒక్కటి’ మాత్రం అడగొద్దు: హీరోయిన్ షాకింగ్ డీల్!

భానుమతి రాజేశ్వరి కి ఎంత చెప్పిన సరే చక్రధర్ కి దగ్గర అవ్వడానికి ఒప్పుకోదు. చక్రధర్ తో మంచిగా ఉండాలని ఎంత చెప్తున్నా సరే రాజేశ్వరి కఠినంగా ఉంటుంది. ఇలానే ఉంటే మీరిద్దరూ ఎవరో ఒకరు చచ్చిపోతారు అల్లుడుగారు తినకుండా అంటే ఆయన చచ్చిపోతారే.. అని భానుమతి చెప్తున్న సరే రాజేశ్వరి మాత్రం ఆయన చచ్చిపోతే పిండం పెట్టడానికి కూడా నేను రాను అని లోపలికి వెళ్ళిపోతుంది. చక్రధర్ మాత్రం ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అత్తయ్యకి ఏమైందో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే కమల్ వచ్చి పల్లవితో రొమాంటిక్గా మాట్లాడుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×