E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పార్వతికి మాటిచ్చిన అవని.. పల్లవిపై కమల్ కు అనుమానం.. అవని స్ట్రాంగ్ వార్నింగ్..

Intinti Ramayanam Today Episode: పార్వతికి మాటిచ్చిన అవని.. పల్లవిపై కమల్ కు అనుమానం.. అవని స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Intinti Ramayanam Today Episode March 14 th: నిన్నటి ఎపిసోడ్ లో.. బయటికి వచ్చిన అవని చక్రధర్ శ్రీకర్లు రావడంతో వాళ్లకి మంచినీళ్లు ఇస్తుంది అవని .. ఇందాకటి నుంచి మీ కోసమే వెయిట్ చేస్తున్నానండి వచ్చేసారా మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అని అవని అనగానే పల్లవి ఫీజులు ఎగిరిపోతాయి.. దేని గురించి మాట్లాడాలి అని అక్షయ్ అంటాడు. మీతో ఒక విషయం చెప్పాలి అని పల్లవి ముందరే అవని అనడంతో ఎక్కడ నా గురించి నిజం చెప్తుందో అని టెన్షన్ పడిపోతుంది. అవని కోపంగా ఉండడం గమనించిన పల్లవి కచ్చితంగా ఈరోజు నా పని అయిపోతుంది అని అనుకుంటుంది. ఇక తర్వాత ఆరాధ్య ఎందుకు మీ అమ్మ అంత కోపంగా ఉంది ఏం చేశావు అని అక్షయ్ అడుగుతాడు. నేను ఏం చేయలేదు నాన్న పెద్దవాళ్ళు ఎవరో ఏదో ఒకటి చేసి ఉంటారు అందుకే మమ్మీ అంత కోపంగా ఉంది అనేసి అంటుంది.

రాజేశ్వరి తినిందో లేదో అని చక్రధర్ కనుక్కునేందుకు లోపలికి వస్తూ ఉంటాడు. అది గమనించిన రాజేశ్వరి చక్రధరిని లోపలికి రావద్దు అని అంటుంది.. అమ్మ ఆయన నాకు గదిలోకి వస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పు అని భానుమతికి చెప్తుంది. అవని పల్లవి గురించి నిజం చెప్పదు. కానీ పార్వతి మాటకు అవని నిజం చెప్పకుండా ఆగిపోతుంది. పల్లవికి మాత్రం అవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పార్వతి బాధ పడిపోతూ ఉంటుంది. అక్కడికొచ్చిన అవని ఏంటి అత్తయ్య బాధపడుతున్నారు దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది.. నువ్వు ఎక్కడ నిజం చెప్పేస్తావో పల్లవిని నా కొడుకు ఎక్కడ చంపేస్తారు అని ఇంతవరకు కంగారు పడ్డాను. కానీ నువ్వు ఎక్కడ నిజం చెప్పకుండా నా మాటకు విలువిచ్చావు అని అవని పై ప్రశంసలు కురిపిస్తుంది పార్వతి.. పల్లవి మారుతుంది అని ఒక నమ్మకం నాకు కలుగుతుందా అత్తయ్య అందుకే ఎక్కడ చెప్పలేదు మీకు మాటిస్తున్నాను. ఎవ్వరికీ ఈ విషయాన్ని చెప్పను అని అవని అంటుంది.. ఇక తర్వాత నువ్వు చాలా మంచి దానివి అవని కానీ నేనే అపార్థం చేసుకున్నాను అని పార్వతి బాధ పడిపోతూ ఉంటుంది.

ఇక అందరూ కలిసి బయట పడుకోవాలని అనుకుంటారు. బయట పడుకోవడం వల్ల దోమలు కుడతాయని పార్వతి ఎంత చెప్తున్నా సరే.. ఎవరు కూడా తన మాట వినకుండా బయట పడుకుంటే చల్లగా ఉంటుంది అని అంటారు.. ఇక పల్లవి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా అలాగే చూస్తూ ఉండిపోతుంది. అవని వాళ్లకి మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది మధ్యలో మీరు తలుపు కొడితే అత్తయ్య లేచి రావాలి ఎందుకు ఆవిడకు నిద్ర డిస్టర్బ్ అవ్వాలి అని అందుకే మీకు మంచినీళ్లు తెచ్చి పెట్టాను అని అవని అంటుంది. అక్షయ్ చూసావా అమ్మ మాకు ఏమన్నా అవుతుందని కాదు నీకు నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదని మీ కోడలు ఎలా ఆలోచిస్తుందో చూసావా అని అంటాడు.

Advertisement

పల్లవికి అవని దిమ్మతిరిగి పోయేలా ఒక్కొక్క షాక్ ఇస్తూ వస్తుంది. ఎక్కడో దూరంగా దాక్కొని ఆలోచిస్తూ ఉన్న పల్లవికి అవని వెళ్లి ఒక్కసారిగా షాక్ ఇస్తుంది. నీలో ఈ సడన్ మార్పు ఏంటి అని కమల్ అడుగుతున్నాడు మరి ఏం చెప్పాలి అని అవని అంటుంది. నీలో ఈ మార్పు కి కారణం ఏంటి అన్నది చెప్పమంటావా అని అవని అంటుంది. మరి రేపటి నుంచి లేవగానే ఏం చేయాలో తెలుసు కదా అని అవని అంటుంది. అలాగే అక్క లేచిన తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అవినీకి చెప్పేసి పల్లవి లోపలికి వెళ్ళిపోతుంది.

ఉదయం లేవగానే బయట ఉన్న చెత్తనంతా చూసి పల్లవి వామ్మో ఇదంతా నేను ఉడవాలా అనే షాక్ అవుతుంది. అవని నిజం చెప్తే నన్ను చంపేస్తారు అది తలుచుకుంటేనే నాకు గుండెల్లో వణుకు పడుతుంది దాని బదులు ఇదేనా ఏం కదా అని మొత్తం ఊడ్చేసి చేసి కల్లాపు చల్లి ముగ్గు పెడుతుంది.. పల్లవి చేస్తున్న పని చూసి కమల్ బయటికి వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. అంతేకాదు బయట ఏం జరుగుతుందో తెలుసుకోలేక కంగారు పడిపోతూ ఉంటాడు అప్పుడే అతనికి కేకలు విన్న అందరూ బయటకు వచ్చి ఈ ప్రకృతి వైపరీత్యం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు.. పల్లవిలో ఇంత సడన్ మార్పు ఏంటి అని అందరూ అనుకుంటారు.. మార్పు మంచిదే కదా కన్నయ్య అని కూడా అంటుంది. ఇక తర్వాత పల్లవి ఏం ముగ్గు వేస్తుందో చూడాలని అందరూ అక్కడికి వెళ్తారు..

Also Read : ఇంత పిచ్చేంటి బ్రో..జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఎమోషనల్ స్టోరీ…

పల్లవి నువ్వేంటి ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు అని శ్రేయ డౌట్ గా అడుగుతుంది.. ఇది ముగ్గుగా లేకపోతే క్షుద్ర పూజల మాయలు మంత్రాలు కూడా చేస్తున్నావా ఏంటి అని కమల్ అడుగుతాడు.. నేనేమీ మాయలు చేయడం లేదు మంత్రాలు చేయడం లేదు అని పల్లవి అంటుంది. కానీ అవని మాత్రం ముగ్గు ఎలా వేయాలో నేర్పించి ఇలా రోజు వేయాలి అని అంటుంది. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×