E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి చుక్కలు చూపించిన కమల్.. ఇది అసలు ఊహించలేదు.. భరత్ మారిపోయాడు..,?

Intinti Ramayanam Today Episode: పల్లవికి చుక్కలు చూపించిన కమల్.. ఇది అసలు ఊహించలేదు.. భరత్ మారిపోయాడు..,?
Advertisement

Intinti Ramayanam Today Episode june 23rd: మీనాక్షి ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది అని చక్రధర్ మాట్లాడుతూ ఉంటాడు.. అవని నీకోసం ఎంతో కష్టపడింది.. నువ్వు బయటికి రాకపోయి ఉంటే నేను ఏమైపోయావ్ వాడినో నాకు అర్థం కావట్లేదు మీనాక్షి అని అంటాడు.. ఇక మీనాక్షికి దగ్గు రావడంతో వెంటనే ఉరికి వెళ్లి వాటర్ తీసుకుని వచ్చి మీనాక్షికి ఇస్తూ ఉండగా.. అది చూసిన పల్లవి లవర్స్ లాగా బాగానే ఉన్నారు కదా అని అంటుంది. ఇప్పటివరకు ఈ లవర్స్ లాగే ఉన్నారు కానీ ఎప్పుడు మాత్రం రియాల్టీ గానే ఉన్నారు కదా.. అని పల్లవి అనగానే కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అని చక్రధర్ అంటాడు.  చక్రధర్ పల్లవి మాటలకి కోపంతో రగిలిపోతాడు.. తనని కొట్టబోతాడు కానీ మీనాక్షి ఆపడంతో చక్రధర్ ఆగుతాడు దానికి కూడా పల్లవి మీనాక్షిని అవమానించడం మాట్లాడుతుంది..

పల్లవి పై కమల్ కు అనుమానం..

సుబ్బారావు నీ కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఒక పల్లవికినే ఉంటుంది.. అయితే పల్లవి ఇదంతా చేయలేదు అని వదిన చెప్తుంది కానీ నాకు ఎక్కడో అనుమానం మొదలైంది.. కానీ పల్లవికి తప్ప సుబ్బారావుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు.. పల్లవి నీదంతా చేసింది అని కమల్ అనుమాన పడతాడు.. అయితే పల్లవి రూంలోకి రాగానే కమల్ ఎందుకు కోపంగా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.. వీడు నా గురించి ఏదో ఆలోచిస్తున్నాడు అందుకే ఏదో ఒకటి నన్ను అడగాలని అనుకుంటున్నాడు. అసలు వీడు ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు తెలుసుకోవాలి అని పల్లవి ఏంటి బావ అంత కోపంగా ఉన్నావు అని అంటుంది.. ఆ సుబ్బారావు ని కిడ్నాప్ చేయించింది నువ్వే కదా నేను అన్నయ్య వెళ్లి వాళ్ళని తీసుకురావడానికి వెళ్తే మమ్మల్ని రౌడీలు చేత కొట్టించాలనుకునేది నువ్వే కదా అని పల్లవికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు కమల్. ఆ మాట వినగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. కానీ తెలివిగా తన ఫోన్లో ఎటువంటి ఫోన్ రికార్డు లేదని చూపించి తప్పించుకుంటుంది..

కమల్ దెబ్బకు పల్లవి షాక్..

Advertisement

ఉదయం లేవగానే ఆరాధ్య తనకి బుక్స్ కి అట్టలు వేయించమని అడుగుతుంది.. అయితే కమల్ మాత్రం వేయించలేను అని అంటాడు. కానీ బాబాయ్ నువ్వు నీటుగా వేయాలి అని ఆరాధ్య అంటుంది.. పల్లవి పిన్ని అయితే ఇంకా బాగా వేస్తుంది తనతో నేను చేపిస్తాను ఆగు అని అంటాడు.. ఇక పల్లవి రాదని పల్లవికి అట్టలు వేయమని చెప్తాడు.. ఇక కమల్ చెప్పిన మాటని పల్లవి తప్పక పాటించాలి అని అనుకుంటుంది.. పల్లవి అయిష్టంగా అట్టలు వేస్తూ కమల్ సెటైర్లకి కోపంగా ఉంటుంది. ఏది ఏమైనా కూడా కమల్ మాత్రం పల్లవి పై చాలా కోపంగా ఉంటాడని అర్థమవుతుంది. మొత్తానికి పల్లవి బలవంతంగా అయినా సరే కమల్ చెప్పిన పనులు చేయడంతో మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు..

పల్లవి పై కమల్ కు అనుమానం వచ్చింది..

మా అమ్మని కాపాడడానికి మనం ఎంత రిస్కు తీసుకున్నామో మనకు తెలుసు.. అలాంటిది ఇప్పుడు మా అమ్మని ఏదైనా చేయాలని పల్లవి ఆలోచిస్తుందే… మనం ఒకరిని కాపాడాలని చూస్తే పల్లవి మాత్రం వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి అని చూస్తుంది.. అందుకే ఇప్పుడు మా అమ్మని ఏదో ఒకటి చేస్తూనేమో అని అవని బాధ పడిపోతూ ఉంటుంది.. అక్షయ్ ఆరాధ్యను తీసుకొని స్కూల్ కి వెళ్తాడు.. అవని అక్షయ వాళ్ళని చాలా సంతోషంగా బయటికి పంపిస్తుంది.. ఎదురుగా కొంతమంది ఇంట్లోకి రావడంతో ఎవరు వీరు అని అడుగుతుంది అవని.. కానీ అక్షయ్ మాత్రము ఎవరికోసమో విలువచ్చినట్లున్నారు.. నీకు ఎవరు కావాలండి అని అడుగుతాడు.. మేము పల్లవి ఫ్రెండ్స్ అని చెప్పగానే పల్లవి లోపలే ఉంది వెళ్ళండి అని అవని పంపిస్తుంది.

మీనాక్షికి ఘోర అవమానం..

Advertisement

పల్లవి ఫ్రెండ్స్ లోపలికి రాగానే పల్లవి భానుమతిని కాఫీ పెట్టి తీసుకురామని అంటుంది.. చేతగాడం లేదే నువ్వే పెట్టుకో అనేసి అనగానే అప్పుడే అక్కడ కనిపించిన మీనాక్షిని చూసి పల్లవి ఏయ్ ఇక్కడ మా అందరికీ కాఫీలు పెట్టి తీసుకురావాలి అని ఆర్డర్ వేస్తుంది.. ఇక మీనాక్షి తప్పక వాళ్లందరికీ కాఫీ పెట్టి తీసుకొని వెళుతుంది.. అయితే అక్కడ పల్లవి ఫ్రెండ్స్ కి మీనాక్షి పొరపాటున కాఫీ మీద పడిపోతుంది.. కాఫీల మీద పడిపోవడానికి కారణం మీనాక్షి అని పల్లవి చాలా కోపంగా ఉంటుంది.. కాఫీ ఇవ్వడం కూడా నీకు చేత కదా ఈ వయసులో నువ్వు భర్తతో కొలుకుతున్నావని ఘోరంగా అవమానించడం మాట్లాడుతుంది. అయితే పల్లవి మాటలుకు బాధపడ్డ మీనాక్షి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. ప్రభావతికి ఎన్ని కష్టాలో.. కుక్కల దెబ్బకు మనోజ్ కు షాక్.. దిగొచ్చిన ప్రభా..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×