E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: హమ్మయ్య మీనాక్షి రిలీజ్.. పల్లవి మైండ్ బ్లాక్.. కమల్ కు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: హమ్మయ్య మీనాక్షి రిలీజ్.. పల్లవి మైండ్ బ్లాక్.. కమల్ కు నిజం తెలుస్తుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode june 21st: సాక్షులను చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆరోజు ఏం జరిగింది చూసింది మేమే.. మేము నిజం చెప్తాము అని సుబ్బారావు ఆయన భార్య నిర్మల బోనులోకి వెళ్లి అక్కడ జరిగిన విషయాన్ని బయటపడతారు. రాజేశ్వరి కాలుజారి రాయి మీద పడిపోయి చనిపోయింది ఇందులో మీనాక్షి తప్పేమీ లేదు అని వాళ్ళు చెప్పగానే అది నమ్మిన జడ్జి మీనాక్షి నిర్దోషి అని వదిలేస్తారు. మీనాక్షి నిర్దోషిగా విడుదలైందని అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కానీ పల్లవి మాత్రం అవని సంతోషాన్ని చూసి కుళ్ళుకుంటుంది.. అవని ఇంత సంతోషంగా ఉండడం నేను భరించలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉంటుంది..

మీనాక్షి రిలీజ్ అవ్వడంతో అవని హ్యాపీ..

సుబ్బారావు వాళ్ళు సాక్ష్యం చెప్పడం వల్లే మా అమ్మ రిలీజ్ అయింది అని వాళ్ళ దగ్గరికి వెళ్లి చాలా థాంక్స్ అండి అని అడుగుతుంది. నిర్దోషికి శిక్ష పడకుండా చేయాలని అనుకున్నాము. ఇక మీనాక్షి తన కూతురు సాధించింది అని చాలా గర్వంగా ఉంటుంది. ఇక కోర్టులో ఫ్యామిలీ సీన్ చూసి పల్లవి రగిలిపోతూ ఉంటుంది.. అవని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు.. ఆ మీనాక్షిని ఎలాగైనా సరే జీవితాంతం జైల్లో కూర్చోబెట్టి తల్లి లేకుండా చేద్దాము అని అనుకున్నాను. కానీ మీనాక్షి మాత్రం జైలు నుంచి విడుదలైంది అవన్నీ చాలా సంతోషంగా ఉంది అని పల్లవి కోర్టులోనే ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటుంది.. అది చూసిన అవన్నీ పల్లవి ప్లాన్ మరోసారి ఫెయిల్ అయింది అని ఆలోచిస్తూ ఉంటుంది.

మీనాక్షికి గ్రాండ్ వెల్కమ్..

Advertisement

నిర్దోషిగా ఇంటికి వచ్చినా మీనాక్షి కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. నిర్దోషిగా వచ్చింది అని చాలా సంతోషంగా ఉంటారు. ఇక పార్వతి ఆమెకు హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకువెళ్లడం చూసినా పల్లవి కడుపు మంటగా ఉంది అని బాధపడుతుంది. ఇక తర్వాత ఆరాధ్య అమ్మమ్మ నువ్వు మళ్ళీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా మిస్ అవుతున్నాను అని బాధ పడిపోతుంది. ఇప్పుడు ఎందుకు బాధపడడం నేను వచ్చేసాను కదా మా అని మీనాక్షి అనగానే ఆరాధ్య చాలా సంతోషంగా ఉంటుంది. ఇదంతా చూసిన పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది..

పల్లవికి అవని వార్నింగ్..

మీనాక్షి నిర్దోషిగా ఇంటికి రావడం చూసిన పల్లవి చాలా కోపంగా ఉంటుంది. ఏంటి ఈ సంతోషాన్ని చూసి భరించలేకపోతున్నావా? నాకు తల్లిని దూరం చేస్తాను అని అన్నావు కానీ మీ ప్లాన్ దారుణంగా ఫెయిల్ అయింది.. మా అమ్మని నువ్వు ఏమి చేయలేవు అని పదవికి అవని వార్నింగ్ ఇస్తుంది.. నువ్వు ఇలా ప్లాన్ చేయడం చివరికి నువ్వే ఓడిపోవడం మొదటినుంచి జరుగుతూనే ఉంది కదా.. మరి ఎందుకు ఇప్పుడు కొత్తగా బాధపడుతున్నావు అని అవని పల్లవిత అంటుంది. ఇవాళ మీ అమ్మ వచ్చిందని సంతోష పడుతున్నావు కదా ఇక మీ అమ్మని ఎలా దూరం చేయాలో అది ఆలోచిస్తాను నా నుంచి మీ అమ్మని దూరం చేయలేరు అని పల్లవి అంటుంది.. నీకు చేతనేది చేసుకో మా అమ్మని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని అవన్నీ కూడా పల్లవికి ఛాలెంజ్ చేస్తుంది..

పల్లవి పై కమల్ కు అనుమానం..

Advertisement

మీనాక్షిని టార్గెట్ చేసిన పల్లవి తాను రిలీజ్ అయ్యి ఇంటికి రావడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మీనాక్షిని ఇలా చూడడం నాకు అస్సలు నచ్చలేదు అని తన దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇస్తుంది.. ఈ మీనాక్షిని మళ్లీ ఎలాగైనా సరే శాశ్వతంగా దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది.. అసలు సుబ్బారావు వాళ్లని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు.. కేవలం పల్లవికి మాత్రమే ఆ అవసరం ఉంది.. అంటే పల్లవి నీ వాళ్ళని కిడ్నాప్ చేయించిందా అని కమల్ ఆలోచిస్తూ ఉంటాడు.. వదిన ని అడిగితే అసలు విషయం బయటకు వస్తుంది అని ఎవరి దగ్గరికి వెళ్లి అడుగుతాడు.. ఇక పల్లవి పై నిజంగానే అనుమానం మొదలవడంతో తనకి దిమ్మ తిరిగిపోయేలా వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. పల్లవి పై కమల్ కి అనుమానం మొదలైపోయింది కాబట్టి ఇక తనకి చుక్కలు చూపిస్తాడని అర్థమవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: అమూల్య పై విశ్వం రివేంజ్.. విశ్వంకు ధీరజ్ వార్నింగ్.. వల్లికి కచేరి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×