E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: సుబ్బారావు కోసం కమల్ మాస్టర్ ప్లాన్.. కమల్ గెటప్ అదుర్స్.. పల్లవికి మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Today Episode: సుబ్బారావు కోసం కమల్ మాస్టర్ ప్లాన్.. కమల్ గెటప్ అదుర్స్.. పల్లవికి మైండ్ బ్లాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode june 19th: అవని ఇక్కడ సుబ్బారావు ఉన్నాడని మనకు కన్ఫామ్ గా తెలియదు కదా ఎలా తెలుసు కమల్ అని అడుగుతుంది.. నిజంగానే ఇక్కడ సుబ్బారావు ఉన్నాడా లేదో నేను కన్ఫామ్ చేసుకొని వస్తాను వదినా అని బలవంతంగా లోపలికి వెళ్ళిన కమల్ అక్కడ సుబ్బారావు ఉన్నాడని తెలుసుకొని బయటికి వస్తాడు.. పల్లవిని సుబ్బారావుని ఇక్కడ దాచింది అని అవని అనుమాన పడుతుంది. మొత్తానికి సుబ్బారావుని బయటికి తీసుకొచ్చేందుకు అవని అలాగే కమల్ ఇద్దరు కూడా మాస్టర్ ప్లాన్ చేస్తారు..

లేడీ గెటప్ లో కమల్.. 

వదిన ఆ సుబ్బారావు ఇక్కడే ఉన్నాడు కాబట్టి నేను వాడిని తీసుకొని వస్తాను కాకపోతే రౌడీలున్నారు వదిన అని కమల్ అనగానే అవని టెన్షన్ పడుతుంది.. రౌడీలతో ఇప్పుడు రిస్క్ ఎందుకు కన్నయ్య ఆల్రెడీ పోలీస్ కేసు అమ్మ వల్ల మనం తిరుగుతూనే ఉన్నాము. ఇప్పుడు మళ్లీ నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను కన్నయ్య అని అవని బాధ పడిపోతుంది. కానీ కమల్ ఆ రౌడీయా సంగతి నేను చూసుకొని వాళ్ళని ఒక ప్లేస్ లో పెడతాను.. నువ్వేమీ టెన్షన్ పడకు వదిన నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పంపిస్తాడు.. ఇక రౌడీలను ఎలాగైనా ట్రాప్ లో పెట్టాలి అని లేడీ గెటప్ లో అక్కడికి వస్తాడు.. కమల్ లేడీ గెటప్పు ఎపిసోడ్కి హైలైట్ గా నిలిచింది..

నిర్మలకు రౌడీలు షాక్..

Advertisement

మనము సేఫ్ గా ఉంటామని చెప్పాను కదా అయినా కూడా ఈ పల్లవి రౌడీలను పెట్టింది అని నిర్మల అనుకుంటుంది.. ఈ రౌడీలు మన ముందరే మందు తాగుతున్నారు ఏంటి నాకు ఈ కర్మ అని సుబ్బారావు ఆలోచిస్తూ ఉండగా నిర్మల రౌడీల దగ్గరికి వెళ్లి ఇక్కడ లేడీస్ ఉన్నారు అన్న కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఎలా తాగుతున్నారు అని అంటారు. అయితే ఎక్కువ మాట్లాడితే ఈ మందు మీ చేత తాగిస్తాను అని రౌడీ అనగానే నిర్మల షాక్ అవుతుంది. నాతో మాట్లాడినట్టుగా రౌడీలతో మాట్లాడితే వాళ్ళెందుకు ఊరుకుంటారు అని సుబ్బారావు అంటాడు. ఇద్దరు రౌడీలు మందు కొడుతున్న సందర్భంలో కమల్ లేడీ గెటప్ లో అక్కడికి వస్తాడు..

తెలివిగా దెబ్బ కొట్టిన కమల్..

రౌడీల దగ్గరికి వెళ్లిన కమల్ లేడీ గెటప్ లో కనిపించడంతో రౌడీలు బ్యాక్ నుంచే ఇంత బాగుంది ఫ్రెంట్ ఇంకెంత బాగుంటుందో అని అనుకుంటారు. ఇక కమల్ కూడా అమ్మాయిలాగా నటించడంతో రౌడీలు నిజంగానే అమ్మాయి వచ్చిందేమో అనుకొని అతని ట్రాప్ లో పడిపోతారు.. కమల్ తెలివిగా ఇద్దరు రౌడీలకు మత్తుమందు ఇచ్చి పడిపోయేలా చేస్తాడు. ఆ తర్వాత నిర్మల సుబ్బారావు దగ్గరికి వచ్చిన కమల్ ప్లేస్ చేంజ్ అంటూ వాళ్ళని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు.. కమల్ ఎలాగైనా సరే వీళ్ళని మార్చేశాను కదా రేపు కోర్టుకు తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటాడు..

అవని పై అక్షయ్ సీరియస్.. 

Advertisement

సుబ్బారావు కోసం వెతకడానికి వెళ్లిన అవని కమల్ ఇంకా ఇంటికి రాలేదు అని అక్షయ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంటికొచ్చిన అవని ఆ పల్లవిని వాళ్ళని దాచి పెట్టిందండి అని అక్షయతో చెప్తుంది. మాట వినగానే అక్షయ్ కోపంతో రగిలిపోతాడు. పల్లవిది చాలా క్రిమినల్ బ్రెయిన్ రోజురోజుకి తను క్రిమినల్ లాగా మారిపోతుంది.. నీ చెల్లెలు కాబట్టి నువ్వు ఆమె తప్పులని క్షమిస్తూ వస్తున్నావు అందుకే పల్లవి ఇంకాస్త రెచ్చిపోతుంది. పల్లవి ఇలా మారడానికి కారణం నువ్వే అంటూ అవని పై అక్షయ సీరియస్ అవుతాడు. ఆ సుబ్బారావు వాళ్ళని కమల్ తీసుకొని వస్తాడు అని అనగానే పల్లవి కమల్ కి భయపడుతుంది కాబట్టి అదే మేలు అని అక్షయ్ అంటాడు. ఇక శ్రేయ పల్లవిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. కానీ పల్లవి మాత్రం శ్రేయ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది..

కమల్ పై పల్లవికి అనుమానం..

కమల్ ఎలాగైనా సరే ఆ సుబ్బారావుని తీసుకొని వస్తాను అని చెప్పాడు కదా.. మరి నిజంగానే కమల్ ఆ సుబ్బారావు వాళ్ళని కనిపెట్టాడో లేదో తెలుసుకోవాలని పల్లవి కమల్ కి ఫోన్ చేస్తుంది. సుబ్బారావు ఎందుకు కోర్టుకు రాలేదు అని అడిగితే కొన్ని పరిస్థితుల వల్ల రాలేదు అని చెప్తాడు. అంతే కాదు సరోజ తెచ్చిన బిర్యాని ఇవ్వడంతో దాన్ని లొట్టలు వేసుకుంటూ తింటాడు. సరోజ ను ఎందుకు సుబ్బారావు లవ్ చేస్తున్నాడు అన్నది కమల్ చెప్పగానే అవును నువ్వు చెప్పింది నిజమే అబ్బాయని సుబ్బారావు అంటాడు. పల్లవి ఫోన్ చేయగానే కమల్ సీరియస్ అయ్యి ఫోన్ పెట్టేస్తాడు. సుబ్బారావు నిజంగానే వీళ్ళకి దొరికాడా లేదా అన్నది తెలుసుకోవాలి అని పల్లవి అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో సుబ్బారావు వాళ్ళు దొరికిన విషయాన్ని శ్రీకర్ కోర్టులో చెప్తాడు.. కానీ పల్లవి మాత్రం మధ్యలోనే రౌడీలతో అటాక్ చేయిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో సుబ్బారావు నిర్మల కోర్టులో నిజం చెప్తారా లేదా అన్నది చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. వల్లికి కచేరి స్టార్ట్.. రిస్క్ లో పడ్డ ప్రేమ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×