E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: భరత్ కు చక్రధర్ స్ట్రాంగ్ వార్నింగ్.. సుబ్బారావు రొమాన్స్.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Intinti Ramayanam Today Episode: భరత్ కు చక్రధర్ స్ట్రాంగ్ వార్నింగ్.. సుబ్బారావు రొమాన్స్.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..
Advertisement

Intinti Ramayanam Today Episode june 10th : సుబ్బారావు ఇంట్లోని సీసిటీవీ పు్టేజ్ ను ఎలా సంపాదించాలని కమల్ ఆలోచిస్తుంటాడు. సుబ్బారావుకు పక్కింటి ఆవిడతో లవ్ ఉందని బయటపడుతుంది.. వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా కమల్ ఓ వీడు చూడ్డానికి సిలిండర్ లాగా ఉన్న వేడిలో కూడా ఉందా అని మొత్తం వీడియో తీస్తాడు. లేటు వయసులో ఘాటు ప్రేమ మొదలవడంతో కమల్ వీళ్ళ ప్రేమని చూసి తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటాడు. సుబ్బారావు తన భార్య లేదు అని ప్రియురాలితో చాటుగా మాట్లాడుతూ నవ్వుతూ ఒకరినొకరు తాకుతూ మురిసిపోతూ ఉండగా కమల్ దొరికిపోయావు సుబ్బారావు అని ఆ వీడియో తీసి పెట్టుకుంటాడు.. అదే ఎపిసోడ్ కు హైలెట్ అవుతుంది..

భరత్ కు చక్రధర్ స్ట్రాన్ వార్నింగ్..

భరత్ ఒంటరిగా కూర్చోవడం చూసిన చక్రధర్ అలాగే అవనీలు భరత దగ్గరికి వెళ్తారు.. వీరిద్దరూ ఎందుకు భరత్ దగ్గరికి వెళ్ళారా అని పల్లవి చాటుగా విని ఆలోచిస్తూ ఉంటుంది. రాజేశ్వరి అమ్మకి దశకర్మ నిర్వహించాలి.. నాకు ఉద్యోగం ఇచ్చి ఆదుకున్న అమ్మ లాంటి రాజేశ్వరిని చంపేసి మీరు నాకు తీరని ద్రోహం చేశారు అని భరత్ అవనిని తిడతాడు.. చక్రధర్ నీకేం తెలుసు రాజేశ్వరి గురించి 30 ఏళ్లు కాపురం చేసిన నాకు తెలుసు అని చక్రధర్ భరత్ పై సీరియస్ అవుతాడు.. నా భార్య గురించి నీకు అసలు ఏం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు.. నేను నా భార్యను వదిలేసి వెళ్ళిపోయాను తప్ప విడాకులు ఇచ్చేసి వదిలించుకోలేదు.. నువ్వు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని జరిపించాలి అని అంటాడు. చక్రధర్ మాటలు విన్న భరత్ కాస్త భయపడిపోయి లోపలికి వెళ్ళిపోతాడు..

వీడియో చూసి సుబ్బారావు షాక్..

Advertisement

సరూ ఇచ్చిన చికెన్ ని లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటాడు సుబ్బారావు. అయితే సుబ్బారావు చికెన్ ముక్కల్ని కోరుతూ సరూ గురించి ఆలోచిస్తూ తింటూ ఉంటాడు.. అయితే సరూ తో ఫోన్ మాట్లాడుతూ తింటూ ఉండగా కమల్ తలుపు కొడతాడు.. ఏంటి మల్ల ఎందుకు వచ్చావు అని కసురుకుంటాడు సుబ్బారావు. ఆ వీడియో లేదని చెప్పాను కదా మళ్లీ ఎన్నిసార్లు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తావెందుకు..? నేను ఒక ఇంపార్టెంట్ ఫారిన్ కాల్ మాట్లాడుతున్నాను ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అని చిరాకు పడతాడు సుబ్బారావు.. నువ్వు వెళ్ళు అని తలుపు వేసుకుంటాడు. అయితే సుబ్బారావు మళ్లీ లోపలికి వెళ్లిన తర్వాత కమల్ తలుపు కొడతాడు.. నేను ఒక వీడియోని తీశాను మీరు ఒకసారి ఆ వీడియోని చూడాలి అంకుల్ అని అనగానే అది చూసిన సుబ్బారావు ఫ్యుజులు ఎగిరిపోతాయి..

భార్య ఎంట్రీతో షాక్..

కమల్ తో సుబ్బారావు మాట్లాడుతూ ఉండగా ఆయన భార్య నిర్మల అక్కడికి వస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ గురించి నువ్వు మాట్లాడద్దు అని చెప్పాను కదా.. మళ్లీ మాట్లాడుతున్నావ్ ఏంటి అసలు వీడితో నీకు మాటలు ఏంటి పదా లోపలికి అని అంటుంది. ఈ అబ్బాయి ఏదో వీడియోలు తీసాడంట వాటిని చూస్తూ ఉన్నాను అని అంటాడు. అది కాదండి ఈ వీడియోని మీరు కూడా ఒకసారి చూడాలి అని కమల్ చూపిస్తూ ఉండగా సుబ్బారావు ఆ వీడియోలు మాత్రం చూపించొద్దు అని బ్రతిమలాడుతాడు.. మా ఆవిడ కాసేపట్లో మళ్ళీ బయటికి వెళ్తుంది మీరు వస్తే మీకు ఆ వీడియో చూపిస్తాను అని అంటాడు సుబ్బారావు.

అవనికి గుడ్ న్యూస్..

Advertisement

మా అమ్మని బయటకు తీసుకొచ్చి ఆలోచన రావడం లేదు అని అటు అవని ఇటు చక్కగా ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే అప్పుడే కమల్ అక్షయ్ ఇంట్లోకి వచ్చి వదినా నీకు గుడ్ న్యూస్ అని చాలా సంతోషంగా చెప్తాడు. పల్లవి పైనుంచి కిందకి దిగి రావడం చూసి కమల్ మాట మార్చి వేరే మాటలు మాట్లాడుతాడు.. మొత్తానికి అక్కడ సుబ్బారావు సిసి టీవీ ఫుటేజ్ను ఇస్తానని చెప్పినట్లు అవనితో చెప్తాడు.. సరే నాన్న నువ్వు ఇక్కడే ఉండు మేము ఫుటేజ్ చూడడానికి వెళ్తాము అని అక్కడికి వెళ్తారు.. అయితే సుబ్బారావు ఫుటేజ్ ఇచ్చే టైంకి వాళ్ళ ఆవిడ వస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :‘పొదరిల్లు’ లో మహా బాస్ విక్కీ బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×