E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి మాటతో షాక్.. వంట అద్భుతంగా ఉంది.. అశ్విన్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Intinti Ramayanam Today Episode: పల్లవి మాటతో షాక్.. వంట అద్భుతంగా ఉంది.. అశ్విన్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..
Advertisement

Intinti Ramayanam Today Episode july 30th: పల్లవి ఇంత పొద్దునే లేసి పూజ చేయడం ఏంటి అని భానుమతి అలాగే కమల్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇంత ఉదయమే పల్లవి లేచింది ఏంటి నేను చూస్తుంది నిజమా కాలనా అని కమల్ కూడా ఆశ్చర్యంలో మునిగిపోతాడు. పల్లవి వచ్చి హారతి తీసుకుని అనగానే నువ్వు ఇంత పొద్దున్నే లేచి ఇలా చేశావు అంటే అక్కలు నమ్మలేకున్నాను అని కమల్ అంటాడు.. ఇక పల్లవి కాఫీ తీసుకొని పార్వతి దగ్గరికి వెళ్ళగానే పార్వతి కూడా ఇలానే షాక్ అవుతుంది. ఇక పల్లవి లోపలికి రాగానే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు.. శ్రీకర్ ఏంటి పల్లకి ఎంత పొద్దున్నే లేచింది అని ఆశ్చర్యపోతారు. అవనితో సహా ఇంట్లోని వాళ్లందరూ పల్లవిలో ఇంత మార్పు ఏంటి అనే షాక్ఉండిపోతారు.

పల్లవి ని చూసి షాక్..

పల్లవి పొద్దున్నే లేచి పూజ చేయడంతో పాటుగా అందరికీ కాఫీలు టీలు ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా ఈ మార్పులో కారణమేంటి అని షాక్ అవుతారు. పల్లవి ఇంత పొద్దున్నే లేచి పూజ చేసిందా ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతారు.. ముఖ్యంగా భానుమతి పల్లవిలో ఇంత మార్పు నేను అస్సలు ఊహించలేదు అంటూ షాక్ లోనే ఉండిపోతుంది. ఉదయం లేచి ఇల్లంతా శుభ్రం చేసి బయట ముగ్గులు వేసి, పూజ చేసి అందరికీ కాఫీలు టీలు అందివ్వడం చూసినా ఇంట్లోని వాళ్ళందరూ అసలు ఏదో జరిగింది అని అనుమానపడతారు.. అంతే కాదు ఒకరినొకరు కలుసుకొని ఏమైంది అని అనుకుంటారు.. పల్లవి మీ అందరికీ భోజనం కూడా సిద్ధం చేశాను ముందు బ్రష్ చేయరండి అని అంటుంది ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా నోర్లు తెరిచి చూస్తూ ఉంటారు..

పల్లవి వంట అదుర్స్..

Advertisement

పల్లవి ఇంతగా మారిపోతుందని అసలు ఊహించలేదు అంటూ.. పార్వతీ నుంచి భానుమతి వరకు ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు.. పల్లవి చేసిన వంటని చూసి పల్లవి నువ్వు ఇన్ని రకాల వంట చేసావా అని అనుకుంటారు. ఒక్కొక్కరికి కావలసిన విధంగా పల్లవి అందరికీ కలిపి వంటలు చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎప్పుడూ వంటగది మొహం కూడా చూడని పల్లవి ఇప్పుడు ఇలా అందరి కోసం వంట చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతారు. అంతే కాదు ఒక్కొక్కరికి ఇష్టమైన వంటని కూడా చేసి పెట్టడంతో అందరూ ప్లేట్లను చూసి పల్లవిని చూసి ఏమైంది ఇవాళ ఏదో వింత జరుగుతుందని అనుకుంటారు.. అంతే కాదు పల్లవి చేసిన ప్రతి ఒక్క ఐటమ్ అదిరిపోయింది సూపర్ అంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తారు. అతనికి పల్లవి అందరి దృష్టిలో మంచిది అని అనిపించుకునేస్తుంది.

పల్లవి మాటతో మీనాక్షి కన్నీళ్లు..

పల్లవి మీనాక్షి వెళ్తూ ఉంటే అమ్మ నన్ను క్షమించమ్మా అని అనగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది మీనాక్షి. పల్లవి నన్ను ఇలా పిలుస్తుంది ఏంటి అని ఆశ్చర్య పోతుంది. పల్లవి ఎప్పుడూ నన్ను తిడుతూ ఉంటుంది కదా అలాంటిది ఇలా మాట్లాడుతుంది అని షాక్ లో ఉండిపోతుంది మీనాక్షి.. నన్ను క్షమించమ్మా మిమ్మల్ని చాలా బాధపెట్టాను అని మీనాక్షి నీ పల్లవి అడుగుతుంది. అంతేకాదు కాళ్లు పట్టుకొని మరి క్షమించమని అడగడంతో తను ఎమోషనల్ అయిపోతుంది. నా కూతురు నన్ను అమ్మ అని పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని కరిగిపోతుంది మీనాక్షి.. మొత్తానికి పల్లవి మార్పుని చూసి అందరూ షాక్ అవుతారు అంతేకాదు సంతోషపడతారు.

అవని దెబ్బకు అక్షయ్ షాక్..

Advertisement

అవని మీ చెల్లెలు ఇంత మారిపోతుందని నేను అస్సలు ఊహించలేదు అంటూ అక్షయ్ అంటాడు. మీ చెల్లెలు పూర్తిగా మారిపోయింది కదా.. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడొచ్చు కదా అని అక్షయ్ ఎంత చెబుతున్నా సరే..అవని మాత్రం మీతో మాట్లాడటం నాకు అసలు ఇష్టం లేదు అన్నట్లుగా పేపర్లో రాసి ఇస్తుంది. మీ చెల్లెలు మారిపోయిన కూడా నీలో ఎందుకు ఇంత మార్పు రావట్లేదు అని అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు. ఇకపోతే అక్షయ్ మీ చెల్లెలు మాట్లాడింది కదా ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అక్షయ్ ఎంతగా బ్రతిమిలాడిన సరే అవని మాత్రం అస్సలు వినదు. ఇకపోతే శ్రీకర్ శ్రీయ ఇద్దరు కూడా రవీంద్ర ప్రసాద్ రాగానే ఇంట్లోని వాళ్ళందరూ పూర్తిగా మారిపోయారు అని చాలా సంతోషంగా ఉంటారు.. వీడు చాలా అదృష్టవంతుడు వీడి వల్ల ఇదంతా జరిగింది అని వాళ్ళిద్దరూ మురిసిపోతూ తమ కొడుకుపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.. పల్లవి మాత్రం అందరితో సంతోషంగా ఉండాలి అని అనుకుంటుంది కానీ అశ్విన్ ఫోన్ చేసి తనని ఇబ్బంది పెడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో అశ్విన్ పల్లవి గురించి అన్ని నిజాలు చెప్తాడా లేదా చూడాలి…

Also Read : మూవీ లవర్స్ కు జాతరే.. టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×