E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..
Advertisement

Intinti Ramayanam Today Episode july 19th: ఈ వీడియోను మళ్లీ అందరితో కలిసి ఒకసారి చూద్దు పది లోపలికి అని చెంప పగలగొడుతుంది.. పద వెల్దామని అవని బెదిరించడంతో పల్లవి అక్క వద్దక్క ఈ వీడియో చూస్తే కమల్ నన్ను చంపేస్తాడు.. అవును బాబు నగలు తీసింది నేనే అని పల్లవి నిజం ఒప్పేసుకుంటుంది.. ఆ నగలని ఎందుకు తీసావు అని అవని అడుగుతుంది.. ఒక చిన్న పని వల్ల తీయాల్సి వచ్చింది అక్క రెండు రోజులు నేను ఆ నగల్ని తెచ్చి మళ్ళీ నీ చేతికి ఇస్తాను అని పల్లవి చెప్పగానే.. అవని ఏం జరుగుతుంది ఎందుకు భయపడుతుంది అని ఆలోచిస్తుంది..

పల్లవి ఏదో సమస్యలో ఇరుక్కుంది..

పల్లవి ఎందుకింత కంగారుపడుతుంది. ఏదో పెద్ద తప్పే చేసి ఉంటుంది. పల్లవి ఇంత కంగారు పడుతూ ఉండడం నేనెప్పుడూ చూడలేదు. చెప్పుకోలేని తప్పు చేసింది. పల్లవి ఇంత భయపడుతుంది.. ఏదైనా సమస్యలో ఇరుక్కుంటుందా..? లేకుంటే పల్లవికి కొత్త శత్రువులు ఎవరైనా తయారయ్యారా.?  ఏదో జరుగుతుంది పల్లవి ఏదో సమస్యలో ఉన్నట్లుంది అదేంటో తెలుసుకోవాలి అని అవని అనుకుంటుంది.. పల్లవి కంగారు పడుతుండడం చూసి అవనికి ఇంకాస్త అనుమానం పెరుగుతుంది.. ఎలాగైనా సరే పల్లవి అంత టెన్షన్ పడడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది.. పల్లవి మాత్రం అవని అక్కకు నా గురించి తెలిస్తే మొత్తం బయటపడిపోతుంది అని కంగారు పడిపోతూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది.

శ్రీయ ఎంతపని చేశావ్..

Advertisement

బాబుకి దిష్టి తీసి పాలు పట్టించాలి అని అవని అన్ని సిద్ధం చేసి పెడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన పార్వతి నేను కూడా బాబుకి దిష్టి తీయాలని వచ్చానమ్మా అని అంటుంది.. అత్తయ్య బాబుకి నేను దిష్టి తీస్తాను లేండి పాలు పట్టాలి అని అంటుంది.. బాబు ఏడుస్తున్నాడు ఏమైంది అని శ్రీయాను అడుగుతారు.. బాబుకి పాలు పట్టించాలని అనుకున్నాను నాకు గుండెల్లో నొప్పి తీస్తుంది అత్తయ్య అని అంటుంది.. అదేంటి శ్రీయ నీకు పాలు పడలేదనే కదా పోత పాలు పోస్తున్నాము మళ్లీ ఎందుకు నువ్వు ఇంతగా సాహసం చేస్తున్నావు అని అవని అంటుంది.. తల్లిగా నా బిడ్డకి పాలు ఇవ్వాలని అనుకోవడం తప్ప అక్క అని శ్రేయాస్ ఫీల్ అవుతుంది. కన్నతల్లి గాని నువ్వు ఆలోచించడం తప్పులేదు శ్రియ కానీ నీ పరిస్థితి కూడా నువ్వు ఆలోచించుకోవాలి అని అనగానే సరే అక్క ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అని అంటుంది..

పల్లవి పై శ్రీయకు అనుమానం..

అవని వంట గదిలోకి వెళ్లిన తర్వాత నువ్వు ఇలా చేస్తావని నేను అసలు ఊహించలేదు అవని అని పార్వతి అంటుంది. నేనేం చేశాను అత్తయ్య ఏం జరిగిందో చెప్పండి అని అవని అంటుంది. నువ్వు ఆ బంగారు తీసిన తర్వాత చెప్పాలి కదా నేను ఇంకా పోయాయని చాలా ఫీల్ అయ్యాను అని పార్వతి అంటుంది. నువ్వు ఒక మాట నాకు చెప్పి ఉంటే నేను కంగారు పడిపోయేదాన్ని కాదు కదా అని పార్వతి అంటూ ఉండగా శ్రీయ నాకెందుకో అవని మీద అనుమానంగా ఉంది కానీ అంటుంది. వీళ్ళందరూ మాట్లాడుకోవడం విన్న పల్లవి నా గురించి వీళ్లకు అనుమానం వచ్చింది ఆ నగలని నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే వీళ్ళకి నా మీద అనుమానం రాకుండా చేసుకోవాలి అని పల్లవి అనుకుంటుంది..

అవని పై అక్షయ్ సీరియస్..

Advertisement

నువ్వు అసలు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అవని అని అక్షయ్ అనగానే అవని షాక్ అవుతుంది. ఏమైందండీ నేనేం చేశాను అని అవని అడుగుతుంది.. చేసినంత నువ్వే ఆ విషయం నీకు తెలియట్లేదు అని అవని అనగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. పల్లవి చేసిందని తెలిసి కూడా నువ్వు ఎందుకు ప్రతిసారి సమర్థిస్తున్నావు. తను నీ చెల్లెలే కావచ్చు కానీ నువ్వు ఇలా చేయడం వల్ల తనకి విలువ లేకుండా పోతుంది అని అక్షయ పెద్ద క్లాస్ పీకుతాడు. అది విన్న అవని నేనేం చేసినా ఒక అర్థం ఉంటుంది మీరు కంగారు పడకండి అని అంటుంది. ఇక అవని అక్షయ్ ఇద్దరు గొడవపడతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×