E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode : అవనిని కొట్టిన పార్వతి.. అవనికి మరో ఘోర అవమానం..

Intinti Ramayanam Today Episode : అవనిని కొట్టిన పార్వతి.. అవనికి మరో ఘోర అవమానం..
Advertisement

Intinti Ramayanam Today Episode January 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో వాళ్ళందరూ అవనిదే తప్పని అవని డబ్బు మనిషిని నానా మాటలు అంటారు పార్వతి కూడా నువ్వు ఒక అనాధవి అయినా నీకు డబ్బు పిచ్చి ఏంటి మంచి కుటుంబం దొరికిందని ఆలోచించాలిగాని ఇలా ఆలోచిస్తావని అవనిని దారుణంగా తిడుతుంది. అది విన్న పల్లవి సంతోషంతో మురిసిపోతుంది. ఇక లాయర్ ది తప్పని లాయర్ ని తీసుకురమ్మని అవన్నీ చెప్తుంది. రాజేంద్రప్రసాద్ లాయర్ ని పిలిపిస్తాడు. లాయరు ఇంటికొచ్చి అవని చెప్పినట్టే రాసానని అవనికి షాక్ ఇస్తాడు. నేను మీకు 40 ఏళ్ల మీ ఫ్యామిలీ లాయర్ గా పనిచేస్తున్నాను కానీ మీ ఫ్యామిలీ గొడవల్లోకి నన్ను లాగకండి మీ కోడలు చెప్పినట్టే నేను రాస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఇక లాయర్ చెప్పిన తర్వాత కూడా నీ మాటలే నమ్మమంటావా? నువ్వు చేసింది తప్పు అని పార్వతి అంటుంది. ఇక పల్లవి ఇంట్లో జరిగిన రచ్చ గురించి వాళ్ళ నాన్నతో చెప్తుంది.. ఇక అవని లాయర్ దగ్గరికి నిజం తెలుసుకోవాలని బయలుదేరుతుంది లాయర్ ని దుమ్ము దులిపేసి అసలు నిజం బయట పెట్టిస్తుంది. ఇదంతా చేసింది పల్లవిని అని తెలుసుకొని పల్లవి దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటుంది ఇక ఊరుకునేది లేదు అసలు నిజం బయట పెట్టాలని అనుకుంటుంది. పల్లవి అంత చేసిందని పల్లవికి వార్నింగ్ఇ స్తుంది అవని.. ఇంట్లో అందరికీ పల్లవి గురించి నిజం చెప్పాలని ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని పల్లవి ఇదంతా చేసిందని తెలుసుకొని షాక్ అవుతుంది ఎలాగైనా పల్లవి అంతు చూడాలని బయలుదేరుతుంది. ఈ విషయాన్ని పల్లవికి చెప్పి నువ్వు ఇలాంటి దానివి అని నేను అస్సలు అనుకోలేదు సొంత ఇంటిని కాటేయాలని చూస్తావా పాముకి పాలు పోసిన కాస్త జాలి చూపిస్తుందేమో కానీ నిన్ను ఇంట్లో పెట్టడం వల్ల ఇంటి నుంచి చేర్చాలని చూస్తావా ఇంకా అస్సలు నేను వదిలేది లేదు మీ అంతు చూస్తానని అవని ఇంటికి బయలుదేరుతుంది. పల్లవి అసలు నిజం ఎక్కడ బయటపడుతుందని భయపడుతుంది.. అవనిని ఇంట్లోంచి ఎలాగైనా గెంటించేయాలని అనుకుంటుంది. ఒకవేళ అవని నిజం చెప్తే నా బండారం బయటపడుతుంది నన్ను ఇంట్లోంచి గెంటేస్తారని భయపడుతుంది. అవని బయట పంపించేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తుంది. పల్లవి నాకు రెడీ అవ్వాలని అవినీలాంటి శారీ కోసం షాప్ అతనికి ఫోన్ చేసి అలాంటి శారీనే తీసుకొచ్చుకుంటుంది. అవని ముందుగా ఇంటికి వెళుతుంది. అవని వెనకాలే పల్లవి కూడా మరో ఆటోలో వెళుతుంది. అవని ఇంట్లోకి వెళ్ళగానే అత్తయ్య అని అరుచుకుంటూ వెతుకుతుంది. ఇప్పుడే వెనకాల ఆటోలో పల్లవి కూడా అవన్నీ ఇలాంటి శారీనే కట్టుకొని ఇంటికి వస్తుంది. పార్వతిని పైనుంచి తోసేస్తుంది పల్లవి. అవని శారీ చూసి అవి నేను ఇదంతా చేసిందని అనుకుంటుంది. ఇక పార్వతి స్పృహ తప్పి కింద పడిపోతుంది. అవని మాత్రం గదిలో ఎవరో గడి పెట్టారని గడియ తీయండి అని మొత్తుకుంటుంది. పార్వతి కింద పడిన తర్వాత పల్లవి ఆ గడియని తీస్తుంది. ఇక కిందికి వచ్చి చూడగానే పార్వతి కింద పడిపోతుంది.. పార్వతి ఎందుకు కింద పడిపోయింది అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసి డాక్టర్ని రమ్మని చెప్తారు..

Advertisement

డాక్టర్ వచ్చి పార్వతీని చూసి దెబ్బ గట్టిగా తగలలేదండి జస్ట్ స్పృహ కోల్పోయింది ఏదో షాక్ అయినట్టు ఉంది అని చెప్తుంది ఒక పది నిమిషాల్లో లేస్తుంది అని అనగానే అందరూ పార్వతి ఎప్పుడు లేస్తుందని వెయిట్ చేస్తుంటారు.. పార్వతి లేవగానే అందరూ ఏమైందని అడుగుతారు కానీ పార్వతి మాత్రం అవనీని అడుగుతుంది అవని నేను అని కింద పడేసింది అందుకే నేను కింద పడిపోయాను అని అందరి ముందర చెప్తుంది అందరూ అవని నిజంగానే తప్పు చేసిందని తిడతారు. తప్పేం లేదు నా మీద నిందలు వేయకండి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు వినరు. కమల్ వినోద్ తప్ప ఇంట్లో వాళ్ళందరూ అవనినే అంటారు. ఆస్తి రాయించుకున్నావ్ ఇప్పుడు మా అమ్మని చంపాలని చూసావా మాకు మా అమ్మని దూరం చేయాలనుకుంటున్నావా అని అందరూ అడుగుతారు. ఇక పార్వతి నన్ను చంపాలని చూసినది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని రాజేంద్రప్రసాద్ అంటుంది కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం మౌనంగా ఉంటాడు. అటు అక్షయ్ కూడా మౌనంగా ఉంటాడు.. ఇక పార్వతి ఇలాంటిది అంతకురాలు నా ఇంట్లో ఉంటే ఎవరినైనా చంపాలని చూస్తుందని ఇంట్లోంచి బయటికి గెంటేయాలని అంటుంది కానీ ఎవరు మౌనంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అవనిని ఇంట్లోంచి గెంటేస్తున్న అక్షయ్ మౌనంగా ఉంటాడు. ఆరాధ్య తీసుకొని వెళ్లాలనుకుంటే పార్వతి ఆరాధ్య ఇక్కడే ఉంటుంది నువ్వు వెళ్లి బయటికి వస్తుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×