E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనికి న్యాయం చెయ్యబోతున్న రాజేంద్ర.. పల్లవి నిజస్వరూపం తెలుస్తుందా..? ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అవనికి న్యాయం చెయ్యబోతున్న రాజేంద్ర.. పల్లవి నిజస్వరూపం తెలుస్తుందా..? ఇదేం ట్విస్ట్..
Advertisement

Intinti Ramayanam Today Episode January 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంటికి లాయర్ వస్తాడు.. మీరు చక్రధర్ నీ రిలీజ్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ ని తయారు చేయమని చెప్పారు కదా అక్షయ్.. అవన్నీ తీసుకొని వచ్చాను మీరు సంతకం చేయాలి అని అక్షయ్ తో లాయర్ అంటాడు.. ఆ మాట వినగానే పల్లవి చాలా సంతోషంగా ఉంటుంది. అవని మాత్రం మీరు చెయ్యొద్దు తప్పు చేస్తున్నారు అని అంటుంది. మా నాన్న చెప్పిన మాటనే నేను కాదనలేను అవని మా నాన్నకు మాట ఇచ్చాను అందుకే చక్రధర్ ని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాను అని అక్షయ్ అంటాడు.. ఇక సంతకం పెట్టేస్తాడు అక్షయ్. అవని అక్షయ్ ఇద్దరు కలిసి కేసు పెట్టారు కాబట్టి మీరు కూడా సంతకం పెట్టాలని లాయర్ అడుగుతాడు.. అయితే తన తల్లిని బయటికి వస్తే చంపేస్తాడు అని భయపడిన అవని సంతకం పెట్టను నా ఇంటి వాళ్ళని మళ్లీ రిస్కులు పడేలేను అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..పల్లవి అక్షయ్ బావ కేసు పెట్టాడు కదా ఆయన సంతకం పెట్టాడు కదా.. ఇప్పుడు మీరు మా నాన్నని రిలీజ్ చేయచ్చు కదా.. లాయర్ గారు అని అడుగుతుంది.. కేసు పెట్టింది అవని గారు ఆవిడే సంతకం పెట్టాలి లేదంటే మాత్రం ఈ కేసు చెల్లదు అని లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజేంద్రప్రసాద్ అవని ఎందుకు సంతకం పెట్టలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అవని గురించి ఎంత చెప్పినా సరే రాజేంద్రప్రసాద్ మాత్రం ఏదో జరుగుతుంది అది ఏంటో తెలుసుకోవాలని అనుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవని పుట్టుక గురించి నిజం తెలుసుకున్న రాజేంద్ర తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి కలిసి మాట్లాడేసి ఒక విషయం గురించి మాట్లాడాలని వచ్చాను అని చెప్తాడు. అయితే అందరూ కూడా ఆస్తి పంపకాల గురించి క్లారిటీ ఇవ్వడంతో నేను కూడా ఆలోచిస్తానని అక్కడి నుంచి వచ్చేస్తాడు.. రాజేంద్రప్రసాద్ ఇంటికి వస్తున్న దారిలో దాహం వేయడంతో రాజేంద్ర ఒక షాపుకు వెళ్లి వాటర్ బాటిల్ తీసుకొని తాగుతూ ఉంటాడు. అయితే అక్కడ పల్లవి కనిపించడంతో ఏం జరిగిందో అని అక్కడికి వెళ్తాడు. పల్లవి ఎక్కడ ఏం చేస్తుంది అని అడగబోతున్న సందర్భంలో పల్లవి ఎలాగైనా సరే మా డాడీకి ఫోన్ చేసి నిజం చెప్పాలని అనుకుంటుంది. మొన్న చక్రధర్ ఫోన్ చేసిన కానిస్టేబుల్ కి ఫోన్ చేస్తుంది.. నేను చక్రధర్ గారి కూతురు అండి మొన్న మీరు ఫోన్ చేశారు కదా ఒకసారి ఆయనకి ఇస్తారా నేను మాట్లాడాలి అని అంటుంది..

Advertisement

పల్లవి చక్రధర్ కి ఫోన్ చేస్తుందని తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ ఏం మాట్లాడుతుందో వినాలని అనుకుంటాడు. నేను ఎంత వెతికినా కూడా ఆ డాక్యుమెంట్స్ మాత్రం నాకు అవని రూమ్లో కనిపించలేదు. అది గనక మన చేతికి వస్తే మన ఇష్టం వచ్చినట్లు మనం ఉండొచ్చు అని చక్రధర్ అంటాడు. ఎక్కడ దాచిపెట్టిందో తెలియడం లేదు డాడ్ నేను ఎంత వెతికినా కూడా అవి కనిపించడం లేదు అని పల్లవి అంటుంది. ఇక మిమ్మల్ని రిలీజ్ చేయడానికి సెంటిమెంట్ డైలాగులతో ఇంట్లోని వాళ్లందరినీ నమ్మించాను. ఆ గర్భమాపొద్దుమని అవని చెప్పిన సరే ఇంట్లోని వాళ్ళు ఎవరు కూడా నమ్మకుండా చేశాను. మీకోసమే ఇదంతా చేశానని అందని నమ్మించాను. మావయ్య అక్షయ బావని ఒప్పించి మిమ్మల్ని రిలీజ్ చేసేలా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అవని సంతకం పెట్టలేదు..

ఇంట్లోని వాళ్ళందరినీ నమ్మించి ఫూల్స్ చేశాను అని అనగానే రాజేంద్రప్రసాద్ షాక్ అవుతాడు. నేను మొదటి నుంచి ఇంట్లోనే వాళ్ళందర్నీ నమ్మిస్తూ అవనీదే తప్పు అంటూ అన్ని అవనిమీదికి వేస్తున్న నమ్ముతున్నారు.. అమ్మమ్మని నేను ఎలా చెప్తే అలా ఆడేలా చేసుకున్నాను. ఇక మీదట ఏం జరిగినా కూడా అవని నేను బయటకు పంపే ప్రయత్నం చేస్తాను అని పల్లవి చక్రధర్ కు చెప్తుంది.. ఆ మాట విన్న రాజేంద్రప్రసాద్ పల్లవి మంచిదని అనుకున్నాను కానీ తన నిజ స్వరూపం ఇదా అని షాక్ అవుతాడు. ఆ తర్వాత రాజంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్తాడు.. అక్షయ్ అవని ఎందుకు సంతకం పెట్టలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు.. నేను ఇంట్లోని వాళ్ళ సంతోషాన్ని ఆలోచించాలి అనుకున్నాను నువ్వు ఇంట్లో వాళ్ళ సంతోషం చెడిపోకూడదని ఆలోచిస్తున్నావు అని అక్షయ్ అంటాడు.. వీళ్లు మాట్లాడుకుంటూ ఉంటే కోటిలింగం లోపలికి వస్తాడు..

Advertisement

మీరు బాధపడుతున్నారని ఆరాధ్య కూడా బాధపడుతుంది. నుంచి నేను తనని భోజనం చేయమని ఎంతగా బ్రతిమిలాడినా తినడం లేదు అని అనగానే.. అవని సారీ అమ్మా నేను మర్చిపోయాను.. నీకు ఇప్పుడే అన్నం తీసుకుని వస్తాను అని అంటుంది. అవని అన్నం తీసుకొచ్చి పెడుతున్న సరే మీరు తింటేనే నేను తింటాను అని ఆరాధ్య అంటుంది. దానికి కోటిలింగం ఆరాధ్యను నవ్వించే ప్రయత్నం చేస్తాడు.. ఆ తర్వాత అందరూ నవ్వుకుంటూ భానుమతి లోపలికి వచ్చి నా కూతురు అల్లుడు సంతోషాన్ని దూరం చేసి నువ్వు నవ్వుతున్నావా నువ్వు బాగుపడవే అంటూ శాపాలు పెట్టి వెళ్ళిపోతుంది..

Also Read: సుమతికి షాక్..రవి, శృతి ఫైట్.. ప్రభావతి ఇంట్లో దెయ్యం..

రాజేంద్ర కోసం పార్వతీ వెయిట్ చేస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్లారండి.. మీకోసం నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అని అంటుంది.. ఊ కాస్త నొప్పిగా ఉంది టాబ్లెట్ తెచ్చి ఇవ్వవా అని పార్వతిని అడుగుతాడు.. కొన్ని విషయాలు ఎందుకు జరుగుతున్నాయో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటాడు.. ఇక పల్లవి అవని రూమ్ కి వెళ్లి మరోసారి డాక్యుమెంట్స్ ఉంటాయేమో అని వెతుకుతుంది. అక్కడ డాక్యుమెంట్స్ లేకపోవడంతో అంతా వెతుకుతూ ఉండగా రాజేంద్రప్రసాద్ లోపలికి వస్తాడు.. నువ్వు దేనికోసం వెతుకుతున్నావో అది నీకు మాత్రం దొరకదు అని రాజేంద్రప్రసాద్ అనగానే.. ఏదో నా గురించి నిజం తెలిసింది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. పల్లవి గురించి రాజేంద్రప్రసాద్ అవనీతో చెప్తాడు. ఈ విషయాలన్నీ నాకు ముందే తెలుసు మామయ్య మీరందరూ బాధపడతారని నేను ఎవరికీ చెప్పలేదు అని అవని అంటుంది… రేపటి ఎపిసోడ్ రాజేంద్రప్రసాద్ అందరితో పార్టీని ఏర్పాటు చేస్తానని అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×