E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. సంతకం పెట్టని అవని.. చక్రధర్ గురించి బయటపడ్డ నిజాలు..

Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. సంతకం పెట్టని అవని.. చక్రధర్ గురించి బయటపడ్డ నిజాలు..
Advertisement

Intinti Ramayanam Today Episode January 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ మాత్రం పల్లవి ఆలోచించి మాట్లాడు అని అంటాడు. అక్షయ్ మాత్రం నువ్వు ఈ సెంటిమెంటల్ డ్రామా ని ప్లే చేస్తున్నావని నాకు అర్థమైంది ఇలాంటివన్నీ ఇక్కడ కుదరవు అని అంటాడు. రాజేంద్రప్రసాద్ మాత్రం నువ్వు లోపలికి వెళ్ళు అని అంటాడు. కానీ పల్లవి మాత్రం వినకుండా పెద్ద రచ్చ చేస్తుంది.. రాజేంద్రప్రసాద్ ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం పెద్ద రచ్చ చేస్తుంది మా నాన్న చచ్చిపోయాడని నేను ఫీల్ అవుతున్నాను అని అనుకోవాలి అని అంటుంది. మీరందరూ కూడా మా నాన్నని జైలు నుంచి రానివ్వకుండా చేస్తున్నారు నాకెంత బాధగా ఉంటుంది అని సంబంధం లేకుండా గొడవ పెట్టుకుని పెద్ద రచ్చ చేస్తుంది పల్లవి.. నీ బాధ నాకు అర్థమైంది పల్లవి కానీ నేను చెప్పిన నువ్వు వినట్లేదు. కాబట్టి మీ అమ్మ నాన్న అంటే నీకు ప్రేమ ఉంటే నువ్వు లోపలికి వెళ్ళు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఆ మాట వినగానే పల్లవి వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. రాజేంద్ర ప్రసాద్ మాత్రం అక్షయ్ నేను నీతో ఒక మాట మాట్లాడాలి అని అంటాడు. దేని గురించి నాన్న చెప్పండి అని అక్షయ్ అంటాడు. పల్లవి అలా ఎందుకు మాట్లాడుతుందో నీకు తెలుసా అని అడుగుతాడు. ఏమో నాన్న తను ఎందుకు అలా మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు అని అక్షయ్ అంటాడు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది రా అనే పార్వతి అడుగుతుంది.. చక్రధర్ ని నువ్వు ఎలాగైనా విడిపించాలి అని అంటాడు ఇక నాన్న మాట కాదనలేక అక్షయ్ సరే అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. పల్లవి మా డాడీ ని బయటకు తీసుకురావడానికి నేను వేసిన అస్త్రం బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది.. అని లోపల దొంగ చాటుగా వింటూ మురిసిపోతూ ఉంటుంది.. శ్రియ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నువ్వు నన్ను పట్టుకోవడం ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే నా కడుపు పోయేది శ్రీ.. మనము ఇంట్లో ఇంకా ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోదాం మన బిడ్డ కోసమైనా మనం బయటకు వెళ్లి బ్రతుకుదామని అంటుంది. కానీ శ్రీకర్ మాత్రం నేను మా నాన్నకి మాట ఇచ్చాను. మా అన్నయ్యతో కలిసి బిజినెస్ ప్రారంభించాము ఇప్పుడు బయటకు వెళ్లడం కుదరదు అని అంటాడు. మానాన్నే మీ నాన్న అన్న విషయం నాకు తెలుసు అని పల్లవి అంటుంది. ఆ మాట వినగానే అవని షాక్ అవుతుంది. నువ్వు నా తోడికోడలివి అని అనుకుంటేనే సహించలేను. అలాంటిది నువ్వు నాకు అక్క అవుతావు అంటే ఎలా భరిస్తానని అనుకుంటున్నావు అని పల్లవి అడుగుతుంది..

Advertisement

నేను మా అమ్మ మా నాన్నలకి సక్రమంగా పెళ్లి తర్వాతే పుట్టాను. నువ్వు అక్రమ సంబంధంకు పుట్టావు అలాంటిది నువ్వు నాకు ఎలా అక్కవుతావు అని పల్లవి అవన్నీ రెచ్చగొడుతుంది. అవని పల్లవి చంప పగలగొడుతుంది.. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది మాత్రం అస్సలు జరగదు అని పల్లవి తో అవని అంటుంది. పల్లవికి నిజం తెలిసినా కూడా నా గదిలో ఏదో వెతకాలని అనుకుంటుంది అదేంటో నేను తెలుసుకోవాలి అని అవని అనుకుంటుంది. ఇక తర్వాత పల్లవి అవని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకోవాల్సిందే అని అనుకుంటుంది..

ఆ తర్వాత ఇంటికి లాయర్ వస్తాడు.. మీరు మీ ప్రాపర్టీస్ అన్నిటిని తీసుకున్నారు కదా చక్రధర్ నీ రిలీజ్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ ని తయారు చేయమని చెప్పారు కదా.. అవన్నీ తీసుకొని వచ్చాను మీరు సంతకం చేయాలి అని అక్షయ్ తో లాయర్ అంటాడు.. ఆ మాట వినగానే పల్లవి చాలా సంతోషంగా ఉంటుంది. అవని మాత్రం మీరు చెయ్యొద్దు తప్పు చేస్తున్నారు అని అంటుంది. అది చూసిన పల్లవి మా నాన్నని రిలీజ్ చేయడం అవని అక్కకి ఇష్టం లేదనుకుంటా మావయ్య గారు అని అంటుంది. ఇక రాజేంద్రప్రసాద్ ఏమి మాట్లాడకుండా సంతకం పెట్టమని అంటాడు. మీరు సంతకం పెడితే చక్రధర్ కి బెయిల్ ఇచ్చి నేను రిలీజ్ చేయిస్తాను అని లాయర్ అంటాడు.

Advertisement

మా నాన్న రాబోతున్నాడు నా ప్లాన్ వర్కౌట్ అయింది అని పల్లవి గాల్లో తేలిపోతూ సంతోషంగా ఉంటుంది. అయితే లాయరు మీరు కేసు పెట్టారు కాబట్టి ముందుగా మీరు సంతకం పెట్టాలని అంటారు. అవని వద్దని చెప్పిన సరే అక్షయ్ మాత్రం సంతకం పెడతాడు.. ఆ తర్వాత అవనీని పెట్టమని చెప్తే అవని మాత్రం పెట్టకుండా ఆ ఫైల్ ని అక్కడ పడేసి వెళ్ళిపోతుంది. ఇక రాత్రి అయిన తర్వాత అవని ఒంటరిగా ఉంటుంది.. ఏంటి అవి ఏదో విషయం గురించి బాధపడుతున్నావు అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు..

Also Read :Gundeninda Gమీనాపై రెచ్చిపోయిన రోహిణి.. మీనాను కొట్టబోయిన ప్రభా.. మీనాకు అండగా బాలు..

ఎవరి తప్పులు అయినా క్షమించే నువ్వు చక్రధర్ తప్పుని ఎందుకు క్షమించలేకపోతున్నావు.. ఏదైనా బలమైన కారణం ఉందా అని అడుగుతాడు. ఏమీ లేదు మావయ్య గారు అని అవని అంటుంది. ఆ విషయం ఏంటో నాకు చెప్పకపోతే నా మీద ఒట్టే అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఇక అతని మాట కాదనలేక అసలు విషయాన్ని చెప్పేస్తుంది అవని. చక్రధర్ నా తండ్రి. వాడు ఒక దుర్మార్గుడు మా అమ్మని మోసం చేసి నమ్మించి పిల్లలు కన్న తర్వాత వదిలేసి వెళ్లిపోయాడు అని చెప్తుంది.. ఇక తర్వాత పల్లవి అవని రూమ్ లోకి వెళ్లి డాక్యుమెంట్స్ ని వెతకాలని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజేంద్రప్రసాద్ ఇంట్లో ఏం జరుగుతున్నాయి ఎవరు ఏం చేస్తున్నారో నాకు బాగా తెలుసు పల్లవి అని అంటాడు. అక్కడితో ప్రోమో పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×