E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. రాజేంద్ర కీలక నిర్ణయం.. దిమ్మతిరిగే షాకివ్వబోతున్న శ్రీయ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. రాజేంద్ర కీలక నిర్ణయం.. దిమ్మతిరిగే షాకివ్వబోతున్న శ్రీయ..
Advertisement

Intinti Ramayanam Today Episode January 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి తన కడుపుకు బండారం బయటపెట్టిన అవనిపై కక్ష పెంచుకుంటుంది.. శ్రియకి ఇలాంటి సేవలు చేయడం నాకు నచ్చకే నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను. ఇప్పుడే శ్రీయాని మహారాణి లాగా చూసుకుంటున్నారు.. ఇప్పుడే దాన్ని అలా చూస్తుంటే ఇకముందు బిడ్డ పుడితే నన్ను అసలు పట్టించుకోరు ఒక పురుగులాగా చూసేస్తారు అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది.. అవని అక్కడ కనిపించడంతో నా కడుపు గురించి బయటపెట్టిన అవనిని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి అని పల్లవి అనుకుంటుంది. అయితే పల్లవి శ్రీయ కడుపు పోవాలి ఏదో ఒకటి చేయాలని నూనె డబ్బా తెచ్చి శ్రీయ గది ముందర పోస్తుంది.. అప్పుడే గది నుంచి బయటికి వచ్చిన శ్రియ నూనె మీద కాలేసి జారి పడబోతుంది. శ్రీకర్ శ్రీయాని పడిపోకుండా పట్టుకుంటాడు.. ఇక అందరూ కూడా చూసుకొని నడవాలి కదా అమ్మ ఇలాంటి టైంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటారు.. అయ్యో ఏమైంది అసలు అని అవని కూడా అడుగుతుంది. నూనె మీద కాలు వేసి జారిపడ్డ పోయింది అని అనగానే పల్లవి అయ్యో అలా జారింటే నీ కడుపు పోయేది తెలుసా అని కొత్త నాటకం మొదలు పెడుతుంది.. అవని ఎంత చెప్పిన కూడా పల్లవి వినకుండా రెచ్చిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ మాత్రం పల్లవి ఆలోచించి మాట్లాడు అని అంటాడు. అక్షయ్ మాత్రం నువ్వు ఈ సెంటిమెంటల్ డ్రామా ని ప్లే చేస్తున్నావని నాకు అర్థమైంది ఇలాంటివన్నీ ఇక్కడ కుదరవు అని అంటాడు. రాజేంద్రప్రసాద్ మాత్రం నువ్వు లోపలికి వెళ్ళు అని అంటాడు. కానీ పల్లవి మాత్రం వినకుండా పెద్ద రచ్చ చేస్తుంది.. రాజేంద్రప్రసాద్ ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం పెద్ద రచ్చ చేస్తుంది మా నాన్న చచ్చిపోయాడని నేను ఫీల్ అవుతున్నాను అని అనుకోవాలి అని అంటుంది. మీరందరూ కూడా మా నాన్నని జైలు నుంచి రానివ్వకుండా చేస్తున్నారు నాకెంత బాధగా ఉంటుంది అని సంబంధం లేకుండా గొడవ పెట్టుకుని పెద్ద రచ్చ చేస్తుంది పల్లవి..

Advertisement

నీ బాధ నాకు అర్థమైంది పల్లవి కానీ నేను చెప్పిన నువ్వు వినట్లేదు. కాబట్టి మీ అమ్మ నాన్న అంటే నీకు ప్రేమ ఉంటే నువ్వు లోపలికి వెళ్ళు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఆ మాట వినగానే పల్లవి వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. రాజేంద్ర ప్రసాద్ మాత్రం అక్షయ్ నేను నీతో ఒక మాట మాట్లాడాలి అని అంటాడు. దేని గురించి నాన్న చెప్పండి అని అక్షయ్ అంటాడు. పల్లవి అలా ఎందుకు మాట్లాడుతుందో నీకు తెలుసా అని అడుగుతాడు. ఏమో నాన్న తను ఎందుకు అలా మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు అని అక్షయ్ అంటాడు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది రా అనే పార్వతి అడుగుతుంది.

మీరు బయటకు వెళ్తేనే ఇంకా రాలేదు అని మేమందరం కంగారు పడిపోతూ ఉంటాము. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం జరిగిందో అని భయపడిపోతూ ఉంటాము. అలాంటిది తన తండ్రి జైలుకు వెళ్లి ఇంకా రాడు అని తను చాలా బాధపడుతుంది. తండ్రి లేకపోతే తల్లి ఏమైపోతుందో అని కంగారు పడిపోతుంది ఈ విషయం కూడా నీకు అర్థం కావడం లేదా అని పార్వతి అడుగుతుంది. అసలు ఆ చక్రధర్ మనల్ని ఎంతగా ఇబ్బంది పెట్టాడో తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారా అని అడుగుతాడు. వాడు మోసలే చేశాడు కుట్రలే చేశాడు కానీ వాడు పల్లవికి నాన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు రా అని రాజేంద్రప్రసాద్ అంటాడు.

Advertisement

ఇంట్లో జరుగుతున్న ఈ గొడవలు సర్దుమనగాలి అంటే మనం చక్రధారిని బయటకు తీసుకురావాలి.. అప్పుడే ఈ గొడవలన్నీ శాంతించి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయినా ఎలా మాట్లాడుతున్నారు నాన్న మీరు కూడా.. వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు ఎలా ఉన్న వాడిని ఎలా తీసుకొచ్చాడు అని అంటాడు. కమల్ మామయ్య చేసింది తప్పే కానీ అత్తయ్య ఏం పాపం చేయలేదు కదా.. ఆమెను ఎందుకు బాధ పెట్టాలి అని అంటాడు. ఇవన్నీ చూస్తుంటే నా గుండె బరువెక్కి పోతుంది రా ఏమైపోతానో అని కంగారుగా ఉంది. చక్రధర్ ని రిలీజ్ చేస్తే తీసుకురా అని అంటాడు. అక్షయ్ తండ్రి మాట కాదనలేక మౌనంగా ఉండిపోతాడు.

పల్లవి మా డాడీ ని బయటకు తీసుకురావడానికి నేను వేసిన అస్త్రం బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది.. అని లోపల దొంగ చాటుగా వింటూ మురిసిపోతూ ఉంటుంది.. శ్రియ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నువ్వు నన్ను పట్టుకోవడం ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే నా కడుపు పోయేది శ్రీ.. మనము ఇంట్లో ఇంకా ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోదాం మన బిడ్డ కోసమైనా మనం బయటకు వెళ్లి బ్రతుకుదామని అంటుంది. కానీ శ్రీకర్ మాత్రం నేను మా నాన్నకి మాట ఇచ్చాను. మా అన్నయ్యతో కలిసి బిజినెస్ ప్రారంభించాము ఇప్పుడు బయటకు వెళ్లడం కుదరదు అని అంటాడు.

మీ అన్నయ్య చాలా తెలివైనోడు అలాంటి ఆయన ఏ రెండు సార్లు బిజినెస్ లో మోసపోయాడు. ఇప్పుడు కూడా అలా జరగదని గ్యారెంటీ లేదు కదా.. మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని. అంటే ఆస్తివాళ్లే ఇస్తారు. అప్పుడు మనం ఆస్తిని తీసుకొని ఎటైనా దూరంగా వెళ్లిపోదామని శ్రేయ అంటుంది. ఈ విషయాన్ని మీ ఇంట్లో వాళ్లకి చెప్పడానికి నువ్వు భయపడుతున్నావు ఏమో.. నేను భయపడను నేను చెప్పనా అని అంటుంది.. కానీ శ్రీకర్ మాత్రం నువ్వేం చెప్పద్దు నేనే టైం చూసుకొని చెప్తాను.. ప్రస్తుతం పల్లవి చేసిన రచ్చ తో ఇంట్లోని వాళ్ళందరూ బాధపడుతున్నారు అని స్వీకారం అంటాడు..

Also Read :

పల్లవి అవని దగ్గరికి వెళ్తుంది. కడుపులో ఏదో పెట్టుకుని ఆలోచిస్తున్నావు కదా అదేంటో కక్కేయి అని అవని అంటుంది. నువ్వు మా నాన్నని బయటకు తీసుకురానివ్వకుండా చేయాలి అనుకున్నావు.. కానీ నేను చేసిన ప్రయత్నం ఎలా మా నాన్నని బయటకు తీసుకొస్తుందో చూసావా అని అంటుంది.. నీకు ఇంకొక షాక్ ఇచ్చే విషయం ఏంటో చెప్పనా మానాన్నే మీ నాన్న అన్న విషయం నాకు తెలుసు అని పల్లవి అంటుంది. ఆ మాట వినగానే అవని షాక్ అవుతుంది. నువ్వు నా తోడికోడలివి అని అనుకుంటేనే సహించలేను. అలాంటిది నువ్వు నాకు అక్క అవుతావు అంటే ఎలా భరిస్తానని అనుకుంటున్నావు అని పల్లవి అడుగుతుంది.. నేను మా అమ్మ మా నాన్నలకి సక్రమంగా పెళ్లి తర్వాతే పుట్టాను. నువ్వు అక్రమ సంబంధంకు పుట్టావు అలాంటిది నువ్వు నాకు ఎలా అక్కవుతావు అని పల్లవి అవన్నీ రెచ్చగొడుతుంది. అవని పల్లవి చంప పగలగొడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో చక్రధర్ రిలీజ్ అవుతాడా? అవనీని దెబ్బ కొట్టేందుకు పల్లవి ఇంకా ఏదైనా ప్లాన్ చేస్తుందా? అసలు మీనాక్షి చక్రధర్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా?.. బయటికి వచ్చిన చక్రధర్ అక్షయ్ పై పగ పెంచుకుంటాడా తెలియాలంటే ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాలి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×