E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: చక్రధర్ ను కలిసిన మీనాక్షి..అయ్యో పల్లవి ఇరుక్కుందే.. నిజం బయటపడుతుందా..?

Intinti Ramayanam Today Episode: చక్రధర్ ను కలిసిన మీనాక్షి..అయ్యో పల్లవి ఇరుక్కుందే.. నిజం బయటపడుతుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode January 20th : నిన్నటి ఎపిసోడ్ లో..చక్కెర పొంగల్ని తీసుకొని బయటికి వచ్చిన అవనీ శ్రియకు పల్లవికి ఒక కప్పుల లో పెట్టి ఇస్తుంది. అయితే అది తినిపిస్తున్న కమల్ తో పల్లవి వాసన వస్తుంది అని అంటుంది. ఏదో నాకు మందు వాసన వస్తుంది బావ ఏదోలా ఉంది అని అనగానే కమల్ కూడా దాన్ని వాసన చూస్తాడు. అవును వదిన ఏదో వాసన వస్తుంది అని అనగానే శ్రీయ కూడా అవును నిజంగానే ఏదో మందు వాసన వస్తుంది చండాలంగా ఉంది అని అంటుంది. ఆ మాట వినగానే అవని షాక్ అవుతుంది.. పార్వతి దాన్ని తీసుకొని ఇలా ఇవ్వు ఎదో వాసన వస్తుంది నేను చూస్తాను అని అంటుంది..

పార్వతి కూడా అదే వాసన రావడంతో ఇక పల్లవి రెచ్చిపోతుంది.. నువ్వు మంచి దానివి అనుకున్నాను అక్క నాకు కడుపు పోగొట్టాలనే ఇలాంటి మందును కలిపి నాకు ఇస్తావా? నేనంటే నీకు ఎందుకు అంత బాగా అని డ్రామా ని మొదలు పెడుతుంది.. నేనేం చేశానని నువ్వు నా కడుపు ఎందుకు ఇలా మందు కల్పించావు అది నులిపురుగులను చంపడానికి వాడే ముందు అని అత్తయ్య అంటున్నారు కదా.. మొత్తానికి పల్లవి పార్వతి అండ చూసుకొని ఇంకాస్త రెచ్చిపోయి మాట్లాడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి అవనిని అవమానించేలా మాట్లాడుతుందని తట్టుకోలేకపోయిన మీనాక్షి ఎలాగైనా సరే ఈ గొడవలకి ముగింపు పలకాలని అనుకుంటుంది. మీనాక్షి చక్రధర్ ని కలవడానికి జైలుకు వెళుతుంది.. ఇక్కడ చక్రధర్ మీనాక్షిని చూసి షాక్ అవుతాడు. నీలాంటి వాన్ని నమ్మి నేను మోసపోయాను ఇప్పటికీ నువ్వు మారవా అని అంటుంది. కానీ చక్రధర్ మాత్రం నేను బయటకు వస్తే నిన్ను నీ అల్లుడిని కూతుర్ని అసలు వదలను అని అంటాడు.. పల్లవికి మేము ఎవరో తెలిస్తే ఇక మీదట అలాంటి మాటలు మాట్లాడదని నేను అనుకుంటున్నాను అని మీనాక్షి అంటుంది. తను మమ్మల్ని కావాలనే అవమానిస్తుంది అవనిని ఎన్ని మాటలు అంటున్నావ్ నాకు చాలా బాధగా ఉంది అని మీనాక్షి చక్రధర్ తో అంటుంది.. ఇదంతా కాదు నువ్వు ఎవరో తెలిస్తే ఇలాంటి అవమానాలు ఉండవు కదా అప్పుడు నేను నిన్ను జైలు నుంచి రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని మీనాక్షి అంటుంది.

చక్రధర్ ఈ జైల్లో ఉండలేకపోతున్నాను. నువ్వు నా భార్యవని కానీ నీ మీద మోజుతో లేదు.. ఈ జైలు జీవితం నుంచి బయటపడడానికైనా నేను చెప్తాను నువ్వేదో నీ మీద ప్రేమ ఉందని మురిసిపోవద్దు అని చక్రధరంటాడు.. నా మీద ప్రేమ ఉందని నేను అనుకోవట్లేదు అలాంటి ఆశలు కూడా నాకు లేవు. నువ్వు ఒక దుర్మార్గుడివి నీలాంటి వారిని భర్తగా నేను మళ్ళీ ఒప్పుకుంటానని ఎలా అనుకుంటున్నావు అని మీనాక్షి అంటుంది. ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి వచ్చేస్తారు.. మీనాక్షి తన భర్త తానే అని ఒప్పుకుంటే నేను జైలు నుంచి బయటకు తీసుకొస్తానని అంటుంది ఇక చక్రధర్ కూడా సరే అని అంటాడు.

Advertisement

కమల్ పల్లవిని తీసుకుని వచ్చి నువ్వు కడుపుతో ఉన్నావ్ కదా.. ఈ టైంలో యోగా అలాగే ఎక్సర్సైజులు చేస్తే పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా పుడతాడు అని పల్లవికి చెప్తాడు.. నువ్వు ఎలా చెప్పినా సరే నాకు అర్థం కావట్లేదు బావ నేను చేయలేకపోతున్నాను అని అంటుంది. కమల్ ఎలా చేయాలో పల్లవికి చూపిస్తాడు.. పల్లవి అలా చేస్తుంది అయితే అవని ఇదంతా చూసి చాలా ముచ్చట పడిపోతూ ఉంటుంది.. నువ్వు ఎక్సైజ్ చేయి నేను వెళ్లి నీకోసం ఫ్రెష్ గా జ్యూస్ చేసి తీసుకొస్తానని కమల్ అంటాడు. తన భార్యకు కమల్ బాగా సేవలు చేస్తున్నాడని అవని వాళ్ళిద్దరిని చూసి సంతోషపడుతుంది.

కమల్ అలా వెళ్లగానే పల్లవి మాత్రం యోగా చేయకుండా పాటకి స్పీడ్ గా స్టెప్పులేస్తుంది అది చూసి షాక్ అవుతుంది కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా డాన్స్లు వేస్తారని అనుకుంటుంది. పల్లవి డాన్స్ తో అవని అనుమానం ఇంకా పెరిగిపోతుంది. పల్లవి నిజంగానే కడుపుతో ఉందా అని చెక్ చేయించాలని అనుకుంటుంది. కమల్ వచ్చేలోగా పల్లవి మళ్లీ యోగా చేస్తున్నట్లు నటిస్తుంది. అవని పార్వతి అందరూ హాల్లో ఉండగానే శ్రీకర్ తన భార్యని ఎత్తుకొని తీసుకొని వస్తాడు..

Also Read : మీనా వంటను మింగేసిన మనోజ్.. బాలు మాటతో ప్రభావతి షాక్.. అడ్డంగా దొరికిపోయిన రోహిణి..

అదేంటి అని అడగ్గానే తనకి నీరసంగా ఉంది వదిన వాంతులు అవుతున్నాయి అని అంటాడు శ్రీకర్. అవని శ్రియకున్న లక్షణాలు నీకు ఏమీ లేవు కదా అని పల్లవిని అడుగుతుంది. నువ్వు కొంచెం తిన్న వాంతులు చేసుకుంటున్నావు కాళ్లు వాపులు వస్తున్నాయి. మరి పల్లవికి ఎందుకు అలా లేదు బాగానే తింటుంది కదా.. హోటల్ లో ఉన్న మెనూన్ అంత ఆర్డర్ చేస్తుంది అని అవని అంటుంది.. చూసావా బావ నా తిని మీరు అందరు పడుతున్నారని పల్లవి అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది… రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×