E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న రాజేశ్వరి..కోటిలింగంను కొట్టిన భానుమతి.. అక్షయ్ పై రాజేంద్ర ప్రశంసలు..

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న రాజేశ్వరి..కోటిలింగంను కొట్టిన భానుమతి.. అక్షయ్ పై రాజేంద్ర ప్రశంసలు..
Advertisement

Intinti Ramayanam Today Episode January 17th : నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రధర్ రాజేశ్వరి వచ్చారని చూసిన పల్లవి చాలా సంతోషంగా ఉంటుంది.. అత్తయ్య మామయ్య వచ్చారని కమల్ కూడా బయటకు వెళ్లి వాళ్ళని లోపలికి తీసుకొని వస్తారు. చక్రధర్ అవని పై సీరియస్ గా ఉంటాడు.. చక్రధరి ఇంట్లోకి రాగానే పల్లవి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మీరు వస్తారని నేను అసలు ఊహించలేదు డాడ్ నాకు చాలా సంతోషంగా ఉంది అని పల్లవి అంటుంది.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా చక్రధర్ వచ్చారని చాలా సంతోషంగా ఉంటారు..

మీరు జైలుకు వెళ్లారని బాధగా ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చారు కదా మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు.. చక్రధర్ వచ్చారని ఇంట్లోనే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. అయితే పోలీసులు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. చక్రధర్ ని పర్మిషన్ మీద తీసుకొచ్చారని తెలియగానే అతను అక్షయ పై చాలా సీరియస్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. భానుమతి కూడా నా కూతురు కళ్ళల్లో నీళ్లు చూడకూడదని అనుకున్నాను మళ్ళీ నువ్వు తనని ఎందుకురా ఇంతగా బాధ పెడుతున్నావు అని అంటుంది. ఇక అక్షయ్ నేను కేవలం తమ్ముడి కోసం మాత్రమే అతని బయటికి తీసుకొచ్చాను. ఇవి కోరిక తీర్చాలి అని కమల్ అనగానే నేను అతని తీసుకొచ్చి పల్లవికి పూజ చేసేలా చేశాను. నన్ను తప్పుగా అనుకోవద్దు అని అక్షయ్ అంటాడు. పల్లవి, రాజేశ్వరి ఇద్దరు కూడా చక్రధర్ కోసం బాధపడతారు.. పోలీసులు తీసుకుని వెళ్తుంటే పోలీసులను బ్రతిమలాడతారు.. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ మాట వినకుండా చక్రధాన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు.

ఇంట్లోకి వచ్చినా రాజేశ్వరి పల్లవి ఇద్దరు కూడా అక్షయ్ పై సీరియస్ అవుతారు. ఇలా నమ్మించి మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు అని రాజేశ్వరి అక్షయ్ కాలర్ పట్టుకుని అడుగుతుంది.. నేనేమీ తప్పు చేయలేదు ఎందుకు మీరు ఇలా అంటున్నారు అని అక్షయ్ అంటున్న సరే రాజేశ్వరి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.. మా ఆయన చెప్పినట్లుగానే మీరు నమ్మించి నా గొంతు కోశారు. మిమ్మల్ని ఇక జీవితంలో నమ్మను నేను కూడా మా ఆయన ఆలోచించినట్లే ఆలోచిస్తాను అని రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కూడా..

Advertisement

ఇదంతా జరగడానికి అవనీనే కారణమని అందరూ కూడా అవని పై సీరియస్ అవుతుంటారు. కానీ కమల్ మాత్రం మా అన్నయ్య చేసిన దాంట్లో తప్పేమీ లేదు. నా మాట ప్రకారం చక్రధర్ మావయ్యని తీసుకొని వచ్చాడు. ఈ కార్యక్రమం అయ్యేంతవరకు ఉంచాడు అంతేకానీ ఇంకేమీ తప్పు చేయలేదు.. మా అన్నయ్యని వదినని ఎవరైనా ఒక మాటంటే అస్సలు ఊరుకోను అని అంటాడు.. ఆ మాట వినగానే పల్లవి షాక్ అవుతుంది.. భానుమతి మాత్రం తన కూతురు కన్నీళ్లు పెట్టుకుని వెళ్లిపోయిందని బాధ పడిపోతూ ఉంటుంది.. నా కూతురు ఇలా బాధపడుతుంది అంటే కారణం అక్షయ్ అనుకుని తను ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది.

కోటిలింగం ప్లేట్లో భోజనం తీసుకొని వస్తాడు. బామ్మ గారు మీరు భోజనం చేయకపోతే నాకు ఏడుపొస్తుంది మీరు దీన్ని తినండి అని అంటాడు. నా బాధలో నేనుంటే నువ్వేంట్రా తింగర సచ్చినోడా అని భానుమతి అంటుంది. మీరు పెద్దవాళ్లు భోజనం చేయకుండా అంటే మీకు షుగర్ బీపీ లాంటివి ఉంటాయి అవి ఇంకా పెరుగుతాయి. మీరు తినకపోతే నేను కూడా బాధపడతాను అని కోటిలింగం అనగానే భానుమతి నేనంటే నీకు ఎంత ప్రేమ రా అని కోటిలింగం తెచ్చిన భోజనంని తింటుంది.. అది సరేగాని ఇంట్లో ఉన్న కూరలు భోజనం అంత నేనే పడేసి గిన్నెలన్నీ కడిగేసాను. మరి నీకు ఈ భోజనం ఎక్కడ నుంచి వచ్చింది అని అడుగుతుంది.

Also Read : ప్రేమను బుజ్జగించిన ధీరజ్.. శ్రీవల్లి పై నర్మదకు అనుమానం.. ప్రేమ ప్లాన్ సక్సెస్..

కోటిలింగం శ్రియా అక్క తిన్నదా మిగిలిన అన్నం ఏది అని అనగానే భానుమతి అతని కొడుతుంది.. అది ఎంగిలి చేసిన అన్నని నాకు తినిపిస్తావా దొంగ సచ్చినోడా అంటూ భానుమతి కోటిలింగం నీ కొడుతూనే ఉంటుంది. కోటిలింగం మాత్రం నాకు మీరు చాలా బాగా మసాజ్ చేశారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భానుమతి ఎంగిలి అన్నన్ని నేను తిన్నాను అని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×