E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కీలక నిర్ణయం.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. శ్రీయకు అబార్షన్..?

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కీలక నిర్ణయం.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. శ్రీయకు అబార్షన్..?
Advertisement

Intinti Ramayanam Today Episode January 10th : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ అవని దగ్గరకు వస్తాడు. అవని ఏమైందండీ మీ నాన్నగారితో మాట్లాడాలి అన్నారు నాకు చెప్పండి విషయం ఏంటి అని అడుగుతుంది. భార్యతో కూడా చెప్పని నిర్ణయం ఏదైనా ఉందా అని అవని అడుగుతుంది.  అదేం లేదు నాన్న ఆస్తి గురించి చెప్పాడు. ఆస్తి పంపకాలు చేస్తే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారని నాన్న ఆస్తిని పంచన అని చెప్పారు.. మావయ్య గారు నిర్ణయం చాలా బాగుంది ఆస్తిపంచితే ఎవరికి వారే అన్నట్లు వెళ్లిపోతారు.. ముఖ్యంగా శ్రియ, పల్లవిలు ఇద్దరు కూడా ఆస్తి రాగానే ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోదామని చూస్తున్నారు. ఇప్పుడు ఆస్తి గనుక ఇస్తే వాళ్ళు కచ్చితంగా వెళ్ళిపోతారు అని అవని అంటుంది. వాళ్లిద్దరి సంగతి ఏమో కానీ నువ్వు మాత్రం నా నిర్ణయం ఎప్పుడు కాదనకుండా ఉండాలి అని అక్షయ్ అంటాడు. మావయ్య గారు ఆలోచన బాగుంది మీ నిర్ణయం కూడా బాగుంది అయితే మీరు మీ తమ్ముళ్ళ గురించి ఆలోచించాలి. ఏం చేసినా మీరు ముగ్గురు కలిసి చేయాలి అని అవని అంటుంది. పల్లవి చక్రధర్ ని కలిసి డాక్యుమెంట్స్ వెనక ఉన్న అసలు అర్థాన్ని తెలుసుకొని వస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… పల్లవి చక్రధర్ని కలవడానికి జైలుకు వెళుతుంది.. ఆ డాక్యుమెంట్స్ కనిపించాయా నీకు అని పల్లవిని చక్రధర అడుగుతాడు. కాని పల్లవి మాత్రం ఎంత వెతికిన కనిపించలేదు డాడ్ అని అంటుంది.. అవి కేవలం ఆస్తి పత్రాలు మాత్రమే కాదు అవినీతి నేను తండ్రి అని నిరూపించే పత్రాలు కూడా.. వాటిని మీ అమ్మ చూసిందనుకో కచ్చితంగా నాకు విడాకులు ఇవ్వడానికి కూడా వెనకాడదు.. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో కనుక్కో… మన చేతికి వస్తే ఆ అవని సంగతి చూడొచ్చు అని చక్రధర్ అంటాడు..

Advertisement

అక్షయ్, రాజేంద్రప్రసాద్ ఇద్దరూ కూడా బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్నటి వరకు ఎటువంటి ప్రయోజనం లేదు అనుకున్నవి ఇప్పుడు బాగా లాభలను చేస్తున్నాయి ఇలాంటి వాటిలో పెట్టుబడి పెడితే బాగుంటుంది అని అనుకుంటారు.. అయితే అక్షయ్ తన దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్తాడు.. శ్రీకర్ కమల్ని కూడా అక్షయ్ రమ్మని పిలుస్తాడు. ఇది మనం పెట్టబోయే బిజినెస్ గురించి డీటెయిల్స్ రా అని అనగానే అవునా అన్నయ్య మీరు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారా అని శ్రీకర్ అడుగుతాడు. నేను మాత్రమే కాదురా మన ముగ్గురం కలిసి బిజినెస్ ని స్టార్ట్ చేయాలి..

ఇకమీదట నుంచి ఏం చేసినా కూడా మన ముగ్గురం కలిసి చేయాలి అని అక్షయ్ అంటాడు.. అయితే సడన్ గా ఈ నిర్ణయం ఏంటి అని వాళ్ళు అడిగినా కూడా అక్షయ్ మాత్రం ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా మన ముగ్గురం కలిసే పని చేయాలని అక్షయ నిర్ణయం తీసుకున్నానని చెప్తాడు. ముగ్గురు కూడా మూడు పనులను పంచుకుంటారు. తర్వాత పల్లవి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడుందో చూసి తొందరగా తన సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. చక్రధర్ చెప్పినట్లు డాకుమెంట్స్ కనక దొరకకపోతే పెద్ద రాద్ధాంతమే జరుగుతుందని అనుకుంటుంది..

Advertisement

ఇక ఎవరూ చూడకుండా పల్లవి అవని గదిలోకి వచ్చేస్తుంది.. అయితే పల్లవి అక్కడున్న వస్తువులన్నిటిని విసిరి పడేసి మరి తన డాకుమెంట్స్ ని తీసుకోవాలని అనుకుంటుంది. ఇల్లంతా చిందరవందరుగా ఉండటం చూసినా అవని ఏంటి ఇదంతా అని లోపలికి ఆలోచిస్తూ వస్తుంది. అక్కడ పల్లవి ఏదో డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నట్లు కనిపిస్తుంది.. ఏంటి నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అడ్డంగా దొరికిపోయిన పల్లవి నేను సోఫాలో కూర్చో ఉన్నప్పుడు తేలు నీ గదిలోకి వచ్చింది అక్క.. దాన్ని వెతకడానికి ఈ గదిలోకి వచ్చాను అని పల్లవి అంటుంది..

పల్లవి నా గదిలో ఏదో వస్తువు కోసం వెతుకుతుంది.. కానీ ఏ దానికోసం వెతుకుతుందో అన్నది తెలియడం లేదు. తను అడిగిన కూడా చెప్పదు.. అయితే పల్లవి నుంచి నిజం రాబట్టాలంటే తనకి ఇండైరెక్టుగా మాత్రమే సమాధానం చెప్పాలని అవని అనుకుంటుంది.. పల్లవి అవనికి దొరికిపోయాను అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కానీ అవని నువ్వు ఏ వస్తువు కోసమైతే వెతుకుతున్నావో ఆ వస్తువు నీకు అసలు దొరకదు అని చెప్తుంది. ఆ మాట వినగానే పల్లవి షాక్ అవుతుంది. ఏంటి నేను డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్న విషయం అవనికి ఎలా తెలిసిపోయింది అని అనుకుంటుంది.. అయితే ఎలాగైనా సరే అవని దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ ని కొట్టేయాలి అని పల్లవి అనుకుంటుంది.

Also Read : హాస్పిటల్ లో రోహిణి.. మీనాకు నిజం తెలుస్తుందా? సుమతికి జాబ్ ఆఫర్..

తర్వాత పార్వతి భానుమతి కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా శ్రేయ నీరసంగా ఉంది అని వస్తుంది.. శ్రేయకు దగ్గరుండి మరి సేవలు చేస్తారు.. శ్రేయ కి ఏమడిగితే అది అన్ని దగ్గరుండి తీసుకొచ్చి ఇస్తారు.. నాకు ఆకలేస్తుంది ఏదైనా తినాలనిపిస్తుంది అని పులిహార కావాలని అడుగుతుంది.. అయితే అవని పులిహార చేసుకుని శ్రేయా దగ్గరికి తీసుకుని వస్తుంది. జయ కి సేవలు చేయడం చూసిన పల్లవి కుళ్ళుకుంటుంది.. ఎలాగైనా సరే దీని కడుపు పోతే బాగుంటుంది అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్లో పల్లవి ఎలాంటి ప్లాన్ చేస్తుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×