E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: శ్రీయకు స్ట్రాంగ్ వార్నింగ్..పల్లవికి దిమ్మతిరిగే షాక్.. జైలు నుంచి చక్రధర్ రిలీజ్..?

Intinti Ramayanam Today Episode: శ్రీయకు స్ట్రాంగ్ వార్నింగ్..పల్లవికి దిమ్మతిరిగే షాక్.. జైలు నుంచి చక్రధర్ రిలీజ్..?
Advertisement

Intinti Ramayanam Today Episode February 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి పిన్ని దగ్గర ఉన్న బ్రేస్లైట్ ఇదే అమ్మ. నాకు ఇలాంటిదే కొనిస్తావా అని అడుగుతుంది ఆరాధ్య. పల్లవి దగ్గర ఉన్న బేస్ లైట్ ఇలాంటిదే అయితే ఆ ఎస్ఐ చెప్పిన బ్రేస్లెట్ కూడా ఇలాంటిదే నేమో.. కానీ ఆరాధ్య గీసింది ఆ ఎస్ఐ చెప్పింది కాస్త డిఫరెంట్ గా ఉంది. ఒకసారి పల్లవి దగ్గరికి వెళ్లి ఆ బ్రేస్లెట్ గురించి చూస్తే బాగుంటుంది అని అనుకుంటుంది అవని.. అవని ఆ బ్రేస్లెట్ గురించి పల్లవి రూంలో వెతుకుతూ ఉంటుంది.. ఇప్పుడు అక్కడికి వచ్చిన పల్లవి ఏం వెతుకుతున్నావు అని అడుగుతుంది..

పల్లవి పై అనుమానం వచ్చింది అని పల్లవి తెలుసుకుంటుంది. ఆ ఫంక్షన్ రోజు తను కట్టుకున్న శారీ తో పాటు జువెలరీని కూడా తగలబెట్టేస్తుంది. అక్షయ శ్రీకర్ కమల్ ముగ్గురు కూడా క్రిమినల్ లాయర్ తో మాట్లాడి మర్డర్ చేయాలనుకునేది ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీరు ఎంతగా ప్రయత్నాలు చేసినా సరే నా దగ్గర ఆధారాలు లేవు. నేను సేఫ్ అని పల్లవి అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తన తండ్రి కోరిక మేరకు ముగ్గురు అన్నదమ్ములు కూడా బిజినెస్ చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే తమ పనికి వెళ్లడానికి ముందు నాన్నగారి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటారు. ఇలా ముగ్గురిని కలిసి చూసిన శ్రేయ మొదట చాలా సంతోషంగా ఉంటుంది.. పల్లవి వచ్చి తన సంతోషానికి చిచ్చుపెట్టేస్తుంది.. నా మొగుడు అంటే వినడు కనీసం నీ మొగుడిని అయినా నీ మాట వినిలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు కదా.. అక్షయ్ బావ నీ మొగుడిని నా మొగుడిని కుడి భుజం ఎడమ భుజం లాగా చేసుకున్నాడు.. అక్కడ బిజినెస్ లో మనకు వచ్చే లాభాలు ఏమీ లేవు.. నువ్వు ఇలా నోరు మూసుకొని ఉంటే ఎలా అని శ్రేయాని పల్లవి రెచ్చగొడుతుంది.. వాళ్లు ముగ్గురు వెళ్తుంటే శ్రేయ మీరు ఆగండి అని శ్రీకర్ని ఆపుతుంది.

నువ్వు ఇప్పుడు మీ అన్నయ్య తో కలిసి బిజినెస్ చేస్తే నీకు ఒరిగేది ఏమీ లేదు.. కేవలం నువ్వు కష్టపడి పని చేస్తూ ఉన్నావు అని మాట తప్ప నీకు లాభాలేమి రావు. మీ నాన్నగారు ఆస్తి పంచుతారని అనుకున్నారు కానీ ఇప్పుడు అది జరిగేలా లేదు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ బిజినెస్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు అని శ్రేయ శ్రీకర్ని ఆపుతుంది.. ఏం మాట్లాడుతున్నావ్ శ్రియ నేను ఎక్కడికి వెళ్ళదు అని అంటావేంటి..? మా అన్నయ్యలతో కలిసి బిజినెస్ చేయడంలో తప్పులేదు కదా అనే శ్రీకర్ అంటాడు. ఇంట్లోని వాళ్ళందరూ కూడా శ్రేయాన్ని తిడతారు. శ్రేయ మాత్రం తన మొగుడు ఏ పని చేయకూడదు అని అందరితో గొడవకు దిగుతుంది..

Advertisement

కానీ శ్రీకర్ మాత్రం వినకుండా తన అన్నతో కలిసి బిజినెస్ చేస్తాను. ఇందులో నా నిర్ణయం మార్చుకోను అని శ్రియకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఇక తర్వాత అభిన కలవడానికి అవని హాస్పిటల్ కి వెళుతుంది.. అభి గ్రీన్ చీరలో కనిపించిన ఆ మహిళ ఎవరో కనుక్కున్నారని అడుగుతాడు.. ఒక్కొక్కరిని పిలిచి ఎంక్వయిరీ చేయడం మామూలు విషయం కాదు అయితే నాకు నా తోడికోడలు పల్లవి మీద అనుమానం గా ఉంది. మీకు తన గురించి చెప్పలేని పల్లవి చేసిన బాగోతల గురించి అవని చెప్తుంది.

ఆ తర్వాత అభి తన కానిస్టేబుల్ ని పల్లవిని ఫాలో అవ్వమని చెప్తాడు.. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చక్రధర్ విడుదల కాబోతున్నట్లు టీవీలో రావడంతో షాక్ అవుతారు. మనము ఇతని అరెస్ట్ చేయించాం కదా ఇప్పుడు ఎలా రిలీజ్ చేస్తారు? ఏమీ అర్థం కావడం లేదు అని అభిషేక్ అవుతాడు. అవని కూడా వీడు రిలీజ్ అయితే నాకు చాలా సమస్యలు వస్తాయి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని వెంటనే అక్షయ ఉన్న బిల్డింగ్ దగ్గరికి వెళుతుంది. అక్కడ చక్రధర్ రిలీజ్ కాబోతున్నట్లు చెబుతుంది.

Also Read : ‘బ్రహ్మముడి’ రుద్రాణి ఆస్తులు.. కన్నడ బ్యూటీ రెమ్యూనరేషన్..?

శ్రీకర్ అలా ఎలా రిలీజ్ అవుతాడు మనం పిటిషన్ వేద్దాము అని అంటాడు.. అతనికి ఎవరో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి బెయిల్ ఇప్పిచ్చాడట. పోలీసులు కూడా ఏమీ చేయలేక అతను చెప్పినట్లు చేసి చక్రధర్ ని రిలీజ్ చేస్తున్నారు. అతను బయటికి వస్తే మళ్లీ మనకు సమస్యలు తప్పవు అని అవని అంటుంది.. ఇక అక్షయ్ ని పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది.. ఆ చక్రధర్ రిలీజ్ అయితే కచ్చితంగా మా అమ్మని ఏదో ఒకటి చేస్తాడు నాకు భయంగా ఉంది అని అవని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×