E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode : అవనికి జాబ్ రాకుండా చేసిన పల్లవి.. అక్షయ్ కు బిగ్ షాక్..

Intinti Ramayanam Today Episode : అవనికి జాబ్ రాకుండా చేసిన పల్లవి.. అక్షయ్ కు బిగ్ షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode February 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి  శ్రీకర్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కొట్టేయాలని డాక్యుమెంట్స్ కోసం వెతకడం శ్రీకర్ చూస్తాడు. ఇక కనకం అవన్నీ ఇన్ డైరెక్ట్ గా ఇంట్లోంచి వెళ్ళమని చెప్తుంది. ఇక శీనుకు కనకం ఫోన్ చేస్తే అది పల్లవి వింటుంది అమ్మగారు అంటున్నారు అంటే కచ్చితంగా అవని ఉంటుంది అని అనుకుంటుంది శ్రీను అని అడిగితే శ్రీను చెప్పాడు దాంతో మాస్టర్ ప్లాన్ వేస్తుంది. నీ భార్యకు పండక్కి చీర కొన్నాను ఇవ్వలేకపోయాను ఈ చీర ఇవ్వు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. పల్లవి శీను ని ఫాలో అవుతుంది. శీను ఇంటికి వెళ్లిన పల్లవి అవని ఎక్కడా అని అడుగుతుంది ఇద్దరినీ చంప పగలగొడుతుంది కానీ అవని వెళ్లిపోయిందని కనుక చెప్తుంది. అవని వెళ్లిపోయిందా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీను కనకం కావాలని ఇంట్లో నుంచి పంపించింది అని షాక్ అవుతాడు. అవని బయటకు వెళ్లడంతో బాధ పడతాడు. అవని రోడ్డు పై యాక్సిడెంట్ అవ్వడం చూసి ఆమెను ఇంటికి తీసుకొని వెళ్తుంది.. స్వరాజ్యం ఇంట్లోకి దయాకర్ వస్తారు. అవనిని యాక్సిడెంట్ అయితే ఈ అమ్మాయి తీసుకొచ్చి వదిలిపెట్టిందండి అనేసి అనగానే ఈ అమ్మాయి నాకు ఎందుకు తెలియదు రాజేంద్రప్రసాద్ కోడలు కదా అనేసి అంటాడు.. ఆయనకు అసలు విషయాన్ని చెప్తాడు దయాకర్.. ఆ తర్వాత అక్షయ్ ద్వారా బందువులం అని దయాకర్ నిజం చెప్తాడు. మేము నీకు బంధువులం అవుతాము.. నువ్వేం బాధపడకు భయపడకు అనేసి దయాకర్ అంటారు. పరాయి వల్ల మేం కాదమ్మా  అని దయాకర్ అక్షయ్ కు మేనమామ అని నిజం చెప్తాడు. అయితే నేను ఇక్కడ ఉండడం పెద్ద సమస్య అండి మా ఇంట్లో వాళ్లకి తెలీదు నేను ఒక చిన్న సమస్యలో ఉన్నాను అనేసి అవని అంటుంది మీ ప్రవర్తన చూసి నువ్వు సమస్యలో ఉన్నావా అని అర్థమైంది కార్పోరేటర్ గా నీ సమస్య ఏంటో తీరుస్తాను అనేసి స్వరాజ్యం అంటుంది. ఏం లేదండి మా ఇంట్లో వాళ్లకు తెలియకుండా నేను బయటున్నాను అనేసి అవని అంటుంది మీ సమస్య ఏదో కానీ ఆ సమస్య పూర్తయ్యేంత వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు అనేసి స్వరాజ్యం అంటుంది. ఇక దయాకర్ కూడా నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు అమ్మ అనేసి అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఎన్నిసార్లు చెప్పినా కూడా దయాకర్, స్వరాజ్యం ఇద్దరు ఒప్పుకోరు. మా ఇంట్లోనే ఉండాలని అంటారు.. ఇక అవని తప్పని పరిస్థితులలో అక్కడే ఉండటానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అవనిని వాళ్ళు సొంత కూతురు లాగా చూసుకుంటారు. వాళ్ళ పరిస్థితిని చూసి ఎలాగైనా ఆదుకోవాలి అని అనుకుంటుంది అవని.. కోమలి తన ఫ్రెండ్ కి చే బదులు డబ్బులు ఇస్తుంది. అయితే ఆమె ఇవ్వనని చెప్పడంతో కోమలి కోపంగా ఉంటుంది ఈ విషయాన్ని పార్వతీ భానుమతితో చెప్తుంది. ఫ్రెండుకి 10000 డబ్బులు ఇచ్చాను అది ఎల్లుండి ఇస్తానని చెప్పింది ఇప్పటివరకు ఇవ్వలేదు అడిగితే అసలు ఇవ్వను పో అన్నట్లు మాట్లాడుతుంది అనేసి కోమలి చెప్తుంది.. ఇక భానుమతి పైకి కనిపించే వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు మన నమ్మి మోసపోవడం తప్ప అవని గురించి చూశాం కదా పైకి ఎంత అమాయకంగా ఉంటుంది ఇంత మోసం చేస్తదని ఎవరూ ఊహించలేదు కదా అనేసి అంటుంది దానికి పార్వతి అవని గురించి మాట్లాడకండి అత్తయ్య ఆమె చేసిన మోసాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాను అని పార్వతి అంటుంది..

Advertisement

శ్రియ అందరికీ కాఫీ పెట్టి తీసుకొస్తుంది. పల్లవి శ్రీయాను అడ్డుకుంటుంది. ఇలాంటి పనులు చేసి అందర్నీ బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావా అవని ప్లేస్ ని నువ్వు భర్తీ చేయాలని చూస్తున్నావా అనేసి పల్లవి అంటుంది. దానికి శ్రీయ ఇది నా ఇల్లు నేను ఒకరిలాగా నటించాల్సిన అవసరం లేదు అయినా ఇది చేయాల్సిన అవసరం లేదు అందరికీ కాఫీ ఇవ్వడంలో తప్పు లేదు కదా నువ్వేంటి నన్ను బెదిరిస్తున్నావు నాకు వార్నింగ్ ఇస్తున్నావా అనేసి అంటుంది. నాకు వార్నింగ్ ఇస్తే నేను బెదరను నాకు ఇది చేయాలని చెప్తే నాకు నచ్చినట్లే నేను ఉంటాను అనేసి శ్రీయ పల్లవికి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత శీను ఇంట్లోకి రావడం చూసి పల్లవి పెద్ద రచ్చ చేస్తుంది. ఇంట్లోంచి గెంటేసిన అవనికి శీను షెల్టర్ ఇచ్చాడు. పనోడు పనోడు లాగా ఉండాలి కదా ఇలా చేయడం ఎందుకు అనేసి పెద్ద రచ్చ చేస్తుంది. రాజేంద్రప్రసాద్ శీను చేసిన మంచి పనికి అభినందిస్తాడు.. పల్లవి షాక్ అవుతుంది.

ఇక ఏదైనా జాబ్ చెయ్యాలని అనుకుంటుంది. జాబ్ కోసం కంపెనిలు తిరుగుతుంది.. కానీ ఎక్కడ కూడా జాబ్ దొరకదు. నిరాశ పడుతుంది. కానీ మళ్లీ ప్రయత్నించాలని అనుకుంటుంది. ఒక కంపెనీలో అవనికి జాబ్లో జాయిన్ అవ్వమని చెప్తారు చక్రధర్ ఫోన్ చేయడంతో నీకు జాబ్ ఇవ్వడం కష్టమని చెప్తాడు ఇక అవన్నీ బయటికి రాగానే పల్లవి చక్రధర్లు అక్కడ కనిపిస్తారు వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఇద్దరూ వాళ్ళ నాన్న గురించి వెధవా అంటూ ఘాటుగానే వాదులాడుకుంటారు. ఇక పల్లవి ఇంటికి రాగానే కమల్ పల్లవి పై సీరియస్ అవుతాడు పల్లవి డ్రామాలు మొదలుపెట్టి కమల్ ని కూల్ చేస్తుంది.. ఇక అలసిపోయి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది. కానీ అక్కడకు కొందరు రౌడీలు వచ్చి మిస్ బిహేవ్ చేస్తారు. ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×