E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: శ్రీకర్ వల్ల బాధపడ్డ రాజేంద్ర..పల్లవికి వార్నింగ్ ఇచ్చిన చక్రధర్.. మీనాక్షి అరెస్ట్..?

Intinti Ramayanam Today Episode: శ్రీకర్ వల్ల బాధపడ్డ రాజేంద్ర..పల్లవికి వార్నింగ్ ఇచ్చిన చక్రధర్.. మీనాక్షి అరెస్ట్..?
Advertisement

Intinti Ramayanam Today Episode December 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో అందరం కలిసి తింటున్నాం కదా మళ్లీ కొత్తగా ఇదేంటి అని పార్వతి అంటుంది. నాకు కావాలంటే నేను చేసి పెడతాను కదా నువ్వెందుకు టిఫిన్ ఆర్డర్ చేసుకున్నావు అని పార్వతి అడుగుతుంది. జైల్లో అయినా ఖైదీకి నచ్చితేనే తింటాడు. లేకపోతే తినడు అలాంటిది మీ అమ్మ నిన్ను అడుగుతుంది చూసావా శ్రీ అని కావాలని రెచ్చగొడుతుంది శ్రియ. మొత్తానికి ఇంట్లో వాళ్ళందరి కోపానికి శ్రీయ శ్రీకర్ కారణమవుతారు.. ఇంట్లో ఇన్ని అవమానాలు భరిస్తూ ఉండాల్సిన అవసరం మనకు లేదు అని శ్రీకర్ అంటాడు. శ్రియ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆస్తి రాకుండా అయిపోతుంది ఆస్తి కోసమైనా ఇక్కడే ఉండాలి అని వెంటనే ప్లేట్ మార్చేస్తుంది. అయినా మనల్ని ఎవరన్నారు మీ అమ్మానాన్ననే కదా మనం తప్పు చేశామని వాళ్ళు అన్నారు అందుకే బాధపడాల్సిన అవసరమేంటి ఇకనుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా లేదు అని శ్రియ అంటుంది. ఊరుకున్నాం కదా అని వీళ్ళు ఎన్ని మాట్లాడిన పడాల్సిన అవసరం నాకు లేదు పద వెళ్లిపోదామని శ్రీకర్ అంటాడు. కానీ శ్రియ మాత్రం ఆస్తి వచ్చేంతవరకు ఎలాగైనా సరే ఇక్కడే ఉండాలి అని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ అవని రాజేంద్రప్రసాద్ ని టెన్షన్ పడొద్దు అని అంటారు. వాళ్లని అనడం నా తప్పే వాళ్లు చిన్నవాళ్ళు కాబట్టి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని అక్షయ్అం టారు. ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు లేరా నువ్వేం బాధపడకు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. మిమ్మల్ని అంత మాట అని లోపల నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అందుకే అనేసాను నాన్న నన్ను క్షమించండి అని అంటాడు. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు అని అంటాడు. మీరు నాకు క్షమాపణ చెప్పడం కాదురా నేనే మీకు క్షమాపణలు చెప్పాలి.. అందరూ కలిసి ఉండాలని నా ఆలోచన కోసమే మీరు కష్టపడి వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చారు..

Advertisement

వాళ్లు మాత్రం వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ అందరిని ఇబ్బంది పెడుతూ బాధపడుతున్నారు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఇలాంటి విషయాలు గురించి మీరు ఏమి పట్టించుకోకండి నాన్న మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాము అని అంటారు. అవని నాకు ఆఫీస్ కి టైం అయింది అత్తయ్య నేను వెళ్లి వస్తాను అని అంటుంది.. అలాగే అక్షయ్ కూడా నేను కూడా వెళ్తాను అని వెళ్తాడు. చక్రధర్ జైల్లో ఉన్నాడని బాధపడుతూ పల్లవి జైలుకు వెళుతుంది..ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది డాడీ అని అంటుంది.. ఎలా ఉన్నా మీరు ఎలా అయిపోయారు మీకోసం నేను భోజనం తీసుకొచ్చాను ఇది తినండి అని అంటుంది..

కానీ చక్రధర్ మాత్రం మనసులో పగ ఉంటే భోజనం ఎలా సహిస్తుంది ముద్ద దిగుతుందా అని అంటాడు. అవని నీ మీనాక్షిని బయటికి పంపించేందుకు నేను ప్లాన్ చేశాను డాడ్ ఈరోజు తో మీనాక్షి పీడ పోతుంది అని అంటుంది.. ఇప్పుడు అక్కడికి వచ్చినా కానిస్టేబుల్ మేడం మీకు ఇచ్చిన టైం అయిపోయింది మీరు బయటకు పదండి అని అంటాడు. ఫైవ్ మినిట్స్ అండి మా నాన్నకి లంచ్ పెట్టేసి వెళ్ళిపోతాను అని అంటుంది పల్లవి. అవన్నీ నేను చూసుకుంటాము మీరు ఎల్లండి మేడం అనేసి కానిస్టేబుల్ అంటాడు..

Advertisement

రాజేంద్రప్రసాద్ తన పరిస్థితి ఇలా అయినందుకు బాధపడుతూ ఉంటాడు.. అప్పుడే ఖైదీలలో ఒకడు అక్కడికి వచ్చి ఏంటి నువ్వు ఏమైనా జమీందారువా? లేకపోతే లీడర్ వా? కూర్చొని ఉన్నావ్ ఇక్కడున్న వాళ్ళందరూ పనిచేయాలి నేరం చేసే జైలుకు వచ్చావు కదా అని అంటాడు. ఇక్కడ అందరూ సమానమే పద పని చెయ్ అని అంటే చక్రధారి నేనెవరో తెలుసా నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా అని రెచ్చిపోతాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం నువ్వు ఎవరనేది నాకనవసరం ఇలానే కూర్చుంటే పని ఎవరు చేస్తారు పద అనేసి అతని చేత బలవంతంగా పనిచేస్తారు..

ఇక తర్వాత చక్రధర్ తినకుండా బాధపడుతూ ఉంటాడు. నీకేమన్నా స్పెషల్ గా చెప్పాలా మళ్ళీ ఈ ఫుడ్ కూడా నీకు దొరకదు లైన్ లో నిలబడు అని అంటాడు.. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా జైలుకు రావాల్సిందే కదా అందుకే ఈ భోజనం అయినా మనకు దొరుకుతుంది.. అప్పు చేసే ముందు రా మనం ఆలోచించాలి ఎందుకురా ఈ తప్పు చేశాము అని.. ఇక్కడ అందరూ సమానమే అని అతను అనగానే ఆ భోజనాన్ని చక్రధర్ అక్కడ పడేసి మౌనంగా వెళ్ళిపోతాడు.. ఈ బతుకు బతకడం కంటే చచ్చిపోవడమే నయమని చక్రధర్ సూసైడ్ అటెండ్ చేస్తాడు.

పార్వతి కి అవని ఫోన్ చేసి అత్తయ్య నాకు రావడానికి లేట్ అవుతుంది మీరు వెళ్లి ఆరాధ్యను తీసుకురండి అని అంటుంది. నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయని రాజేంద్రప్రసాద్ కి చెప్తే నాకు చేత కావట్లేదు పార్వతి. ఇంట్లో పల్లవి ఉంది కదా వెళ్లి చెప్పు అనేసి అంటాడు.. పల్లవి నువ్వు వెళ్లి స్కూల్ దగ్గర ఆరాధ్యను తీసుకొని వస్తావా అని అంటుంది.. దానికి అసలే తిక్క నాకు కాల్ ఎలా మాట్లాడుతుంది నేను నాలుగైన వేస్తాను అని పల్లవి నేను తీసుకురాను అంటుంది. ఇక తర్వాత మీనాక్షి నేను వెళ్లి తీసుకొస్తాను అని ఆరాధ్యను తీసుకొని వస్తుంది.

Also Read: అడ్డంగా దొరికిపోయిన ప్రభావతి.. సత్యం క్షమాపణలు.. మీనాకు దారుణమైన అవమానం.. ట్విస్ట్ ఇదే..

దారి మధ్యలో ఆరాధ్య నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అమ్మమ్మ అని అడుగుతుంది. సరే వెళ్లి తీసుకుందాం పద అనేసి మీనాక్షి అంటుంది. ఆరాధ్య నేను వెళ్లి తీసుకొస్తాను అని వెళుతుంది. అక్కడికి వచ్చిన ఓ దొంగ మీనాక్షి చేతిలో ఒక బ్యాగు పెట్టి ఈ బ్యాగు నువ్వు పట్టుకో నేను ఇప్పుడే వస్తాను అనేసి వెళ్తాడు. ఆ దొంగని తరుముకుంటూ వచ్చిన పోలీసులు అతను ఎవడు నీకు తెలుసా నీ చేతిలో ఎందుకు బ్యాగ్ పెట్టాడు అని అడుగుతారు. అక్కడికొచ్చిన ఆరాధ్య మా అమ్మమ్మని ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది. ఈమె మీ అమ్మమ్మ నా అయితే పదం మీ ఇంటికి తీసుకొని వెళ్ళు అనేసి పోలీసులు ఇంటికి తీసుకొని వెళ్తారు. అది చూసిన అందరూ షాక్ అవుతారు. ఏంటమ్మా నువ్వు పోలీసులతో పాటు వచ్చావ్ ఏంటి అని అవని అడుగుతుంది. ఒక దొంగ బ్యాగులు తెచ్చి మీ అమ్మ చేతిలో పెట్టాడు ఆ తర్వాత వాడి వెళ్ళిపోయాడు. ఆ దొంగకు మీ అమ్మకు ఏదో సంబంధం ఉందని మా అనుమానం అందుకే ఇక్కడికి వచ్చాము మీ ఐడి కార్డులు చూపించండి అని అడుగుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×