E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: నిజం దాచిన రాజేంద్రప్రసాద్.. పల్లవి మాస్టర్ ప్లాన్..అవనికి దొరికిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: నిజం దాచిన రాజేంద్రప్రసాద్.. పల్లవి మాస్టర్ ప్లాన్..అవనికి దొరికిపోతుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode December 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆస్తులు మళ్లీ రావడంతో ఇంట్లో వాటా కోసం చిన్నపాటి యుద్ధమే చేస్తారు. ముఖ్యంగా శ్రీయ ఆస్తి కోసం చిన్నా, పెద్ద అని తేడా లేకుండా కడిగిపడేస్తుంది. ఆ మాటలకు అందరు ఒక్కసారి షాక్ అవుతారు. భానుమతి అరే రాజేంద్ర ఆస్తుల కోసం ఇంత గొడవలు జరుగుతున్నాయి. అక్షయ్ అవనీలకు ఎంత హక్కు ఉందో మిగిలిన వాళ్లకు కూడా అంతే హక్కు ఉంది అని అంటుంది. అమ్మమ్మ గారు కూడా చెప్తున్నారు కదా మామయ్య మీరేం మాట్లాడరేంటి అని శ్రీయా అడుగుతుంది.

మీరు ఇంతగా అడుగుతున్నావ్ కాబట్టి చెప్తున్నాను.. ఈ ఇళ్లు ఆస్తులు అన్ని కూడా నా కష్టార్జితం నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. శ్రీయ షాక్ అవుతుంది. మీ ఉద్దేశం ఏంటో బాగా అర్థమైంది మీరు అవనికి అక్షయ్ కి ఇవ్వాలని అనుకుంటున్నారు. మొత్తానికి ఇంట్లో ఆస్తి కోసం పెద్ద గొడవలు జరుగుతాయి. ఆస్తులు గురించి మీరేమీ మాట్లాడొద్దు. అవని అక్కే ఇలాంటివన్నీ చేసిందేమో అని శ్రీయా అంటుంది. అవనిపై శ్రీయ సీరియస్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ మాత్రం రాజేంద్రప్రసాద్ ఎందుకు ఇలా చేస్తున్నాడు.. ఒకప్పుడు మన వద్దన్నా సరే ఆస్తులు పంచాలి అని అన్నాడు. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు వద్దని అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు అని అంటాడు. ఈ విషయం ఎలాగైనా సరే నేను నాన్నను అడిగే తెలుసుకుంటాను అని అక్షయ్ అంటాడు… అవని అక్షయ్ ఇద్దరూ రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్లి ఆస్తులు పంపకాల గురించి మరోసారి అడుగుతారు. మిమ్మల్ని ఎవరేమన్నా సరే మీరు పట్టించుకోవద్దు.. ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. పార్వతి కనీసం నాకైనా ఆ విషయం ఏంటో చెప్పండి అని అడుగుతుంది. నువ్వు కూడా వాళ్ళలాగే వెయిట్ చెయ్ సమయం వచ్చినప్పుడు నేనే అందరికీ చెప్తాను అని అంటాడు.

మీనాక్షి ఒంటరిగా కూర్చుని శ్రేయ అన్న మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతేనే ఇలాంటి బాధలన్నీ ఉండవు అవని కూడా బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఆరాధ్య ఏంటమ్మా బాధపడుతున్నావా? నువ్వేమీ బాధపడకు తాతయ్య పేరు అందరికీ చెప్పచ్చు కదా అమ్మమ్మ అందరిని అలా అంటుంటే అని ఆరాధ్య అంటుంది. మీనాక్షి మీ తాతయ్య ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో తెలియదు అమ్మ.. అందుకే చెప్పలేదు ఒకవేళ వస్తే కచ్చితంగా నేను అందరికీ చెప్తాను అని అంటుంది.. అరే అమ్మమ్మ నువ్వు ఎవరేమన్నా పట్టించుకోవద్దు బాధపడొద్దు అని ఆరాధ్య అంటుంది..

Advertisement

అక్షయ్ అవని దగ్గరికి వెళ్లి నాకు ఒకటి కావాలి అని అడుగుతాడు. మీకేం కావాలో నాకు అర్థమైంది ఈ టైంలో ఇక్కడ ఏంటండి మీరు అని అవని సిగ్గుపడుతుంది. వీరిద్దరిని చూసిన పల్లవి షాక్ అవుతుంది. వీళ్ళు దూరంగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు దగ్గర అయ్యి మా నాన్నని జైలుకు పంపించారు అని కోపంగా ఉంటుంది. వీళ్ళు సరసాలు చూడలేకపోతున్నాను కాలేజీ పిల్లలు లాగా రొమాన్స్ చేస్తున్నారు అని పల్లవి అనుకుంటుంది. ఆరాధ్య కు స్కూల్ ఫీజు కట్టాలి డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాడు అక్షయ్.. లోపల బీరువాలో ఆ డబ్బులను పెట్టాను వెళ్లి తీసుకొని ఫీజు కట్టండి అని అవని అంటుంది. మా నాన్న ఆస్తి డాక్యుమెంట్స్ కూడా అందులోనే ఉన్నాయేమో అని పల్లవి అనుకుంటుంది.

ఆ రూమ్ లోకి వెళ్లి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో వెతికి తీసుకోవాలి అని పల్లవి అనుకుంటుంది. అక్కడ ఆరాధ్యను ఉండటం చూసే షాక్ అవుతుంది.. నేనేదో టెన్షన్లో ఉన్నానమ్మ అందుకే బంగారు తల్లి సీరియస్ అయ్యాను అండ్ సారీ అని పల్లవి ఆరాధ్యకు సారీ చెప్తుంది. ఇక తాళాలు తీసుకొని వెతుకుతూ ఉంటుంది.. అప్పుడే అవని రావడం గమనించి అక్కడి నుంచి బయటికి వస్తుంది. అవని పిన్ని ఎందుకు వచ్చిందమ్మా అని అడుగుతుంది. నెక్లెస్ కావాలంటా అని అనగానే అవనికి అనుమానం మొదలవుతుంది.. పల్లవి ఏ దానికోసమో వెతుకుతుంది కచ్చితంగా దాన్ని పల్లవికి దక్కకుండా చేయాలి అని అవని అనుకుంటుంది.

Also Read:రోహిణికి షాకిచ్చిన మనోజ్.. స్వామీజీని కలిసిన ప్రభావతి, మనోజ్.. బాలు ట్విస్ట్..

కమల్ కరెంటు పనిచేస్తుంటే భానుమతి నవ్వుతూ ఉంటుంది. దీనికి ఫోన్ ఉంటే చాలు ఇంట్లో ఉన్న సమస్యలు ఏవి పట్టవు ఎలాగైనా సరే దీనికి బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు. ముందుగా నీళ్లు కావాలని అడుగుతాడు. ఆ తర్వాత వీపు మీద దురద వస్తుంది గోకమని చెప్తాడు.. అప్పుడే కరెంట్ షాక్ ఇస్తాడు.. దాంతో భానుమతి కింద పడిపోతుంది.. శ్రియ శ్రీకర్ మాత్రం ఒక్కటైపోతారు. ఎలాగైనా సరే ఆస్తి కోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు.. ఇక పల్లవి ఆస్తి డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో వెతికి తీసుకొని మా నాన్నను ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి అని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×