E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్.. తిరిగి వచ్చిన ఆస్తి.. శ్రీయకు అవని స్ట్రాంగ్ వార్నింగ్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్.. తిరిగి వచ్చిన ఆస్తి.. శ్రీయకు అవని స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Intinti Ramayanam Today Episode December 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి బట్టలు ఆరేయడానికి వెళ్తే ఇటువంటి అత్తయ్య నేను ఆరేస్తాను అని అవని అంటుంది. కానీ పార్వతి మాత్రం ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంట్లోంచి వచ్చిన ఆరాధ్య. బామ్మ చచ్చిపోవాలని ఏదో చేసుకుంటుంది లోపలికి రండి అని అంటుంది.. భానుమతి తనపై పెట్రోల్ పోసుకొని చచ్చిపోవాలని అనుకుంటుంది. ఇంట్లో ఇవాళ అందరూ కూడా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఎందుకు చచ్చిపోవాలని అనుకుంటున్నావు అని అడ్డుపడతారు. ఈ వయసులో నా కూతురు పరిస్థితిని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను.

నేను చచ్చిపోతాను అని అంటుంది.. నువ్వు మేమెంత చెప్పినా వినట్లేదు కదా ఆగు అని అక్షయ్ లోపలికి వెళ్తాడు. ఒక అగ్గి పెట్టిన తీసుకొని వచ్చి మేము ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు కదా చచ్చిపో అని భానుమతికిస్తాడు..నువ్వు ఎంతసేపు ఆ చక్రధరిని బయటకి తీసుకురాలేదు అని అంటున్నావు తప్ప నేను మన కుటుంబం ఎంత అతని వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్నామో ఆలోచించవా అని అక్షయ్ అంటాడు. ఆస్తులు పోయిన పర్లేదు కానీ నాకు గౌరవం నా విలువ నా స్టేటస్ మొత్తం అతని వల్ల పోగొట్టుకున్నాను.. ఈరోజు నాకెవరూ విలువ ఇవ్వట్లేదు అంటే దానికి కారణం చక్రధర్. అన్ని చేసిన వాడిని క్షమించి తీసుకురావాలి నువ్వు అంటున్నావు. వాడిని ఎట్టి పరిస్థితులను బయటికి తీసుకొచ్చే ప్రసక్తే లేదు అని వార్నింగ్ ఇస్తాడు అక్షయ్..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి ఇంట్లోంచి బయటికి వెళ్తున్న మీనాక్షిని చూసి ఆమెను ఫాలో అవుతుంది. బలే దొరికింది.. అసలు ఇలా దొరుకుతుందని అనుకోలేదు ఎలాగైనా దీన్ని ఈరోజు చంపేయాలి అని పల్లవి ప్లాన్ చేస్తుంది.. తన మనుషులకి మీనాక్షి గురించి చెప్తుంది. ఆరాధ్య అమ్మమ్మ ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్లిందని పార్వతిని అడుగుతుంది.. పార్వతి నాకేం తెలుసు అని అంటుంది.. శ్రియ దగ్గరికి వెళ్లిన ఆరాధ్య అమ్మమ్మ ఎక్కడ అని అడిగితే ఏమో నాకు తెలీదు అని అంటుంది. అవని వాళ్ళ అమ్మ కోసం వెతకడానికి బయటకు వెళ్తారు. ఆ రౌడీలు మీనాక్షిని చంపబోతుంటే.. అసలు కాపాడుతారు ఆ రౌడీలని అరెస్ట్ చేస్తారు.. ఇప్పుడు అక్కడికి వచ్చిన అక్షయ్ అవని ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్లాలి అనుకున్నావ్ అమ్మ ఇంట్లో చెప్పకుండా అని అవని అడుగుతుంది..

ఇక మీనాక్షి నావల్ల మీ ఇంట్లో మీరు ఇబ్బందులు పడుతున్నారు అందుకే నేను ఇంట్లోంచి వెళ్లిపోవాలని అనుకున్నాను అని అంటుంది.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా మీనాక్షి ఎక్కడికి వెళ్ళింది అని టెన్షన్ పడుతూ ఉంటారు.. కామెడి వెళ్లాలనుకున్నప్పుడు వీళ్ళు మళ్ళీ తీసుకురావడం ఎందుకు అని భానుమతి అంటుంది.. ఈవిడ ఎక్కడికెళ్ళిందో ఈవిడతో అన్ని సమస్యలేని పార్వతి కూడా అంటుంది.. కమల్ అన్నయ్య వదిన ఎక్కడికి వెళ్లారో నేను కూడా వెళ్లేసి వస్తాను అని అంటాడు.. ఇంకెక్కడికొస్తుంది శవం కూడా మీకు దొరకదు అని అంటుంది.. అప్పుడే అక్కడికి అన్నయ్య వదిన వచ్చారు అని కమల్ అంటాడు.

Advertisement

మిగతా వాళ్ళు ఏమో కానీ పల్లవి మాత్రం టెన్షన్ పడుతూ ఏమైందని చూస్తుంది.. వాళ్లతో మీనాక్షి రావడం చూసినా పల్లవి షాక్ అవుతుంది.. రౌడీల సచ్చినోళ్ళు ఎందుకు చేశారు అని ఆలోచిస్తూ ఉంటుంది.. రాజేంద్రప్రసాద్ ఏమైందమ్మా అని అడుగుతాడు.. ఇంట్లో వాళ్ళందరూ తలా ఒక మాట అంటుంటే మా అమ్మ వినలేక వెళ్ళిపోవాలనుకునేది మావయ్య గారు అని అవని అంటుంది.. మరి ఎక్కడ ఏమైంది అని అంటాడు.. మా అమ్మను ఎవరో రౌడీలు అటాక్ చేసారు చంపాలని చూస్తారు అని అంటుంది.. పోలీసులు సమయానికి రావడంతో వాళ్లని అరెస్ట్ చేశారు మా అమ్మని కాపాడారు అని అవని అంటుంది..

ఆ మాట వినగానే భానుమతి ఈవిడ వచ్చినప్పుడే అనుకున్నాను.. పేరు చెప్పకుండా అంటే ఇలాంటివేమో ఉంటాయని నేను అనుకున్నాను.. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈమె భర్త పేరు చెప్పడం ఏమో కానీ మేమందరము ముసుగేసుకుని బయట తిరగాల్సి వస్తుంది అని అంటుంది. ఆ మాట వినగానే కమల్ బుద్ధుందా కొంచెం పెద్దదానివైనా నువ్వు ఇలా మాట్లాడొచ్చా అని అంటాడు.. ఈవిడ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్యలు వస్తున్నాయి అని శ్రియ కూడా అంటుంది.. తర్వాత పల్లవి దగ్గరికి వెళ్లిన అవని.. ఆ రౌడీలను పోలీసులు తీసుకొని వెళ్లారు లేఖన్నా ఉంటే తల పగలగొట్టిన అసలు నిజాన్ని బయటకు కక్కించేదాన్ని అని అంటుంది.

ఇక శ్రియా తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఏమైంది అని అడుగుతుంది ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఎన్ని కష్టాలు నీకేం తెలుసే అని శ్రియ మాట్లాడుతుంది అప్పుడే అక్కడికి లాయర్ రావడం చేసిన శ్రీయ వెంటనే వెళ్లి శ్రీకర్ తో ఈ విషయాన్ని చెప్తుంది.. లాయర్ రావడం చూసి ఇంట్లో వాళ్ళందరూ ఏమైందని అనుకుంటారు. అయితే మీ ఆస్తి మీకు వచ్చింది అని చెప్పగానే సంతోషంతో పొంగిపోతారు. అనుమతి ఆస్తి వచ్చింది కదా ఇక మన ఇంటికి వెళ్లి పోదామా అని అడుగుతుంది.. ఆ ఇంటికి వెళ్లడానికి ఇంకాస్త టైం ఉంది అప్పుడే కాదు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. అయితే శ్రీయ ఆస్తి వచ్చేసింది కదా ఇంక ఎవరు ఆస్తి వాళ్ళకి ఇస్తారా అని అడుగుతుంది.

Also Read : మనోజ్ కు కొత్త టెన్షన్.. కొత్త కారు కొన్న బాలు.. ఒక్కటైన సత్యం, ప్రభావతి..

ఆస్తి గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. అలాగే పని కూడా మావయ్య గారి మాటకి ఎదురు చెప్పే అధికారం నీకు ఎవరు ఇచ్చారు అని అంటుంది.. పతికి ఆస్తి పత్రాలు ఇచ్చి దేవుడి దగ్గర పెట్టమని రాజేంద్రప్రసాద్ అంటాడు. పార్వతి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మన గదిలో పెట్టు అని అంటాడు. శ్రీయ మాత్రం ఆస్తి కోసం పెద్ద రచ్చ చేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది… ఇప్పుడు ఎపిసోడ్ లో రాజేంద్రప్రసాద్ కీలక నిర్ణయం తీసుకుంటాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×