E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: భానుమతికి షాకిచ్చిన అక్షయ్.. మీనాక్షిని లేపేసేందుకు పల్లవి ప్లాన్.. నెక్స్ట్ ట్విస్ట్ ఏంటి..?

Intinti Ramayanam Today Episode: భానుమతికి షాకిచ్చిన అక్షయ్.. మీనాక్షిని లేపేసేందుకు పల్లవి ప్లాన్.. నెక్స్ట్ ట్విస్ట్ ఏంటి..?
Advertisement

Intinti Ramayanam Today Episode December 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి భోజనం చేయకుండా తన గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. పార్వతి నువ్వు ఉదయం నుంచి భోజనం తినలేదు కాస్త భోజనం చెయ్యమ్మా అని అడుగుతుంది. తన తల్లి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడిన అవని మా అమ్మ కోసం ఏమి చేయలేదు చూశారా మీరు తన తప్పుల్ని క్షమించి ఇంట్లోకి తీసుకొచ్చిన సరే తను మాత్రం మారలేదు అని పల్లవి ఇంకాస్త పార్వతీని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. భానుమతి కూడా పల్లవికి తోడై పార్వతిని రెచ్చగొడతారు. పార్వతి ఆ అవని సంగతి నేను చూసుకుంటాను అని వెళ్ళిపోతుంది. మామ్ అంతగా జైలు నుంచి తీసుకురావాలని ఎంత చెప్పినా సరే ఆ అవని మిమ్మల్ని తీసుకొచ్చేందుకు ఇష్టపడడం లేదు. అవని వల్లే మీరు ఇప్పుడు జైలు నుంచి బయటకు రాలేకపోతున్నారు డాడ్ అని పల్లవి అంటుంది.. నేను ఏమీ చేయలేకపోతున్నాను అవని చంపేద్దామని అంత కోపంగా ఉంది నాకు అని పల్లవి అంటుంది.. అవనిని చంపితే మనకి ఏమి రాదు మన ఆస్తి కూడా అవనితో పాటి పోతుంది.. అక్షయ్ నో లేకపోతే మీనాక్షినో చంపేస్తే మనం ఆ అవనికి కన్నీళ్లు మిగిల్చిన వాళ్ళం అవుతాము అని చక్రధర్ పల్లవి కుట్ర చేస్తారు. ఎలాగైనా సరే ఆ మీనాక్షిని చంపాలని కసితో ఉంటుంది పల్లవి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పార్వతి బట్టలు ఆరేయడానికి వెళ్తే ఇటువంటి అత్తయ్య నేను ఆరేస్తాను అని అవని అంటుంది. కానీ పార్వతి మాత్రం ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంట్లోంచి వచ్చిన ఆరాధ్య. బామ్మ చచ్చిపోవాలని ఏదో చేసుకుంటుంది లోపలికి రండి అని అంటుంది.. భానుమతి తనపై పెట్రోల్ పోసుకొని చచ్చిపోవాలని అనుకుంటుంది. ఇంట్లో ఇవాళ అందరూ కూడా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఎందుకు చచ్చిపోవాలని అనుకుంటున్నావు అని అడ్డుపడతారు. ఈ వయసులో నా కూతురు పరిస్థితిని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నేను చచ్చిపోతాను అని అంటుంది.. నువ్వు మేమెంత చెప్పినా వినట్లేదు కదా ఆగు అని అక్షయ్ లోపలికి వెళ్తాడు. ఒక అగ్గి పెట్టిన తీసుకొని వచ్చి మేము ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు కదా చచ్చిపో అని భానుమతికిస్తాడు..

Advertisement

నువ్వు ఎంతసేపు ఆ చక్రధరిని బయటకి తీసుకురాలేదు అని అంటున్నావు తప్ప నేను మన కుటుంబం ఎంత అతని వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్నామో ఆలోచించవా అని అక్షయ్ అంటాడు. ఆస్తులు పోయిన పర్లేదు కానీ నాకు గౌరవం నా విలువ నా స్టేటస్ మొత్తం అతని వల్ల పోగొట్టుకున్నాను.. ఈరోజు నాకెవరూ విలువ ఇవ్వట్లేదు అంటే దానికి కారణం చక్రధర్. అన్ని చేసిన వాడిని క్షమించి తీసుకురావాలి నువ్వు అంటున్నావు. వాడి వల్ల నా భార్య ఎన్నో ఇబ్బందులను నరకాన్ని అనుభవించింది తనకి తిరిగి ఆ స్వర్గాన్ని తీసుకొని వస్తావా..? నా భార్య సంతోషాన్ని తిరిగి తీసుకొస్తానంటే చెప్పు నేను వెళ్లి వాడిని ఇప్పుడే తీసుకొస్తాను అని అక్షయ్ అంటాడు.

నీ కూతురు కన్నీళ్లు పెట్టుకుంటుంది అని బాధపడుతున్నావ్ తప్ప మేము ఎంతగా కన్నీళ్లు పెట్టుకున్నాము నీకు అర్థం కావట్లేదా అని అక్షయ అని వెళ్ళిపోతాడు.. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజేంద్రప్రసాద్ ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు కొంచమైనా ఆలోచించవా అని అంటాడు.. భానుమతి ఇక లోపలికి వెళ్ళిపోతుంది.. పల్లవి ఆ అక్షయ్ ని చంపేస్తే అవని వీడియో అవుతుంది తప్ప అక్కడ జరిగేది ఏమీ లేదు అని అనుకుంటుంది..

Advertisement

ఆ తర్వాత పల్లవి ఇంట్లోంచి బయటికి వెళ్తున్న మీనాక్షిని చూసి ఆమెను ఫాలో అవుతుంది. బలే దొరికింది.. అసలు ఇలా దొరుకుతుందని అనుకోలేదు ఎలాగైనా దీన్ని ఈరోజు చంపేయాలి అని పల్లవి ప్లాన్ చేస్తుంది.. తన మనుషులకి మీనాక్షి గురించి చెప్తుంది. ఆరాధ్య అమ్మమ్మ ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్లిందని పార్వతిని అడుగుతుంది.. పార్వతి నాకేం తెలుసు అని అంటుంది.. శ్రియ దగ్గరికి వెళ్లిన ఆరాధ్య అమ్మమ్మ ఎక్కడ అని అడిగితే ఏమో నాకు తెలీదు అని అంటుంది.. అవని దగ్గరికి వెళ్లిన ఆరాధ్య అమ్మమ్మ కనిపించలేదు అని చెప్తుంది. అక్కడ ఎక్కడ ఉంటుంది వెతుకు అని ఆరాధ్యకు చెప్తుంది అవని…

Also Read :మనోజ్ కు షాకిచ్చిన ప్రభావతి..సుశీల దోస ప్లాన్ వర్కౌట్..మీనా, బాలు రొమాన్స్..?

ఎంత వెతికినా ఇంట్లో కనిపించకపోవడంతో అవని టెన్షన్ పడుతూ అక్షయకు ఈ విషయాన్ని చెప్తుంది.. అడిగితే మాకేం తెలుసు అని అంటారు.. ఇక అక్షయ్ అవని వాళ్ళ అమ్మ కోసం వెతకడానికి బయటకు వెళ్తారు. ఆ రౌడీలు మీనాక్షిని చంపబోతుంటే.. అసలు కాపాడుతారు ఆ రౌడీలని అరెస్ట్ చేస్తారు.. ఇప్పుడు అక్కడికి వచ్చిన అక్షయ్ అవని ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్లాలి అనుకున్నావ్ అమ్మ ఇంట్లో చెప్పకుండా అని అవని అడుగుతుంది.. ఇంట్లో మీరిద్దరూ అవమానాలు పడడం నాకు ఇష్టం లేదు అని నేను అందుకే వెళ్లిపోవాలని అనుకున్నాను అని మీనాక్షి అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×