E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని అవమానించిన పల్లవి.. పార్వతి దెబ్బకు పల్లవి షాక్.. చక్రధర్ ను తిట్టిన భరత్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని అవమానించిన పల్లవి.. పార్వతి దెబ్బకు పల్లవి షాక్.. చక్రధర్ ను తిట్టిన భరత్..
Advertisement

Intinti Ramayanam Today Episode April 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. అవనికి పల్లవి పుట్టుక గురించి చక్రధర్ అని నిజాలను బయటపెట్టేస్తాడు. 30 ఏళ్ల నుంచి నాలోనే నేను దాచుకున్న ఈ భయంకర నిజాన్ని ఈరోజు బయట పెట్టక తప్పలేదు అని చక్రధర్ అంటాడు. మరి ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు దాచారు నాన్న అని అవని అడగగానే మీ పిన్ని బతకదు అని ఆలోచించానమ్మ అందుకే దాచాను అని అంటాడు.. పల్లవిని మీరు అలా సపోర్ట్ చేసి అలానే పెంచారు.. ఎదుటివాళ్లు గొప్పగా ఉంటే తట్టుకోలేని మనస్తత్వం పల్లవిది. ఇప్పుడు రాజేశ్వరి పిన్ని కూతురు కాదు అని చెప్పినా కూడా పల్లవి వినే స్టేజిలో లేదు. ఇక మన చేసేదేమీ లేదు తనంతట తానే నిజం తెలుసుకొని తన తల్లికి దగ్గర అవ్వడమే అని అవని చక్రధర్ అనుకుంటారు.. మీనాక్షిని చూసి ఇద్దరు ఒక్కసారి షాక్ అవుతారు.. పంతులుగారు పూజకు రమ్మని పిలుస్తున్నారు. తర్వాత మాట్లాడుకుందురు ముందు రండి అని మీనాక్షి తీసుకొని వెళుతుంది. అక్కడ సీతారాముల కళ్యాణం చాలా గ్రాండ్గా జరుగుతుంది. కళ్యాణం బాగా జరిగిందని అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనాక్షి దగ్గరికి పల్లవి వెళ్తుంది.. నా బిడ్డలకి తండ్రి ఎవరో తెలిస్తే చాలు.. మీ ఆస్తి గాని మీ నాన్న గాని నాకు అక్కర్లేదని ఆరోజు అన్నావు.. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావ్ మా నాన్నతో కలిసి కూర్చొని పూజలు చేస్తున్నావా అని దారుణంగా అవమానిస్తుంది. ఆ మాట వినగానే మీనాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. నా తండ్రిని నాకు దూరం చేసి నీకు మీ పిల్లలకి మా నాన్నని తోడుగా ఉండాలని చూసుకుంటున్నావా ? మా అమ్మకి అన్యాయం చేయాలని చూసుకుంటున్నావా అని పల్లవి మీనాక్షిని దారుణంగా అవమానించేలా మాట్లాడుతుంది.. ఈ వయసులో నీకు భర్త కావాలా? మళ్లీ పిల్లలు కనలని అనుకుంటున్నావా అంటూ పల్లవి గోరంగా మాట్లాడడం మీనాక్షి తట్టుకోలేక పోతుంది. పల్లవి తో మీనాక్షి తప్పుగా మాట్లాడొద్దమ్మా నేను కూడా నీకు కన్న తల్లి లాంటి దాన్ని అంతగా చెప్తున్నా సరే వినకుండా తనని అవమానించేలా మాట్లాడుతుంది. పల్లవి నువ్వు అలా మాట్లాడడం తప్పు అని మీనాక్షి ఒక వైపు అంటున్న సరే పల్లవి మాత్రం తనని ఈ వయసులో మొగుడు కోసం ప్రాకులాడుతున్నవా? అని దారుణంగా మాట్లాడుతుంది..

Advertisement

తర్వాత పూజ పూర్తయిందని అందరూ చాలా సంతోషంగా ఇంటికి వచ్చేస్తారు.. పూజ ఇంత బాగా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు అని అందరూ కూడా అనుకుంటారు.. మా అమ్మ ముక్కు తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందండి అని అక్షయ్పై అవని ప్రశంసలు కురిపిస్తుంది.. నిజంగానే వదిన పూజ చాలా బాగా జరిగింది మా చేత దగ్గర ఉండి నువ్వు అన్ని స్వామివారికి అందేలా చేశావు అని శ్రీకర్, కమల్లు కూడా చాలా సంతోషంగా ఉంటారు.. ఆ దేవుడికి ఎవరు ఏం చేస్తే బాగుంటుందో తెలుసు ఆయన చెప్పినట్లే జరిగింది అని అవని అంటుంది..

ఇక పార్వతి పల్లవి ఇంటికి వచ్చేలోగా ఈ టైం అవుతుందని అసలు అనుకోలేదు. ఇప్పుడు అందరికీ భోజనం చేసి వడ్డించాలి వేళ్ళు ఆ పని చూడు అని పార్వతి అంటుంది.. ఒక్కొక్కరు ఒక్కో మెను చెప్పడంతో పల్లవి షాక్ అయిపోతుంది.. పండగపూట కూడా నాకు ఈ చాకిరి తప్పడం లేదు అని లోపలికి వెళ్లి బాధ పడిపోతూ ఉంటుంది. పండగ రోజు కూడా నాకు పని తగ్గుతుంది అని అనుకున్నాను కానీ ఇవాళ కూడా నాకు ఈ పని ఉందా అని తిట్టుకుంటూ వంట మొదలు పెడుతుంది పల్లవి.. ఇప్పుడు అక్కడికి వచ్చిన అవని నువ్వు కూరకు కట్ చేయు నేను మిగతా పనులు చేస్తాను అని అంటుంది..

Advertisement

నా మీద నువ్వేమీ జాలి పడాల్సిన అవసరం లేదు. అన్ని పనులు నేను దగ్గరుండి చేసుకోగలను అని అంటుంది.. నాకు ఈ శిక్ష వేయడానికి కారణం నువ్వే కదా ఇప్పుడు వచ్చి నువ్వు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అని సీరియస్ అవుతుంది.. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నేను చేసుకుంటాను అని పల్లవి అనగానే అవని మాత్రం తన సొంత చెల్లెలు అలా కష్టపడి పోతుందని బాధ పడిపోతూ ఉంటుంది.. ఇక ఆ తర్వాత భరత్ ఒక్కడే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక మీనాక్షి ప్రణతి చక్రధర్ ముగ్గురు కూడా అక్కడికి రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు..

ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తున్నావ్… పూజ అయిపోయింది కదా అక్కడే వదిలేసి రావాలి కదా.. మళ్ళీ ఇంటి వరకు తీసుకొనొచ్చావు అంటే.. నా మాటంటే నీకు గౌరవం లేదా అని భరత్ మీనాక్షిని తిడతాడు.. ఈ మనిషి గురించి తెలిసే ఇక్కడ వరకు తీసుకొని వచ్చారా? ఎందుకు ఇలా చేశారు అని భరత్ మీనాక్షిని దారుణంగా అవమానించేలా మాట్లాడతాడు. ఇక తర్వాత మీనాక్షి ఎంత చెప్తున్నా సరే భరత్ మాత్రం వినకుండా వాళ్ళిద్దర్నీ కలిపి మరి తిడుతూ ఉంటాడు. ఇక తర్వాత ఇద్దరు కలిసి తనని ఆశీర్వదించడానికి వచ్చాము అని భరత్ అని తిడుతున్న సరే తను మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.

Also Read :శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా ఒక్కరోజు 12 స్ట్రీమింగ్..!

మీనాక్షి అక్షింతలు వేసి ఆశీర్వదించండి అని చెప్పినప్పుడు భరత్ అతని అక్షింతలు తల మీద పడకూడదు అని విసిరి కొట్టేస్తాడు.. ఆవేశంలో కోపంలో అర్థం ఉంది భరత్ అనే చక్రధర్ చెప్తున్న సరే తను మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవని ఒంటరిగా కూర్చుని బాధ పడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అక్షయ్ పల్లవి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా అని అంటాడు.. పల్లవి మీ అమ్మకు కూతురు అని చక్రధర్ నీతో చెప్పడం నేను విన్నాను అని అనగానే అవని షాక్ అయిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×