E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనిపై పల్లవి సెటైర్లు.. పల్లవి ఫుల్ హ్యాపీ.. తాగొచ్చిన భరత్.. కొట్టిన కమల్..

Intinti Ramayanam Today Episode: అవనిపై పల్లవి సెటైర్లు.. పల్లవి ఫుల్ హ్యాపీ.. తాగొచ్చిన భరత్.. కొట్టిన కమల్..
Advertisement

Intinti Ramayanam Today Episode April 28th : శ్రీకర్ ఇంట్లోకి రాగానే పార్వతి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. నువ్వు ఇంటికి రావాలని దేవుడిని ఇలా మొక్కుకున్నానో లేదో నువ్వు అప్పుడే ఇంటికి వచ్చేసావ్ రా నా మొక్కు ఫలించింది అని పార్వతి ఎమోషనల్ అవుతుంది. కానీ శ్రీకర్ అన్నయ్య అని గట్టిగా పిలవడంతో కమల్ శ్రీకర్ అనే వచ్చాడు అని బయటికి వస్తాడు. ఈ దెబ్బలు ఏంట్రా అని అడగ్గానే పార్వతి ఏంట్రా ఈ దెబ్బలు అని అడుగుతుంది  ఏం లేదమ్మా బైక్ మీద వెళుతుండగా కింద పడ్డాను అని కమలంటాడు. అయితే కమల్ ఎంత చెప్తున్నా సరే శ్రీకర్ మాత్రం మాట్లాడడంతో పార్వతికి అనుమానం వస్తుంది. ఏం జరుగుతుంది రా ఇక్కడ అని అడుగుతుంది అప్పుడే ఇంటికి వచ్చినా అక్షయ అవనీలు శ్రీకర్ ను చూసి షాక్ అవుతారు.

పల్లవికి దిమ్మతిరిగే షాక్..

అవని ఇంట్లో జరుగుతున్న సమస్యల గురించి ఆలోచిస్తూ బయట ఒంటరిగా కూర్చుని ఉంటుంది. అవని అలా ఒంటరిగా కూర్చోవడం చూస్తున్న పల్లవి అక్కడికి వస్తుంది. ఏంటక్కా ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఆకాశం వైపు చూస్తున్నావు అని వెటకారంగా మాట్లాడుతుంది.. నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు ఎందుకు ఇలా వచ్చావు అని అడుగుతుంది అవని.. ఇంట్లో సమస్యలు అయితే పర్వాలేదు. ఇప్పుడు నీకు అత్తవారింట్లో సమస్యలతో పాటుగా పుట్టింటి సమస్యలు కూడా మీద పడ్డాయి. నువ్వు చాలా ఇబ్బందుల్లో పడ్డావు కదా అని పల్లవి ఇంకాస్త రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. నువ్విలా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని పల్లవి అనడంతో అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వు ఇలాంటి పుట్టుకతో పుడతావని అసలు ఊహించలేదు నువ్వు నీ అమ్మ కలిసి ఈమధ్య చేస్తున్నా పనులు అందరికీ తెలుసు కదా అని అవని అంటుంది. నువ్వు ఈ జీవితంలో మారవు అని అవని వెళ్ళిపోతుంది.

నీకు సంతోషం లేకుండా చేస్తాను..

Advertisement

నువ్విలా ఎన్నో రాత్రులు ఏడవాలని నేను కోరుకుంటున్నాను. నన్ను ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టావు ఎన్నోసార్లు అవమానించవు . నీకు ఇలాంటివి జరగాల్సిందే అప్పుడు నేను మనశ్శాంతిగా ఉంటాను అని పల్లవి అనుకుంటుంది. నీకు ఆలోచించే అంత టైం కూడా ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని పల్లవి ఫుల్ ఖుషి అవుతూ ఉంటుంది. మీ తమ్ముడు భరత్ నీ రెచ్చగొట్టి ఇంకా జరగాల్సినవి జరిగేలా చేస్తాను అని పల్లవి కంకణం కట్టుకుంటుంది.

తాగొచ్చిన భరత్..

చక్రధర్ భరత్ ఇంకా రాలేదు ఏంటమ్మా ప్రణతి అంటూ అడుగుతాడు. నీకేమైనా లేట్ అవుతుందని ఫోన్ చేసాడా ఎక్కడికి వెళ్లాడు అసలు అని చక్రధర అడుగుతాడు. నేను నాలుగు సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు మామయ్య భవిష్య ఏదైనా బిజీ పనిలో ఉన్నాడేమో అని చక్రధర్ తో ప్రణతి అంటుంది. అప్పుడే భరత్ చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని ఎక్స్క్యూజ్మీ అంటూ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. అది చూసిన ప్రణతి చక్రధర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నువ్వు ఇన్ని రోజులు ఎంతో మారారు అనుకున్నాను. ఇప్పుడు తాగేసి కూడా ఇంటికి వచ్చావా.. అని ప్రణతి బాధపడుతుంది నేనేమన్నా రోజు తాగే తాగుబోతు అనుకున్నావా ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని ప్రగతిని కొడతాడు భరత్… కోడల్ని కొడతావా ఏం మారిపోయావు భరత్ అంటూ చక్రధర్ సీరియస్ అవుతాడు. నువ్వు మీ ఆవిడని వదిలేసి ఇక్కడికి వచ్చావు అని నేను ఏ రోజైనా అడిగానా అలాంటిది నువ్వు నా పెళ్ళాన్ని కొడితే అడుగుతావా అని భరత్ అంటాడు.

చెంపపగలగొట్టిన మీనాక్షి..

Advertisement

భరత్ తాగొచ్చు ఇంట్లో రచ్చ చేస్తుందే మీనాక్షి చూస్తుంది. నువ్వు తాగొచ్చావా ఎందుకురా ఇంత మారిపోయావు అని మీనాక్షి అడుగుతుంది. ఇప్పుడు ఇంట్లో చాలా జరుగుతున్నాయి. అందరూ మారిపోయారు. నేను మారిపోతే తప్పేంటి ఈ పెద్ద మనిషి నన్ను అడిగే హక్కు ఎవరిచ్చారు అని చక్రధర గురించి దారుణంగా మాట్లాడతాడు. ఆ మాట వినగానే మీనాక్షి భరత్ చంప వాయించేస్తుంది.. నన్ను కొట్టే హక్కు ఎవరికీ లేదు అంటూ భరత్ అంటాడు..

కమల్ దెబ్బకు భరత్ ఫ్యూజుల్ అవుట్..

రాత్రి వెళ్లి పడుకున్న భరత్ ఉదయం లేవగానే ఎదురుగా కమల్ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. నువ్వేంటి ఇక్కడ ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. నా చెల్లెలిని కొడతావా అంటూ తన కోపాన్ని మొత్తం చూపిస్తాడు కమల్.. నా చెల్లెలు మీద చెయ్యి ఎత్తుతావా తన కంట్లో నీళ్లు వస్తేనే మేము తట్టుకోలేము అలాంటిది నువ్వు కొడతావా అంటూ భరత్ ని ఎవరు అడ్డుకున్న సరే వదలకుండా కమల్ దారుణంగా కొట్టేస్తాడు. ఇక చివరికి చక్రధర్ ఆపడంతో కమల్ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. కొత్త ఇంట్లోకి వెళ్లినందుకు శ్రీయా చాలా సంతోషంగా ఉంటుంది. కానీ శ్రీకర్ మాత్రం నా అనుకున్న వాళ్లు ఎవరూ లేకుండా చాలా అందంగా ఉంది అంటూ బాధపడిపోతాడు. ఇక తర్వాత కోపంగా ఇంటికి వచ్చిన కమల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లు కమల్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో మిస్ అవ్వకుండా చూడాలి..

Also Read :‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. ఏప్రిల్ లో హైలెట్ ఎపిసోడ్స్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×