E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనిని ఘోరంగా అవమానించిన పార్వతి.. ప్రణతికి అభార్షన్..

Intinti Ramayanam Today Episode: అవనిని    ఘోరంగా అవమానించిన పార్వతి.. ప్రణతికి అభార్షన్..
Advertisement

Intinti Ramayanam Today Episode April 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ఆరాధ్య కోసం లంచ్ బాక్స్ ను తీసుకొని స్కూల్ కు వెళ్తాడు. ఆరాధ్య నేను అన్నం తినేశాను నాన్న నాకు అమ్మ అన్నం తినిపించిందని చెబుతుంది. అదివిన్న అక్షయ్ ఏంటి స్కూల్ కి వచ్చి అన్నం తినిపించిందని అడుగుతాడు. ఇక్కడికి వచ్చి నీకు అన్నం తినిపించిందా అని అనగానే అక్కడికి వస్తుంది. నువ్వు నా కూతురుకి అన్నం తినిపించావా అని అనగానే నేను ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నానండి గ్రాఫ్ టీచరుగా అందుకే ఇక్కడ ఆరాధ్యకు అన్నం తినిపించాను అని అంటుంది. సరే అయితే నువ్వు తినలేదు కదా.. ఈ బాక్స్ ను తీసుకొని తినేసేయని అక్షయ అంటాడు.  కానీ నాకేం అవసరం లేదు ఇక నా డ్యూటీ అయిపోయింది. నేను వెళ్ళిపోతాను ఇంకా అనేసి అవని అనగానే అక్షయ్ కూడా వెళ్ళిపోవాలనుకుంటాడు. అప్పుడే ఆరాధ్య నాన్న అమ్మని తీసుకెళ్లండి.. అమ్మని డ్రాప్ చేయాల్సింది నువ్వే అని వాళ్ళిద్దర్నీ కలిసి ఒక కారులోనే పంపిస్తుంది ఆరాధ్య.. ఇద్దరు కలిసి సరదాగా ఉంటారు. అది పల్లవి చూసి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తనను మోసం చేసి ఆ వ్యక్తి విదేశాలకు పారిపోయాడు. ఇక తిరిగిరాడని తెలిస్తే ప్రణతి ఏమవుతుందో ఊహించలేము అని అంటుంది. ఆ మాటలు విన్న ప్రణతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నావల్ల వదినా చాలా కష్టాలు పడుతుంది. నేను చచ్చిపోతే వదినకు కష్టాలు తీరిపోతాయని ప్రణతి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అవని ఇంట్లో వాళ్ళందరికీ భోజనం వడ్డించి ఇంకా ప్రణతి రాలేదు భరత్ ని తీసుకు రమ్మని చెప్తుంది. లోపలికి వెళ్లి చూస్తే ప్రణతి గదిలో ఉండదు. మనం మాట్లాడుకున్న మాటలు ప్రణతి వినిందా ఏంటి? ఇకనుంచి వెళ్ళిపోయింది పదం వెళ్లి వెతుకుదామని వెతడానికి వెళ్తారు. ప్రణతి నీ వెతుక్కుంటూ అవని భరత్ వెళ్తూ ఉంటే అక్కడ ప్రణతి కింద పడిపోయి ఉంటుంది. అంబులెన్స్ కి ఫోన్ చేసి ప్రణతిని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ప్రణతికి స్పృహ వచ్చేసి నొప్పిగా ఉందని బాధపడుతూ ఉంటుంది.

Advertisement

నేను చచ్చిపోతున్న నాకు తెలుస్తుంది వదిన నువ్వు? అమ్మానాన్ననికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు నేను అసలు నిజం చెప్పాలి అని అంటుంది. కానీ అవని మాత్రం ముందు పిచ్చిపిచ్చి ఆలోచనలు మానేసి నీకు ఏమీ కాదు డాక్టర్ని పిలుస్తానని చెప్పేసి అంటుంది. డాక్టర్ చెక్ చేసి ఆమె కండిషన్ కాస్త క్రిటికల్ గా ఉంది అబ్జర్వేషన్ లో ఉంచాలి.. ఆపరేషన్ చెయ్యాలని చెప్తుంది. ముందు వెళ్లి డబ్బులు కట్టండి అని చెప్తుంది.

అక్షయ్ కి డబ్బుల కోసం ఫోన్ చేస్తుంది. కానీ అక్షయ్ మాత్రం కట్ చేస్తాడు. కమల్ కి అవని ఫోన్ చేస్తుంది. అది చూసిన పల్లవి ఫోన్ కట్ చేస్తుంది. చివరిగా రాజేంద్రప్రసాద్ కి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక డబ్బులు కోసమని అవని ఇంటికి వెళ్తుంది కానీ పల్లవి చెప్పిన మాటలు విని పార్వతి అవనిని ఘోరంగా అవమానిస్తుంది.. కూడా నువ్వేం మాకు అవసరం లేదు వెళ్ళిపో బయటికి అని అంటాడు. చేసేదేమీ లేక అవని అక్కడినుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

స్వరాజ్యం వాళ్ళ ఇంటికి వెళ్లి తన దగ్గర ఉన్న డబ్బుల్ని చూస్తుంది కానీ విషయం తెలుసుకున్న స్వరాజ్యం దయాకర్ వాళ్ళ దగ్గర ఉన్న 50వేలను ఇస్తారు. ఇది సరిపోవు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీటిని ఎలాగోలాగా కట్టేసేయమ్మ పొద్దున్నే మనకు కావాల్సిన అమౌంట్ ని అరేంజ్ చేసుకుందాం. డాక్టర్ని ఒక మాట అడుగు అనేసి స్వరాజ్యం అంటుంది.. ఇంకా డబ్బులు తీసుకొని అవని హాస్పిటల్ కి వెళ్లి కడుతుంది. డాక్టర్ని పరిస్థితి గురించి అడుగుతుంది. ఆమె కడుపుకి బలంగా గాయం తగలడం వల్ల ఆమెకు అబార్షన్ చేయాల్సి వచ్చింది అని డాక్టర్ చెప్పగానే అవని షాక్ అవుతుంది..

ప్రణతి దగ్గరికి వెళ్లి ప్రణతి పరిస్థితిని చూసి అవని బాధపడుతుంది. నా బిడ్డ ఏం పాపం చేసింది వదిన నా బిడ్డ చనిపోయింది దాని బదులు నేను చచ్చిన సరిపోయేది కదా అని ప్రణతి అంటుంది. ఇది నీ మంచికే అనుకో.. నిన్ను ప్రేమించిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు అతను వస్తాడు అన్న నమ్మకం కూడా మనకు లేదు అని అవని అనగానే తనకి సైలెంట్ అయిపోతుంది. ఇక అక్షయ్ ఆరాధ్య నువ్వు రెడీ చేసి స్కూల్ కి తీసుకెళ్లాలనుకుంటాడు. కానీ పల్లవి నేను నీకోసం క్యారేజ్ తెచ్చాను అంటే ఆరాధ్య నాకు అవసరం లేదంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రాజేంద్ర ప్రసాద్ కు అవని దాచిన నిజం గురించి తెలిసిపోతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×