E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనికి షాకిచ్చిన చక్రధర్.. భరత్ కు రాజేశ్వరి ఉద్యోగం.. శ్రీయ, పల్లవి వార్..

Intinti Ramayanam Today Episode: అవనికి షాకిచ్చిన చక్రధర్.. భరత్ కు రాజేశ్వరి ఉద్యోగం.. శ్రీయ, పల్లవి వార్..
Advertisement

Intinti Ramayanam Today Episode April 15th: భరత్ నీ ఎలాగైనా సరే తన దగ్గరికి తెచ్చుకోవాలి అని రాజేశ్వరి తన ఫ్రెండ్ నీలిమకు చెప్పి భరత్ గురించి వివరాలను తెలుసుకోమని చెప్తుంది. శ్రేయ పల్లవిని కాఫీ అడిగితే ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది. మొత్తానికి ఆ రచ్చ నుంచి బయటపడి అవని అక్షయ్ లు చక్రధర్ ని కలవడానికి బయటకు వెళ్తారు.. అయితే చక్రధర్ రాగానే మీరు పిన్ని దగ్గరికి వెళ్తేనే బాగుంటుంది అని అవని ఎంత చెప్పినా సరేం. తాను మాత్రం నేను ఈ ఒక్క కోరికను తీర్చలేనమ్మ నన్ను ఏమీ అనుకోవద్దు అని అంటాడు. భరత్ నీ పిన్ని ఇచ్చేయమని అడుగుతుంది కానీ ఇప్పుడు అమ్మ ఉన్న పరిస్థితులు అలా చేయడం కష్టమని ఎంత చెప్తున్నా సరే చక్రధర్ మాత్రం నేను వినను అని అంటాడు..

అవనికి దిమ్మతిరిగే షాకిచ్చిన చక్రధర్.. 

చక్రధర్ తో మాట్లాడి రాజేశ్వరి దగ్గరికి పంపించాలి అని అవని అనుకుంటుంది. కానీ చక్రధర మాత్రం అవని మాట అస్సలు వినడు. నేను తప్పు చేశానని ఎంత చెప్తున్నా సరే వినకుండా నా గురించి రాజేశ్వరి తప్పుగా మాట్లాడుతుంది. కట్టుకున్న భర్త అని కూడా లేకుండానే నన్ను ఎంతగా మానసికంగా హింసించిందో నాకు తెలుసు అని చక్రధరంటాడు. ఇన్ని రోజులకి నేను మీనాక్షి దగ్గరికి వచ్చి చాలా మంచి పని చేశాను అని అనుకుంటున్నాను. మీ అమ్మ నా దగ్గర నుంచి డబ్బు నగలు ఏమి ఆశించకుండా కేవలం తన భర్త అని గుర్తింపు కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసింది. కానీ రాజేశ్వరి మాత్రం తనకు డబ్బులు రాగానే భర్త అని కూడా చూడకుండా దూరం పెట్టేసింది అని చక్రధరంటాడు. పిన్ని దగ్గరికి నాన్నని పంపిస్తే ఈ సమస్య దూరం అవుతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ సమస్య ఇంకా పెరిగింది అని అర్థమవుతుంది అని అనుకుంటుంది.

కమల్ పనికి అక్షయ్ హ్యాపీ..

Advertisement

శ్రీకర్ అక్షయ్ ఇద్దరు కూడా సైట్లో ఎలా ఉండాలి ఏంటి అని చూస్తూ ఉంటారు. కానీ వర్కర్స్ అందరూ ఖాళీగా కూర్చుని ఉండటం చూసి శ్రీకర్ అక్షయ్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు.. ఏంటి మీరందరూ ఖాళీగా కూర్చున్నారు వర్క్ ఆపేస్తే ఎంత లాస్ అవుతుందో మీకు తెలుసా అని వాళ్ళని అడిగితే.. మెటీరియల్ ఇంకా రాలేదండి అని మేనేజర్ చెప్పగానే వాళ్లంతా షాక్ అవుతారు. కమల్ మెటీరియల్ కోసం వెళ్లాడని తెలుసుకొని అక్కడ వీడు గొడవ పడుతున్నాడేమో అని అన్నదమ్ములు ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అప్పుడే ఒక లారీ అక్కడ రావడంతో వాళ్ళు ఏంటి అని చూస్తారో అందులోంచి కమల్ రాగానే అసలు విషయం కనుక్కుంటారు.. అయితే కమల్ చెప్పింది విని అక్షయ్ నువ్వు చాలా మంచి పని చేశావురా అని పొగడ్తలతో ముంచేస్తాడు.

చక్రధర్ కు అవమానం..

మీనాక్షి భరత్ చెప్పులను తుడుస్తూ ఉండగా భరత్ ఏంటమ్మా నువ్వు చెప్పులు తుడవడం ఏంటి?నిన్ను ఎప్పుడు కష్టపెట్టుకున్న చూసుకోవాలి అన్నది నా పాలసీ అని అంటాడు. నువ్వు సంతోషంగా ఉండాలని మీనాక్షిని భరత్ అంటాడు. అయితే అప్పుడే భారత్ కి ఒక ఇంటర్వ్యూ నుంచి కాల్ వస్తుంది నెలకు రెండు లక్షల జీతం అనగానే భరత్ ఇంటర్వ్యూకి వస్తానని చెప్తాడు. ఇంట్లోకి వెళ్లి ఇంటర్వ్యూకి రెడీ అయ్యి బయటికి రాగానే చక్ర ఎదురుగా రావడంతో భరత్ సీరియస్ అవుతాడు. లోపలికి వెళ్లి వాటర్ తాగి వస్తుండగా మనం ఏదైనా మంచి పని కోసం బయటకు వెళ్తుంటే అపశకునాలు ఎదురైతే కాసేపు కూర్చొని వెళ్ళమంటారు కదా.. అందుకే నేను కూర్చొని వెళ్తున్నాను అని భరత్ చక్రధర్ ని అవమానిస్తాడు..

కొడుకుకు జాబ్ ఇచ్చిన రాజేశ్వరి..

Advertisement

రాజేశ్వరి ఈ కంపెనీలో ఉద్యోగం అని తెలియక భరతు అక్కడికి ఉద్యోగం కోసం వెళ్తాడు. అయితే నేను ఇక్కడ సెలెక్ట్ అయితే కచ్చితంగా నాకు రెండు లక్షలు ఇస్తారని అడుగుతారు.. మీరు ఇక్కడ సెలక్ట్ అయితే కచ్చితంగా మీకు నెలకు రెండు లక్షలు ఇస్తారు అని అనగానే భరత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.. ఇకపోతే అన్ని రౌండ్లను పూర్తి చేసిన భరత్ చైర్మన్ క్యాబిన్ కి వెళ్ళగానే అక్కడ రాజేశ్వరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. కానీ రాజేశ్వరి మాత్రం చక్రధర్ ని అవమానించే వ్యక్తులు దొరకడం నాకు చాలా ఇంపార్టెంట్ అని అంటుంది. జనరల్ మేనేజర్ గా ఉద్యోగాన్ని ఇస్తుంది.

పల్లవి, శ్రీయాల మధ్య గొడవ.. 

పల్లవి వాళ్ళ డాడీ ని ఎలాగైనా సరే వాళ్ళ మమ్మీ దగ్గరికి తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రేయ పల్లవి చేతిలో డబ్బులు పెట్టి టాబ్లెట్స్ కావాలని అడుగుతుంది. నీకు ఎలా కనిపిస్తున్నాను నేను టాబ్లెట్స్ తీసుకొచ్చే దానిలాగా కనిపిస్తున్నానా ఏంటి అని పల్లవి సీరియస్ అవుతుంది.. వీళ్ళిద్దరూ గొడవ పడుతుండగా అవని అలాగే పార్వతి అక్కడికి వస్తారు.. పల్లవి చెప్పింది విని ఒక్కసారిగా షాక్ అవుతారు. అవని శ్రీకర్ని అడిగితే తెస్తాడు కదా ఎందుకిలా వేరే వాళ్ళకి పనులు చెప్పడం అని అనగానే శ్రేయ మీ చెల్లి కందిపోతుందని బాధపడుతున్నావా అని అంటుంది.. మాట వినగానే అవని ఒక్క సరిగా షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో భరత్ కి ఉద్యోగం వచ్చిన విషయాన్ని చక్రధర్ అవనితో చెప్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :బుధవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×