E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: సూసైడ్ అటెంప్ట్ చేసిన రాజేశ్వరి.. రెచ్చిపోయిన పల్లవి.. రాజేశ్వరికి అవని నిజం చెప్తుందా..?

Intinti Ramayanam Today Episode: సూసైడ్ అటెంప్ట్ చేసిన రాజేశ్వరి.. రెచ్చిపోయిన పల్లవి.. రాజేశ్వరికి అవని నిజం చెప్తుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode April 10th: అత్తయ్య ఏంటి మా ఆవిడ మీద అరుస్తున్నారు. మావయ్య తన తప్పు తెలుసుకుని ఆ తప్పును ఇన్నాళ్ల తర్వాత బయటపెట్టిన తర్వాత ఆయనను క్షమించలేదు.. అయినా కూడా ఆయన మీ దగ్గర ఉన్నా సరే ఆస్తి రాయించుకొని ఆ తర్వాత ఆయన బయటికి పంపించేశారు. ఆ విషయం మాకు తెలియదని అనుకుంటున్నారా అని అక్షయ్ అంటాడు.. ఇన్ని ఏళ్ల తర్వాత తన మొదటి భార్య గురించి ఆయన బయట పెట్టాడు.. మీనాక్షి గాని అవనిగని తన తండ్రి చక్రధరని ఇన్ని రోజుల వరకు కూడా బయట పెట్టలేదు.. అలాంటి వాళ్ల మీద ఇలా మీ నోటికొచ్చినట్లు నిందలు వేస్తారని పార్వతి కూడా దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. మీరందరికి నేనంటే అలుసైపోయాను అని రాజేశ్వరి బాధపడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

సూసైడ్ చేసుకున్న రాజేశ్వరి..

అవని పిన్ని ఆవేశంగా ఇంటికి వెళ్ళింది అసలు ఏం చేసుకుంటుందో ఏంటో అర్థం కావడం లేదు అని బాధపడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. భానుమతి రాజేశ్వరి కోపంగా అక్కడికి వెళ్ళింది అక్కడ ఏం గొడవలు జరుగుతూ ఉంటాయో ఏం జరుగుతుంటాయో నాకు కాళ్లు చేతులు ఆడడం లేదు అని ఆలోచిస్తూ ఉండగానే.. అప్పుడే రాజేశ్వరి ఇంట్లోకి ఆవేశంగా వస్తుంది.. లోపలికి వెళ్లి తలపేసుకొని నా భర్త నాకు దూరం అవడానికి నేనే కారణమా అయితే నేను బ్రతకకూడదు అని నిద్ర మాత్రలు తీసుకొని మింగేస్తుంది. పిన్ని ఏం చేసుకుంటుందో ఒకసారి ఫోన్ చేయాలని అవని ఫోన్ చేస్తుంది కానీ అప్పటికి రాజేశ్వరి మాత్రలను మింగేస్తుంది. ఇక భానుమతి అవని ఫోన్ లిఫ్ట్ చేసి తను తలిపేసుకుందామా అర్థం కావడం లేదు లోపల ఏం చేస్తుందని చెప్పగానే అక్షయ్ తో కలిసి అవని రాజేశ్వరి ఇంటికి వస్తుంది..

చావుబ్రతుకుల్లో రాజేశ్వరి..

Advertisement

అవని అక్షయ్ ఇద్దరు కలిసి గది తలుపుని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోతారు. అప్పటికే ఆమె సూసైడ్ అటెండ్ చేయడంతో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. అసలు పిన్ని ఎందుకు ఇలా చేసింది అర్థం కావడం లేదు అని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు.. నిద్ర మాత్రలు ఎక్కువగా మింగడంతో ఆమె పరిస్థితి కాస్త విషమంగా ఉందని డాక్టర్లు చెప్పగానే కంగారు పడిపోతారు.. నిజం తెలుసుకొని హాస్పిటల్ కి వచ్చిన పల్లవి తల్లిని చూసి బాధపడడం మానేసి అవని పై రెచ్చిపోయి మాట్లాడుతుంది.. నీవల్లే మా మామ కి ఇలా జరిగింది అని అంటుంది.. కానీ అక్షయ మాత్రం మీ అమ్మకి ఇలా జరగడానికి కారణం ఎవరో తర్వాత మాట్లాడుకుందాం మీ అమ్మ ఈ పరిస్థితుల్లో ఉంది అని చెప్పడానికి మాత్రం అవనినే. తాను లేకున్నా అంటే నువ్వు ఈపాటికి స్మశానానికి వచ్చే దానివి అని అంటాడు.. మా మామ్ కి ఏమైనా జరగాలి ఆ తర్వాత మీ అందరి సంగతి చెప్తాను అని పల్లవి..

చక్రధర్ ను హాస్పిటల్ కు పంపిన మీనాక్షి.. 

రాజేశ్వరి ఇలా చేస్తుందని అసలు ఊహించలేదండి.. ఆమె పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో ఎందుకిలా చేసింది అంత ఆవేశం ఏంటి అని మీనాక్షి అంటుంది.. తనకల జరిగింది అని తెలిసి కూడా మీరు ఎందుకు ఇలానే ఉన్నారు మీరు హాస్పిటల్ కి వెళ్ళండి అని ఎంత చెప్తున్నా సరే.. రాజేశ్వరి ని చూడడానికి చక్రధర్ వెళ్లడు. మీరు వెళ్లకుండా ఉంటే తను ప్రాణాలు పోతున్న సరే మీరు పట్టించుకోవడంలేదని మీతో పాటు నన్ను కూడా అంటారు. మీరు హాస్పిటల్ కి వెళ్లి తన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసేసి రండి అని పంపిస్తుంది.. రాజేశ్వరి కోసం కాదు నువ్వు చెప్పడం వల్ల నేను హాస్పిటల్ కి వెళ్తాను మీనాక్షి అని చక్రధర్ హాస్పిటల్ కి వెళ్తాడు..

Advertisement

Also Read : రష్మిక బర్త్ డే కు తండ్రి సర్ప్రైజ్ గిఫ్ట్.. ఎన్ని కోట్లంటే..?

రాజేశ్వరికి నిజం చెప్పిన అవని..

డాక్టర్లు ఆమెకు ఏమి ప్రమాదం లేదు అని చెప్పగానే అవని సంతోషంగా ఫీల్ అవుతుంది.. అయితే రాజేశ్వరి స్పృహలోకి రాగానే అవని ఎంత చెప్తున్నా సరే తాను మాత్రం మొండిగా ప్రవర్తిస్తుంది. నన్నెందుకు కాపాడావు నేను ఈ భూమ్మీద ఉండడానికి ఇష్టపడడం లేదు నన్ను చచ్చిపో అని అంటుంది.. అయితే అవని మీరు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు. మీరు మీ కొడుకు కోసమైనా బతకాలి కదా అని అనగానే ఏంటి నాటకాలు ఆడుతున్నావా నాకున్నది కూతురు ఒక్కటే అని రాజేశ్వరి అంటుంది.. కానీ రాజేశ్వరికి భరత్ తన కొడుకు అన్న విషయాన్ని చెప్తుంది. మాట వినగానే ఎమోషనల్ అయిపోతుంది రాజేశ్వరి. చక్రధర్ అప్పుడే హాస్పిటల్ కి వస్తాడు రాజేశ్వరి పరిస్థితి ఎలా ఉంది అని అవనిని అడుగుతాడు. ఆమె పరిస్థితి బాగానే ఉంది నాన్న అయితే పిన్నికి తన కొడుకు భరత్ అని చెప్పేసాను. ఇప్పుడు ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రాజేశ్వరి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×