E-Paper
Advertisement

Intinti Ramayanam Serial Today Episode September 26th: పల్లవిని డబ్బులు కావాలని డిమాండ్ చేసిన స్వాతి.. పల్లవి నిజస్వరూపం తెలుసుకున్న అవని..

Intinti Ramayanam Serial Today Episode September 26th: పల్లవిని డబ్బులు కావాలని డిమాండ్ చేసిన స్వాతి.. పల్లవి నిజస్వరూపం తెలుసుకున్న అవని..
Advertisement

Intinti Ramayanam Serial Today Episode September 26th: నిన్నటి ఎపిసోడ్ లో కోర్టు అక్షయ్ నిర్దోషి అని శ్రీకర్ వాదిస్తాడు. స్వాతి స్పృహలో వచ్చిందని చెబుతాడు. దుబాయ్ నుంచి వచ్చాను నాకు యాక్సిడెంట్ అయ్యింది. ఈ అక్షయ్ ఎవరో తెలియదని చెప్పడంతో జడ్జిగారు కేసును కొట్టేస్తారు. అక్షయ్ గెలిచాడని బయటకు వస్తారు.. అప్పుడే మీడియా అక్కడ ఉంటారు.. అక్షయ్ గారు నిర్దోషి అని తేలింది కదా.. నిజా నిజాలు తెలియకుండా ఇలా ఆరోపణలు చెయ్యొద్దని అవని అంటుంది. ఇక అందరు ఇంటికి వెళ్లి సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పంచుకుంటారు.. శ్రీకర్ చాలా బాగా మాట్లాడాడు కేసు గెలిచాడు అని అవని పల్లవికి చెబుతుంది. ఇక అక్షయ్ నాన్న మాత్రం దానికి ఒప్పుకోడు తన బాధ్యతను చేశాడని చెప్తాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Intinti Ramayanam Serial Today Episode September 26th
Intinti Ramayanam Serial Today Episode September 26th

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి చక్రధర్ దగ్గరకు వస్తుంది. ఏంటమ్మా ఇదంతా స్వాతి ఇంత షాక్ ఇస్తుందని అనుకోలేదు అంటాడు. స్వాతి కాదు డాడీ ఇంట్లో వాళ్లే.. అవని తెలివిగా మనల్ని దెబ్బ కొట్టింది. నామీద అనుమానంతోనే ఇలా స్వాతి స్పృహలోకి వచ్చిందని అవని దాచి పెట్టింది. షార్ట్ టర్మ్ మెమొరీ అనేది కూడా అవని ప్లాన్ అని అనిపిస్తుంది డాడీ అంటుంది.. ఏదేమైనా మన పేర్లు బయటకు రాలేదు అది సంతోషంగా ఫీల్ అవ్వాలని అనుకుంటారు. మరి స్వాతి కి మెమొరీ లాస్ అవ్వడం ఏంటని అనుకుంటారు. అంతలోకే స్వాతి కాదు అంటుంది. ఇది అవని ప్లాన్ కాదు.. నేను వేసిన ప్లాన్ అని చెప్పి షాక్ ఇస్తుంది. నేను డబ్బులు ఇస్తే మీరు చెప్పినట్లు నటించాను. అలాంటిది నన్నే చంపాలని చూస్తారా? అందుకే నేనే ప్లాన్ వేసి మరి ఇలాంటి పని చేసానని చెబుతుంది.

Intinti Ramayanam Serial Today Episode September 26th
Intinti Ramayanam Serial Today Episode September 26th
Advertisement

ఇక నీకు ఏం లాభం అని పల్లవి అడుగుతుంది. నాకు డబ్బులు వస్తాయి అని స్వాతి అంటుంది. ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు స్వాతిని పల్లవి అడుగుతుంది.. ఎందుకంటే నేను మీ పేర్లు బయటకు చెప్పలేదు.. నిజం చెబితే మీకు నష్టం, అబద్దాన్ని నిజం చేస్తే అక్షయ్ జైలుకు పోతాడు నాకేంటి.. అందుకే షార్ట్ టైం మెమొరీ అని చెప్పించాను. ఇదంతా నా ప్లాన్ అని స్వాతి అంటుంది. నాకు కోటి రూపాయలు డబ్బులు ఇవ్వకుంటే నేను మీ గురించి నిజం బయట పెడతానని బెదిరిస్తుంది. దానికి పల్లవి షాక్ అవుతుంది. డబ్బులు ఇస్తానని చెబుతుంది. ఇక ఇంట్లో అంతా హడావిడి చేస్తుంటారు. అక్షయ్ బయటపడ్డందుకు ఫ్యామిలి పార్టీని ఏర్పాటు చేస్తారు. కమల్ శ్రీకర్ లు ఆరెంజ్మెంట్స్ చేస్తారు. అందరు సంతోషంగా ఉంటారు. ఇక బామ్మ పళ్ళ సెట్ కూడా వచ్చేస్తుంది. మాట్లాడుతుంది. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. అది చూసి పల్లవి కుళ్ళుకుంటుంది..

Intinti Ramayanam Serial Today Episode September 26th
Intinti Ramayanam Serial Today Episode September 26th

డ్యాన్స్ చెయ్యాలని స్పీకర్స్ ఆన్ చేస్తారు. ఫ్యామిలీ పార్టీ సాంగ్ కు డ్యాన్స్ చేస్తారు.. పల్లవిని డ్యాన్స్ చెయ్యమ ని కమల్ అడుగుతాడు. అందరు కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇక పల్లవికి ఫోన్ రావడం చూసి అందరు షాక్ అవుతారు. అవని ఎవరు చేశారు అనుకుంటుంది. ఇక పల్లవి పక్కకు వచ్చి స్వాతి తో ఫోన్ మాట్లాడుతుంది. నాకు డబ్బులు ఇవ్వని చెప్పాను ఇంకా ఇవ్వలేదు. డబ్బులు రెడీగానే ఉన్నాయి నేను ఇస్తాను.. అంటే నేను మీ ఇంటి ముందరే ఉన్నాను.. ఈ టైం లో ఫోన్ చెయ్యకూడదు నువ్వు పది నిమిషాల్లో డబ్బులిచ్చి ఇవ్వకుంటే డైరెక్ట్ గా ఇంట్లో కి వస్తాను అని అంటుంది. అవని పల్లవిని చూస్తుంది. ఎవరితో ఆంత టెన్షన్ గా మాట్లాడుతున్నావ్ అని ఆడుతుంది. డాడీతో అంటుంది. మళ్లీ డ్యాన్స్ చేద్దాం పద అంటుంది. డ్యాన్స్ చేస్తూ మెయిన్ ఆఫ్ చేసి డబ్బులను బయట వెళ్తుంది. అది గమనించి వెనకాల అవని వెళ్తుంది.. స్వాతి అంటుంది.. ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇదంతా ఇంట్లో ఉంటూనే నువ్వే చేసావా .. ఇప్పటి వరకు అనుమానం మాత్రమే ఉంది . అదే నిజమైంది .. ఇంట్లో వాళ్ళ మీద కోపం పెంచుకొని ఇదంతా చేస్తావా అని నిలదీస్తుంది.  ఇక రేపటి ఎపిసోడ్ లో పల్లవి గురించి నిజం తెలుసుకొని చెంప పగలగొడుతుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×