E-Paper
Advertisement

Intinti Ramayanam : పల్లవి, శ్రీయ సూపర్ డ్యాన్స్.. వాట్ ఏ టాలెంట్ గురు..

Intinti Ramayanam : పల్లవి, శ్రీయ సూపర్ డ్యాన్స్.. వాట్ ఏ టాలెంట్ గురు..
Advertisement

Intinti Ramayanam : ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఒక్కో రోజు ఒక్కో ట్విస్ట్ తో  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ప్రతి ఇంట్లో జరిగే కథతో ఈ సీరియల్ స్టోరీని తెరకెక్కించారు. ఇందులో పల్లవి చిన్న కోడలు పాత్రలో నటిస్తుంది.. ఈమె తన ప్రేమకు అడ్డుగా వచ్చిన కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అని పంతం పట్టిమరి ఆ ఇంట్లోకి కోడలుగా అడుగుపెడుతుంది.. రోజురోజుకీ ఆ ఇంట్లో వాళ్లకి మనశ్శాంతి లేకుండా చేస్తూ వస్తుంది.. అయితే ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ఇంటి పెద్ద కోడలైన అవని వాటినే తిప్పి కొడుతూ ఉంటుంది.. దాంతో పాటుగా పల్లవికి ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.. అయితే ఈ సీరియల్ లో హీరోయిన్ అవని కన్నా కూడా పల్లవి క్యారెక్టర్ ఎప్పటికప్పుడు హైలెట్ అవుతూనే ఉంది.. ఆ పల్లవి సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్గా ఉంటూ.. తన లేటెస్ట్ ఫోటోలను అలాగే సీరియల్ కి సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.. తాజాగా పల్లవి శ్రీయ ఇద్దరు కలిసి చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. ఆ డాన్స్ ఎలా ఉందో మీరు కూడా ఇప్పుడు ఒకసారి చూసేయండి..

తస్సాదియా పాటకు పల్లవి, శ్రీయకు డ్యాన్స్..

కన్నడ ముద్దుగుమ్మ పల్లవి అసలు పేరు యశస్విని.. ఈమె కన్నడ సీరియల్స్లలో నటించి బాగా పాపులారిటిని సంపాదించుకుంది. తెలుగులో నటించడం మొదటి సీరియల్ ఇంటింటి రామాయణం. ఈ పల్లవి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. సీరియల్లో పద్ధతిగా చీర చుడీదార్లలో కనిపించే పల్లవి రియల్ లైఫ్ లో మాత్రం ఆటం బాంబు లాగా అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంది. తాజాగా పల్లవి తన అకౌంట్ లో షేర్ చేసిన వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. పల్లవి, శ్రీయ ఇద్దరు కలిసి చాలా అందంగా రెడీ అవ్వడంతో పాటుగా సమంత నటించిన సూపర్ హిట్ మూవీ మా ఇంటి బంగారం సినిమాలోని తస్సదియ్య సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేశారు.. ఆ వీడియోని పోస్ట్ చేసి రెండు రోజులు అవుతున్న ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది.. మరి ఆ వీడియోలో వాళ్ళ డాన్స్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ఇక్కడ చూసేయండి..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: సత్యంను అవమానించిన మనోజ్.. బాలు చేతిలో దెబ్బలు.. ఆసుపత్రిలో చేరిన మనోజ్..

?igsh=cHRpYzVpb2dpcDJ5

ఇంటింటి రామాయణం సీరియల్ స్టోరీ..

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ మా సీరియల్ ఇంటింటి రామాయణం స్టోరీ జనాలకి బాగా కనెక్ట్ అయింది. ప్రతి ఇంట్లో ఉండే పంచాయతీలే ఈ సీరియల్ లో చూపించడంతో ఎక్కువమంది ఈ సీరియల్ ని చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టోరీ విషయానికొస్తే.. శ్రీయ కి అలాగే అవనికి ఇద్దరికీ పిల్లలు పుట్టడంతో వాళ్లకి ఆస్తులు చేతికొస్తాయి. కానీ పల్లవికి మాత్రం ఇంకా పిల్లలు పుట్టకపోవడంతో తనకి ఆస్తి రాదు అని టెన్షన్ పడిపోతూ బాధపడిపోతూ ఉంటుంది.. తన భర్తతో కాపురం చేసి పిల్లలు కనాలి అనుకున్న కూడా కమల్ సపోర్ట్ చేయడం లేదు అని అందరి ముందర బయటపెట్టి షాక్ ఇస్తుంది.. అంతేకాదు ఆస్తులు రావడంతో ఆ ఇంటికి వెళ్దామని అన్న కూడా పల్లవి నేను రాను అని అంటుంది. మరి పల్లవి ప్రవర్తన ఇక ముందైన మారుతుందా లేదా అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×