E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: సాగర్ ను ఇరికించిన శ్రీవల్లి.. కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Illu Illalu Pillalu Today Episode: సాగర్ ను ఇరికించిన శ్రీవల్లి.. కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు.. భాగ్యం ప్లాన్ సక్సెస్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. విశ్వం అనుకున్న ప్లాను సక్సెస్ అయిందని సంబరపడిపోతూ ఉంటాడు. అమూల్యని ఎలాగైనా సరే పెళ్ళి వరకు తీసుకొని వెళ్లి త్వరలోనే పెళ్లికి ముహూర్తం పెట్టించాలి అని అనుకుంటాడు.. మా ఇంట్లో ఏడుస్తూ ఉంటే ఆ రామరాజు కళ్ళలో కన్నీటి చుక్కలు కాకుండా రక్తపు కన్నీరు కారాలి అని అనుకుంటాడు.. సాగర్ తనకి జాబ్ రాలేదని చాలా బాధపడిపోతూ ఉంటాడు. అయ్యో నువ్వు ఎందుకు ఇంతగా బాధ పడిపోతున్నావ్ ఒక్కసారికే ఎవరు సక్సెస్ అవ్వరు. మళ్లీ నువ్వు వేరే జాబ్ కోసం వెతుకుదువు అనేసి అంటుంది. కానీ సాగర్ నేను చేతకాని వాడిని.. ఇక నాకు ఏ ఉద్యోగం రాదేమో అని బాధపడుతూ ఉంటాడు.

నర్మదా సాగర్లపై శ్రీవల్లికి ఎక్కడో అనుమానం ఉంటుంది. తన అనుమానమే నిజమైంది. సాగర్ చేత గవర్నమెంట్ ఉద్యోగం చేయించాలి అని నర్మదా అనుకుంటుంది. అనుకున్నట్లుగానే  ఉద్యోగం చేయించాలని అనుకుంటుందా? మామయ్య దగ్గర అసలు నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటుంది.. తర్వాత రోజు తాను అనుకున్న ప్లాన్ ను అమలు చేస్తుంది. సాగర్ ను అడ్డంగా ఇరికిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీవల్లి మాత్రం నర్మద, సాగర్ ను బుక్ చెయ్యాలని ప్లాన్ చేస్తుంది..అందరి కోసం పాయసం చేసి తీసుకొని వస్తుంది శ్రీవల్లి. శత్రువు ఈరోజు అడ్డంగా దొరికిపోతుంది దాన్ని నేను సెలెబ్రేట్ చేసుకోవాలి.. ఈ పాయసం అందుకే అని మనసులో అనుకుంటుంది. అందరిని సంతోషంగా పిలుస్తుంది వేదవతి ఏంటే నీకు ఆనందం వచ్చిన తట్టుకోలేము ఆవేశం వచ్చినా తట్టుకోలేము ఏం జరిగింది అని అడుగుతుంది. మీ అందరి కోసం పాయసం చేసే తీసుకొచ్చాను.. తీసుకోండి అని అంటుంది.. ఏంటమ్మా ఇవాళ స్పెషల్ ఎవరిదైనా పుట్టినరోజు గాని పెళ్లిరోజు గాని ఉందా అని రామరాజు అడుగుతాడు.. అలాంటిదేమీ లేదు మావయ్య మరి కాసేపట్లో మీకు అన్ని నిజాలు తెలుస్తాయని శ్రీవల్లి అంటుంది..

ఏంటి విశేషం అంటున్నావ్ కొంపతీసి నెల తప్పవా ఏంటి అని అడుగుతుంది.. దానికి సిగ్గుపడిన శ్రీవల్లి దానికి ఇంకా టైం ఉంది లేండి అని అంటుంది. ఇక ఏంటో అసలు విషయం చెప్పమ్మా అని రామరాజు అడుగుతాడు.. శ్రీవల్లి నర్మదా సాగర్ మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా అని అంటుంది. ఏంటి ఏం చెప్పాలి అని నర్మదా అంటుంది. సాగర్ ఎగ్జామ్ రాసారండి సెలెక్ట్ అయ్యాడు మరికొద్ది రోజుల్లో గవర్నమెంట్ ఆఫీసర్ గా చేయబోతున్నాడు అందుకే ఈ శుభవార్తను పంచుకోవడానికి పాయసం చేశాను అని అంటుంది.. ఆ మాట వినగానే రామరాజు ఫ్యూజుల్ అవుట్ అయితాయి… ఏంట్రా సాగర్ ఏంటి ఇదంతా అని అడుగుతాడు.

Advertisement

ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది.. నేను మీ మాట దాటి ఎక్కడికి పోను ఇల్లరికం అసలే పోను నాన్న కానీ నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలని ఉంది అని అంటాడు.. రామరాజు మాత్రం తన కొడుకు తన మాట వినలేదు అని బాధపడతాడు.. ఇక తర్వాత రోజు శ్రీవల్లి తన తల్లిదండ్రులను మీరు డబ్బులు అడిగారు కదా ఇదే కరెక్ట్ టైం ఇప్పుడు అడగండి మీకు ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు అని అంటుంది.. ఇక భాగ్యం శ్రీవల్లి ఆనంద్ రావు అనుకున్నట్లుగానే లోపలికి వెళ్లి రామరాజుతో మాట్లాడతారు.

భాగ్యం ఇంట్లోకి రాగానే ఏంటి అన్నయ్యగారు అయిన వాళ్లే మోసం చేసినట్లు అలా బాధపడుతున్నారు అనేసి అంటుంది. ఆ మాట వినగానే రామరాజు మొహం వాడిపోతుంది. భాగ్యం ఆనందరావు రావడం చూసి అందరూ అక్కడికి వస్తారు. మిమ్మల్ని పచ్చళ్ళ బిజినెస్ కోసం డబ్బులు అడిగితే కొందరు ఉప్పేసి మాకు డబ్బులు రాకుండా చేశారు.. మీరు ఈ వ్యాపారం కాకుండా వేరే వ్యాపారం ఏదైనా పెట్టుకోమని సలహా ఇచ్చారు కదా అందుకే మంచి సలహాతో ఇక్కడికి వచ్చాము. అది కచ్చితంగా మీకు నచ్చుతుంది అన్నగారు అని భాగ్యం అంటుంది.

ఏంటమ్మా అదేంటో చెప్పు ముందు అని అంటాడు.. ఈరోజుల్లో తల్లిదండ్రులని మోసం చేసిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. పిల్లల వల్ల చాలామంది తల్లిదండ్రులు రోడ్డున పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని మేము ఆదరించి వాళ్ళని బాగా చూసుకుంటాము. దీనికోసం ఎలాగైనా సరే ఒక పది లక్షలు ఖర్చు అవుతాయి. అని భాగ్యం అంటుంది. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వాటి గురించి ఆలోచించే డబ్బులు ఇవ్వండి మావయ్య గారు అని ఎంత చెప్పినా సరే.. నాకు వాళ్ళు చెప్పిన విధానం నచ్చింది నేను డబ్బులు ఇస్తాను అని మొండిగా ఉంటాడు రామరాజు.. చెప్పకుండా నన్నేమీ మోసం చేయలేదు వాళ్ళు కచ్చితంగా చెప్పేస్తే డబ్బులు అడిగారు అని రామరాజు అంటాడు.

Also Read: పూజ కోసం గుడికి వెళ్లిన సత్యం ఫ్యామిలీ..మనోజ్ కు షాక్.. మౌనికకు కొట్టిన సంజయ్..

ఆ డబ్బుల్ని వాళ్లు ఎలా వాడుకున్న నాకు సంబంధం లేదు అది వాళ్ళ ఇష్టం నేను ఇవ్వాలనుకున్నాను ఇస్తున్నాను అని అంటాడు. ఆ డబ్బులు తీసుకొని ఆనంద్ రావు భాగ్యం బయటకు వచ్చి సంతోష్ పడతారు. నర్మదను కావాలనే భాగ్యం పిలిచి మరీ రెచ్చగొడుతుంది. ఇవాళ మీరు డబ్బులు తీసుకున్నారు ఇదే మీకు లాస్ట్ అవకాశం అవుతుంది. వీటితో మీరు మంచి పనికి ఉపయోగించండి అని నర్మదా వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×