E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: సాగర్ కు ఘోర అవమానం.. తృటిలో తప్పించుకున్న అమూల్య.. శ్రీవల్లి ప్లాన్ గ్రాండ్ సక్సెస్..

Illu Illalu Pillalu Today Episode: సాగర్ కు ఘోర అవమానం.. తృటిలో తప్పించుకున్న అమూల్య.. శ్రీవల్లి ప్లాన్ గ్రాండ్ సక్సెస్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ, ధీరజ్ ఇద్దరు రెడీకి జాగింగ్ కోసం అని బయటకు వస్తారు.. బయట శ్రీవల్లి ముగ్గు పెడుతూ ఉంటుంది. ఫీవర్ ఏం చూసినా ఈ ఇద్దరు జంటలు దీనికి దొరికితే కచ్చితంగా నాన్నకు చెప్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటారు. ధీరజ్ ప్రేమను తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అలాగే నర్మద సాగర్ ఇద్దరు కూడా శ్రీవల్లి ఇంత పొద్దున్నే గుడికి ఎందుకు వెళ్తున్నారని కూపి లాగే ప్రయత్నం చేస్తుంది. దొరికితే మన పని అంతే అని నర్మద, సాగర్ లు టెన్షన్ పడుతూ ఉంటారు. శ్రీవల్లి మాత్రం ముత్యమంతా పసుపు అంటూ పాట పాడుతూ ముగ్గు పెడుతుంది. అప్పుడే బయట నుంచి లోపలికి వస్తున్న రామరాజు, తిరుపతి వల్లి పై ప్రశంసలు కురిపిస్తారు. బావ నువ్వు తోపు మంచి పని చేశావు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తాడు. ధీరజ్, ప్రేమలు గుడికి అని అబద్దం చెప్పి గ్రౌండ్ కు వెళ్తారు. అటు నర్మదా, సాగర్ లు తప్పించుకొని గుడికి వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. గుడికి వెళ్లి పూజ చేయించుకున్న నర్మదా సాగర్ కచ్చితంగా వీఆర్వో పోస్ట్ కి సెలెక్ట్ అవుతారని నమ్మకంతో ఉంటారు.. నర్మదా నువ్వు సెలెక్ట్ అయితే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను అని అంటుంది.. సాగర్ దేవుడి దయవల్ల నేను పాస్ అయిపోతే నాకు జరిగిన అవమానాలు అన్ని పోతాయి అని సంతోష పడుతూ ఉంటాడు.. ఆ తర్వాత నాకు నాన్న కొన్ని షాపులకి రేషన్ వెయ్యమని చెప్పారు నేను వెళ్లి ఆ బస్తాలను వేసి వస్తానని సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

Advertisement

సాగర్ ఆటోలో బియ్యం బస్తాలను తీసుకుని వచ్చి సర్కిల్ లో ఉన్న షాపులకి వేయాలని తీసుకుని వెళ్తాడు.. అక్కడ షాపులన్నిటిలో బస్తాలను వేసిన తర్వాత బయటికి వచ్చిన సాగర్ రెండు గంటల్లో రిజల్ట్స్ వస్తాయని నర్మద చెప్పింది నేను పాస్ అయ్యాను లేదో చెప్తాను అని అనింది కదా ఇంకా రాలేదేంటి అని వెయిట్ చేస్తూ ఉంటాడు.. అప్పుడే నర్మద వాళ్ల నాన్న పేపర్ పట్టుకుని అక్కడికి వస్తాడు.. నీకు ఇదే కరెక్టు.. నా కూతురు ప్రతి ఒక్క విషయంలో నువ్వు కరెక్ట్ డెసిషన్స్ తీసుకునేది. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం రాంగ్ డెసిషన్ తీసుకుంది అని ఆయన అంటాడు..

ఏమైంది మామయ్య గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని సాగర్ అయోమయంగా అడుగుతాడు.. నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టేసాననే సంతోషంలో ఉన్నావు కదా.. కానీ నువ్వు ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావు ఇదిగో నీ రిజల్ట్ అని అంటాడు.. వాళ్ల నాన్న సాగర్ ని ఘోరంగా అవమానిస్తూ మాట్లాడటం విన్న నర్మదా బాధపడుతుంది.. నర్మదను చూసిన వాళ్ళ నాన్న అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు.. నువ్వేం బాధపడకు సాగర్ అని నర్మదా అంటుంది..

Advertisement

ఇక వేదవతి వంటగదిలో ఏదో ఆలోచిస్తూ కనిపిస్తుంది.. అది గమనించిన ప్రేమ అత్తయ్య పాలు పొంగిపోతున్నాయి కనీసం చూడవా ఏంటి అని అంటుంది.. అయితే ప్రేమ పొద్దున మీ అన్నయ్య విశ్వం బండిమీద పోవడం నేను చూశాను అని అంటుంది.. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య మా అన్నయ్య బండిమీద ప్రేమ వెళ్లడమేంటి నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో అనేసి అంటుంది. నా ప్రేమ వేసుకున్న డ్రస్సు నాకు బాగా గుర్తుంది మీ అన్నయ్య బండి మీద వేసుకున్న ఆ అమ్మాయి డ్రెస్ కూడా అదే అని అనుమాన పడుతుంది వేదవతి..

ప్రేమ అమూల్య కాలేజ్ నుంచి వచ్చే టైం అయింది కదా ఇప్పుడు కనుక్కుందాంలే అని అంటుంది.. వీళ్ళ మాటలు విన్న శ్రీవల్లి అయ్య బాబోయ్ అమూల్య ఇంత పని చేసిందా వీళ్ళ ప్రేమ మధ్యలోనే తెగిపోయేలా ఉంది అని టెన్షన్ పడుతూ అమూల్య రావడం చూసిన శ్రీవల్లి పక్క దారిన వెళ్లి చున్ని ఇస్తుంది. జరిగిన విషయాన్ని అమూల్యకు చెప్తుంది. అమూల్య ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇంకేమీ లేదు నన్ను చంపేస్తారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది.. కానీ శ్రీవల్లి మాత్రం ధైర్యం చెప్పి అమూల్యను లోపలికి పంపిస్తుంది..

Also Read : వివాదంలో శివజ్యోతి.. తిరుపతి ప్రసాదంపై కామెంట్స్.. హిందూ సంఘాలు ఫైర్..

ఇంట్లోకి రాగానే అమూల్యను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేదవతి విసిగిస్తుంది.. ప్రేమ కూడా నువ్వు మా అన్నయ్య బండి మీద వెళ్ళావా లేదా అని అడుగుతుంది.. ఏంటమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు నాలాంటి డ్రెస్సులు ఇంకెవరు కొనరా ఏంటి అని అమూల్య అంటుంది. అప్పుడే శ్రీవల్లి ఎంట్రీ ఇచ్చి నాలాంటి చీర కూడా ఒక ఆవిడ వేసుకొని వెళితే నా చీర అనుకున్నాను అని అంటుంది.. ఏం మాట్లాడుతున్నారు మీరు నువ్వు వెళ్లి చదువుకో అమ్మా అమూల్య అనేసి లోపలికి పంపించేస్తుంది శ్రీవల్లి.. అమూల్య శ్రీవల్లికి అసలు నిజాన్ని చెప్పేస్తుంది.. సాగర్ బాధపడటం చూసిన నర్మదా తన దగ్గరికి వెళ్లి నువ్వేం బాధపడకు ఇది కాకపోతే ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు రాసుకోవచ్చులే అనేసి అంటుంది.. మాటలు విన్నా శ్రీవల్లి ఎలాగైనా సరే ఈ విషయాన్ని మావయ్య గారితో చెప్పాలి అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×