// // Illu Illalu Pillalu Today Episode: తండ్రి మాటకు కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. శ్రీవల్లి మరో ప్లాన్..కడుపుబ్బా నవ్వించే సీన్.. -->
E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: తండ్రి మాటకు కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. శ్రీవల్లి మరో ప్లాన్..కడుపుబ్బా నవ్వించే సీన్..

Illu Illalu Pillalu Today Episode: తండ్రి మాటకు కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. శ్రీవల్లి మరో ప్లాన్..కడుపుబ్బా నవ్వించే సీన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రామరాజు ఆ విషయాన్ని ధీరజ్ని అడగాలని అనుకుంటాడు.. నీ భార్యని పోలీస్ చేయాలనే అనుకుంటున్నావా నాకెందుకు చెప్పలేదు ఇంటి పెద్దని నేనొక్కడినే బతికే ఉన్నాను కదా నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుని అంత పెద్ద వాడివి ఐపోయావని రామరాజు ధీరజ్ని అరుస్తాడు. ఇంకా ప్రేమ చదువు అయిపోలేదు కదా నాన్న..అయిపోయిన తర్వాత చెబుదామని అనుకున్నాను. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి నాన్న అని ధీరజ్ అంటాడు. నర్మద కూడా ధీరజ్ కి సపోర్ట్ అవడంతో రామరాజు ఏం మాట్లాడాడు. తన భార్య జాబ్ చేయాలని అనుకోవడంలో తప్పులేదు కదా మామయ్య గారు అని నర్మదా అంటుంది. నర్మద కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా శ్రీవళ్ళీ మాట విన్న రామరాజు జాబ్ చెయ్యడానికి వీలు లేదు అని కండిషన పెడతాడు.. శ్రీవల్లి హ్యాపీగా ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రాత్రి రామరాజు కుటుంబం ఎంతో సంతోషంగా పాటలు పాడుతూ సరదాగా ఉంటారు. వాళ్ళని చూసిన సేన భద్ర ఇద్దరు కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు.. చెల్లెల్ని ఆ పనోడు లేపుకుపోయినప్పటి నుంచి మన ఇంట్లో సంతోషాలు దూరం అయిపోయాయి త్వరలోనే ఆ సంతోషాల్ని దూరం చేద్దాం అని భద్ర అంటుంది.. సేన మాత్రం ప్రేమను పిలుస్తాడు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు అడ్డం తిరిగావు మీ అమ్మ ప్రాణానికే ప్రమాదం అయితే ఆపరేషన్ చేయించి నిన్ను బయటకు తీయించాం. అప్పటినుంచి ఏడాది పాటు కంటికి రెప్పలా కాపాడుకుందాం. అలాంటి నువ్వు తల్లిదండ్రులను ఎదిరిస్తావని అస్సలు ఊహించలేదు అంటూ.. సేన ఎమోషనల్ అవుతాడు. కూతురు కోసం కన్నీళ్లు పెట్టుకుంటాడు. తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ సీను ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది. ఆ మాట విన్న ప్రేమ బాధపడుతుంది. ప్రేమ బాధపడుతుంది..

Advertisement

ప్రేమ బాధపడటం చూసిన శ్రీవల్లి ఇది కదా నాకు కావాల్సింది అని సంతోషపడుతుంది. అలాగే రోజు ఇలా ప్రేమ నర్మద ఇద్దరు బాధపడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందని మనసులో అనుకుంటుంది. ఇక ప్రేమని ఎలాగైనా నవ్వించాలని ధీరజ్ తో పాటుగా శ్రీవల్లి ప్లాన్ చేస్తుంది. ఇంట్లోని వాళ్లందర్నీ ఒకచోటికి తీసుకొచ్చి ప్రేమను నవ్వించడానికి ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేస్తుంది శ్రీవల్లి. శ్రీవల్లి ఎంతగా ప్లాన్ చేసిన సరే ప్రేమ మాత్రం కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అందరూ తమ తమ డాన్స్ పర్ఫామెన్స్ లతో ప్రేమను నవ్వించాలని అనుకుంటారు.

ఒక్కొక్కరు ఒక్కో పాట నేర్చుకుని ప్రేమ దగ్గరికి వచ్చి పెర్ఫార్మెన్స్ చేస్తారు కానీ ప్రేమ మాత్రం బాధపడుతూనే ఉంటుంది. ఎవరికి శ్రీవల్లి ఇదేమిటమ్మ మాయ అనే పాటకి డాన్స్ వేస్తుంది. కానీ ప్రేమ నవ్వదు. మదను మా వల్ల కాదమ్మ తల్లి నువ్వే వెళ్లి నీ ముద్దుల చెల్లిని నవ్వించు అని అంటుంది.. అందరూ నర్మదని నవ్వించమని అడిగితే నర్మద వెళ్లి ప్రేమకు చెవిలో ఒక విషయం చెప్తుంది. ఆ మాటతో ప్రేమ నవ్వుతుంది. అసలు ఏం చెప్పింది ఎందుకు నవ్వుతుంది అని ఇంట్లోని వాళ్ళందరూ తెలుసుకోవాలని అనుకుంటారు.. అయితే ప్రేమ ఏమో అంతగా నవ్వడానికి నర్మద ఏం చెప్పిందో తెలుసుకోవాలని అందరూ అనుకుంటారు. ముందుగా వేదవతికి నర్మదా విషయాన్ని చెప్తుంది..

Advertisement

ఆ మాట వినగానే శ్రీవల్లి ఏంటబ్బా అత్తయ్య కూడా నవ్వుతుంది ఏ విషయం చెప్పిందని ఆలోచిస్తూ ఉంటుంది. అమూల్య శ్రీవల్లి అందరూ ఈ విషయాన్ని తెలుసుకొని నవ్వుతారు. మరి ఇంతగా ఎందుకు నవ్వుతున్నారని తిరుపతి అమూల్యని అడుగుతాడు అమూల్య చెప్పిన విషయాన్ని విని ఒక్కసారిగా తిరుపతి కూడా నవ్వేస్తాడు. ఇక ముగ్గురు అన్నదమ్ములు ఏమైంది చెప్పండి అని అనగానే.. ఇందాక మీరు డాన్స్ చేస్తున్నప్పుడు మీ ప్యాంట్ జారిపోయాయి అంటా అని తిరుపతి అనగానే వాళ్ళు అరే పరుగు అంతా పోయిందిరా అని మొహం చాటేసుకుంటారు..

ఇక ఉదయం లేవగానే నర్మదా రెడీ అవుతూ ఉంటుంది. ఎంతగా లేటునా సరే సాగర్ మాత్రం నిద్రలేవడు.. టైం అవుతుంది లేవు అని చెప్తున్నాను కదా లేవు అని నర్మదా ఎంతగా లేపుతున్న సాగర్ మాత్రం లేవడు.. ఇక నిద్రపోతున్న నన్ను డిస్టర్బ్ చేస్తావ్ ఏంటి పడుకొని ఇవ్వు అని నర్మదపై సీరియస్ అవుతాడు సాగర్.. మొత్తానికి ఇవాళ నువ్వు రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ రాబోతున్నాయి మనం వెళ్లి గుడిలో పూజ చేయించుకోవాలి అని నర్మదా సాగర్ నీ రెడీ చేస్తుంది. ధీరజ్ ప్రేమని ఎలాగైనా సరే పోలీస్ ఆఫీసర్ని చేయాలి అని పొద్దున్నే వాకింగ్ జాగింగ్ చేయాలి అని లేపుతాడు.

Also Read : అవనికి అక్షయ్ గిఫ్ట్.. చక్రధర్ పై రాజేంద్ర ప్రసాద్ సీరియస్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

నిన్ను పోలీస్ ఆఫీసర్ ని చేయాలన్నది నా బాధ్యత.. ఇలా పడుకుంటే పోలీస్ ఆఫీసర్ ఎలా అవుతావు అని ధీరజ్ అంటాడు.. ఆ మాట వినగానే ప్రేమ ప్రతిసారి బాధ్యత బాధ్యత అని నా తలకాయ తినకు.. ఒక్కడికే బాధ్యత ఉన్నట్టే మాట్లాడుతున్నావే అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×