E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ ఫెయిల్.. అదిరిపోయే ఫిట్టింగ్ పెట్టిన నర్మద.. రామారాజుకు మైండ్ బ్లాక్..?

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ ఫెయిల్.. అదిరిపోయే ఫిట్టింగ్ పెట్టిన నర్మద.. రామారాజుకు మైండ్ బ్లాక్..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. సేనాపతిని పోలీసులు అరెస్ట్ చేశారని భద్ర, విశ్వం లాయర్ ను కలుస్తారు.. ఎలాగైనా లాయర్ బయటకు తీసుకొస్తానని చెప్తాడు. భద్రావతి మాత్రం రామరాజు కుటుంబం పై కక్ష తీర్చుకోవాల్సిందే అని అంటుంది.. అమూల్య నాకు పడిపోతుంది నా ట్రాప్ లో పడే రోజులు దగ్గరకొచ్చాయి. దాన్ని అడ్డుపెట్టుకొని నేను ఏదో ఒకటి చేసి మన కుటుంబాల్లో మళ్ళీ సంతోషాన్ని నింపుతాను అని విశ్వం భద్రకు మాట ఇస్తాడు.. శ్రీవల్లి మాత్రం నిద్రపోతూ కలగంటుంది. ప్రేమ తన కుటుంబంతో శ్రీవల్లి కలిసిందని తెలిస్తే ఖచ్చితంగా మెడ మీద కత్తి పెట్టి గొంతు కోసేస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నేను అసలు ఊహించలేదు అని నరికేస్తుంది.. ప్రేమ వచ్చినట్లు కలగన్న శ్రీవల్లి వెంటనే ఉలిక్కిపడి లేచి టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఏంటి నాకిలాంటి కలొచ్చింది అని బాధపడుతూ ఉంటుంది.. అప్పుడే ప్రేమ గొంతు బయటి నుంచి వినిపిస్తుంది.. నిజంగానే ప్రేమ నన్ను చంపడానికి వచ్చిందేమో అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. భాగ్యం ఆనందరావు శ్రీవల్లి దగ్గరికి వస్తారు. ఏంటి నిన్ననే వెళ్లారు కదా మళ్ళీ ఇప్పుడు తగలడారు ఏంటి అని శ్రీవల్లి అడుగుతుంది. రామరాజు అన్నయ్య గారి దగ్గర ఓ ఎలాగైనా ఒప్పించి పాతిక లక్షలు తీసుకోవాలని ప్లాన్ తో వచ్చాము అని అంటారు. ముందు వేదవతి వదినను అడిగి ఒప్పిద్దాం అని అంటారు. వేదవతి దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పగానే నర్మదా మీకేం కావాలో చెప్పండి అని అంటుంది. అదేం లేదు వదిన గారు మేము పచ్చళ్ళ బిజినెస్ ని పెట్టాలనుకుంటున్నాము.. మీరు అన్నయ్య గారికి చెప్పి ఒక పాతిక లక్షలు ఇప్పిస్తే మేము ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తాము.

అవునా అలాగే అలాగే చెప్తాను అని వేదవతి అంటుంది. అయితే నర్మదా పచ్చళ్ళ మీద అవగాహన ఎంతుందో తెలుసుకున్న తర్వాతే కదా ఎవరైనా బిజినెస్ చేస్తారు. వీళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి. పచ్చళ్ళ రుచి మావయ్య గారికి చూపించి ఆ తర్వాత వీళ్ళకి డబ్బులు ఇప్పిద్దామని అడుగుదాం అని నర్మదా అంటుంది. అవును వదినగారు మీరు ముందు పచ్చళ్లని పెట్టండి ఆయనకు చూపించి ఆ తర్వాత మనం దీని గురించి మాట్లాడదామని వేదవతి అంటుంది.. ఇక భాగ్యం ఆనందరావు ఇద్దరు పచ్చళ్ళు పెట్టడంలో నిమగ్నం అయిపోతారు.

Advertisement

ఆనందరావు చాలా సంతోషంగా పాటలు పాడుతూ పచ్చల కోసం ఆవకాయ ముక్కలని కొడుతూ ఉంటాడు. ఆ కాయలను కొట్టండి ఆ తర్వాత పాటలు పాడుతారు చాలా కాయలు ఉన్నాయని భాగ్యం అంటుంది.. శ్రీవల్లి, భాగ్యం, ఆనందారావు ముగ్గురు కూడా కష్టపడి పచ్చడిని పెడతారు.. భాగ్యం రుచి చూడబోతుంటే ఆనందరావు అడ్డుపడతాడు. ఇక శ్రీవల్లి మీకు వచ్చే పాతిక లక్షల్లో నాకు ఒక పది ఇవ్వండమ్మా అని అడుగుతుంది. అలాగే లేవే నీకు ఇవ్వకుండా ఉంటామని భాగ్యం అంటుంది..

అయినా నీకు ఇప్పుడు 10 లక్షలు ఎందుకే అమ్మడు అని భాగ్యం అడుగుతుంది.. ఆ బండ సచ్చినోడు మోహన కొట్టేసి అమూల్యను కలిపే ప్రయత్నాలు మానుకోమని చెప్తాను. రోజు వాడి టార్చర్ భరించలేకుండానే బాబు అని అంటుంది. సరేలే వే నీకోసం ఆ మాత్రం చేయలేనా అని భాగ్యం అడుగుతుంది.. ఇకపోతే రామరాజు బుజ్జమ్మ అన్నం పెట్టు అని అడుగుతాడు. ఆ మాట వినగానే భాగ్యం అన్నయ్యగారు వచ్చారు పాతిక లక్షల 30 లక్షల కొట్టేయాలి 10 తీసుకుని వెళ్దామని అక్కడికి వెళ్తారు. ఆగండి అన్నయ్యగారు మీరు ఈరోజు ఆవకాయతోనే ఈ అన్నం తినాలి అని భాగ్యం అడుగుతుంది..

ఆవకాయతో అన్నం తినడమేంటి అమ్మ అని రామరాజు అంటాడు.. ఏం లేదు అన్నయ్య గారు.. మీరు ముందు పచ్చడి తినండి అని అంటారు.. వదిన గారు మీరు చెప్పండి అని భాగ్యం అంటుంది. ఏం లేదండి వదిన గారు అన్నయ్యగారు పచ్చళ్ళ బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నారు. దానికోసమే మీ దగ్గరికి వచ్చారు అని అంటుంది.. అసలు విషయం చెప్పండి అని ఆనంద రావు అంటాడు.. బిజినెస్ పెట్టడానికి మీ దగ్గర డబ్బులు అడగడానికి వచ్చారండి అని వేదవతి అంటుంది. ఆ పచ్చల రుచి చూసి ఆ తర్వాత డబ్బులు ఇప్పిద్దామని నర్మదా అంటుంది. భాగ్యం రామరాజుకి పచ్చడిని వడ్డిస్తుంది.

Also Read : పల్లవికి అడ్డంగా దొరికిన చక్రధర్.. రాజేశ్వరికి అనుమానం.. పల్లవి నెక్స్ట్ ప్లానేంటి..?

పచ్చడి రుచి చూడగానే.. రామరాజు షాక్ అయిపోతాడు.. ఏంటి అంత బాగుందా బావ అని తిరుపతి కూడా ఒక ముద్ద పెట్టమని అడుగుతాడు. ఆ తర్వాత సాగర్ కూడా అడుగుతాడు. ఏంటి అంత టేస్టుగా ఉందా.. నాకు కూడా పెట్టండి అని చందు అని అడుగుతాడు. నోట్లో వేసుకోగానే షాక్ అయిపోతారు. నోట్లో పెట్టుకున్న తర్వాత మాట మాట్లాడకుండా ఫ్రీజ్ అయిపోతారు. ఒక్క క్షణం తర్వాత అందరూ ఒకేసారి లేచి వాంతి చేసుకుంటారు. ఏంటి అన్నయ్య గారు ఎలా ఉంది అని భాగ్యం అడుగుతుంది. ఉప్పు కసిం అమ్మ. ఈ పచ్చడి బిజినెస్ మీకు సెట్ అవ్వదు కానీ వేరే బిజినెస్ ఏదైనా చూసుకోండి అని అంటాడు. ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా మోసం చేసి డబ్బులు సంపాదించాలని అనుకోకూడదు. కష్టపడి పని చేయండి మీకు అండగా మేముంటాము అని వార్నింగ్ ఇచ్చి వెళ్తారు.. ప్రేమ బస్ స్టాప్ లో ఎదురుచూస్తూ ఉండగా ధీరజ్ వస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×