E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: డాక్టర్ కాళ్ళు పట్టుకున్న వల్లి.. భాగ్యం ఫ్యూజుల్ అవుట్.. భద్రకు దొరికిన ప్రేమ..

Illu Illalu Pillalu Today Episodes: డాక్టర్ కాళ్ళు పట్టుకున్న వల్లి.. భాగ్యం ఫ్యూజుల్ అవుట్.. భద్రకు దొరికిన ప్రేమ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 7th: హాస్పిటల్ లోపలికి వెళ్లిన శ్రీవల్లి తెగ హడావిడి చేస్తుంది. డాక్టర్ గారండి ఆరోజు నేను కళ్ళు తిరిగి పడిపోతే మీరు నేను ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా.. కానీ నా చెల్లెలు ఇద్దరు ఆ విషయం గురించి చెప్తే నమ్మడం లేదు. మీరు స్కానింగ్ చేసి వీళ్ళకి బిడ్డ ఏ పొజిషన్లో ఉందో చెప్పండి అని వల్లి అనగానే డాక్టర్ ఎక్కడ దొరికిపోతుంది అని కంగారు పడిపోతుంది. మీరు బయటికి వెళ్ళండి అమ్మ నేను స్కానింగ్ చేయాలి అని డాక్టర్ వల్లి తో అంటుంది. వాళ్ళిద్దరూ అలా బయటకు వెళ్ళగానే డాక్టర్ వల్లి చెంప పగలగొడుతుంది. నీకు కాపురం నిలబెట్టమని మీ అమ్మ నాకు కాళ్లు పట్టుకుంటే లేని కడుపుని ఉందని అబద్ధం చెప్పాను. నువ్వు అసలు ప్రెగ్నెంట్ కాదు అని డాక్టర్ గుండెలు బద్దలు కొట్టే నిజాన్ని బయటపెడుతుంది. ఆ మాట వినగానే వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదంతా మీ అమ్మ ఆడిన నాటకమే నువ్వు ప్రెగ్నెంట్ కాదు అని చెప్పగానే వల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

డాక్టర్ కాళ్ళు పట్టుకున్న శ్రీవల్లి..

నేను కడుపుతో ఉన్నానని చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఇది నిజం కాదని బయటికి తెలిస్తే నా పరిస్థితి ఏంటి రా దేవుడా? నా కాపురం కూలిపోతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ విషయాన్ని మీరు బయటకు చెప్పనివ్వకుండా ఏదో ఒకటి చేయండి. నా కాపురం నిలబెట్టండి డాక్టర్ గారు అంటూ వల్లి డాక్టర్ కాళ్లు పట్టుకుంటుంది.. వింతగా బతిమిలాడుతున్నావ్ కాబట్టి నీకు చివరి అవకాశం ఇస్తున్నాను.. నీకోసం ఇదే నేను చేసే లాస్ట్ హెల్ప్ నువ్వు గాని మీ అమ్మగాని మళ్ళీ ఇక్కడికి రావద్దు అని డాక్టర్ వల్లికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. వేరే వాళ్ళ రిపోర్టును తీసుకెళ్లి మళ్ళీ చేతిలో పెడుతుంది.. అది తీసుకొని నర్మదా ప్రేమలకు ఇస్తుంది వల్లి.. వాళ్ళ రిపోర్టింగ్ చూసి మళ్లీ నిజంగానే ప్రెగ్నెంట్ అని చాలా సంతోష పడిపోతూ ఉంటారు.

భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Advertisement

నువ్వు తల్లివి కాబోతున్నావంటే అందరికన్నా ముందు సంతోషించింది మేమే అక్క అలాంటిది.. నువ్వు మా అమ్మల్ని అనుమానిస్తున్నావు అని నర్మదా ప్రేమలిద్దరూ కూడా బాధపడతారు.. సరే ఇంక ఇంటికి వెళ్దాం పద అని వాళ్ళ అన్నగాని లేదు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తాను మీరు వెళ్ళండి అని శ్రీవల్లి అంటుంది. ఇక శ్రీవల్లి భాగ్యం దగ్గరికి వెళ్ళగానే ఆనందరావు భాగ్యం ఇద్దరు సరసాలు ఆడుతూ కనిపిస్తారు. ఏం తమ్ముడు చెప్పా పెట్టకుండా వచ్చిన తుఫాన్ లాగా అలా వచ్చావు అని భాగ్యం అడుగుతుంది. నేను తల్లిని కాబోతున్నాను కదా నాకు ఇప్పుడు ఎన్నో నెల అని శ్రీవల్లి అడగగానే భాగ్యం కంగారుపడుతుంది. మూడో నెల అని చెప్పగానే భాగ్యం చెంప పగలగొడుతుంది శ్రీవల్లి.. కన్న కూతురితో కూడా నువ్వు అబద్ధం చెప్పావు అంటే నేను నమ్మలేకున్నా.. నీ కాపురం నిలబెట్టడానికే నేను అలా అబద్ధం చెప్పాను దాన్ని నిజం చేయాల్సిన బాధ్యత నీదే అని భాగ్యం ఎంత చెప్తున్నా సరే శ్రీవల్లి మాత్రం వినకుండా భాగ్యం ను కర్రతో కొడుతుంది.

తల్లి మాట విన్న శ్రీవల్లి..

నువ్వు తల్లివి కాలేదు అని నీకు నాకు మాత్రమే తెలుసు. ఇంక ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు. నీ ఎలాగోలాగా ఆకట్టుకుని నువ్వు తల్లిని అయ్యేలా చేసుకోవలసిన బాధ్యత నీదే. ఒక నెల అటు ఇటు జరుగుతుందేమో కానీ.. నీకు పిల్లలు పుడతారు కదా అప్పుడు ఈ సమస్య పూర్తిగా దూరమవుతుంది.. నీ చేతుల్లోనే ఉంది అని భాగ్యం అంటుంది. మీ ఆయనని ఆకట్టుకొని నీకు దగ్గరయ్యాలా చేసుకో.. నెల తిరగకుండానే నువ్వు నెల తప్పుతావు అని భాగ్యం చెప్పగానే శ్రీవల్లి తన తల్లి మాటని వినేటట్టు కనిపిస్తుంది. ఇక శ్రీవల్లి తల్లి కావడానికి ప్రయత్నాలు చేస్తుంది.

అడ్డంగా దొరికిపోయిన ప్రేమ..

Advertisement

ప్రేమ బ్యాంకు కి వెళ్లి నిన్న మీకు నగలు ఇచ్చాను కదా నాకు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వమని మీరు నాకు డబ్బులు తొందరగా ఇస్తే నేను వెళ్ళిపోతాను అని ప్రేమ అంటుంది. ప్రేమ ఆ మాట అనగానే బ్యాంకు మేనేజరు భద్ర గారు వస్తానన్నారు ఇంకా రాలేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. సరే అమ్మ మీకు ఎంత డబ్బులు కావాలి అని మేనేజర్ అడుగుతాడు. నాకు రెండు లక్షలు కావాలి అని ప్రేమ అంటుంది. మేనేజ్రు తన స్టాఫ్ తో చెప్పి ప్రాసెస్ చేస్తుంటాడు అప్పుడే భద్రవతి 2 లక్షలు సరిపోతాయా ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతుంది. అత్త నేను చెప్పేది వినండి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని ప్రేమ ఎంత చెబుతున్న సరే భద్ర మాత్రం ఇది ఎవరి ప్లాను మాకు తెలుసు పద వెళ్దాం అని బలవంతంగా ప్రేమని తీసుకొని బయటికి వస్తారు. కార్లో ఎక్కించుకొని ప్రేమను ఎక్కడికో తీసుకొని వెళ్తారు.

కామెడీ అంటే ఇదే..

సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి నర్మద తీసుకొచ్చిన రిపోర్ట్స్ రామరాజు చాలా డెప్త్ గా చూస్తూ ఉంటాడు. తిరుపతి ఎంబిబిఎస్ చదివిన డాక్టర్లు కూడా మీ అంతగా రిపోర్టులను చూడరు. అని వెటకారంగా మాట్లాడతాడు. అదే ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. మీకేం తెలియదు టిఫన్ అని వేదవతి కూడా రిపోర్ట్ ని అలాగే చూడడంతో అక్క డాక్టర్ కన్న ఎక్కువగా చూస్తున్నావే అని తిరుపతి సెటైర్లు వేస్తాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన వల్లి వాళ్ళని చూసి షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :‘ బ్రహ్మముడి ‘ నుంచి కావ్య అవుట్..ఇదొక్కటే కారణమా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×