E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం ప్రేమ వెయిటింగ్.. డ్రగ్స్ కేసులో ధీరజ్ ఇరుక్కుంటాడా? శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం ప్రేమ వెయిటింగ్.. డ్రగ్స్ కేసులో ధీరజ్ ఇరుక్కుంటాడా? శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 27th: ఇంట్లో జరుగుతున్న వాటి గురించి తలుచుకునే వల్లి చాలా సంతోషంగా ఉంటుంది కుప్పిగతులు వేస్తుంది.. అది చూసిన ప్రేమ నర్మదా ఇద్దరు కూడా కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా ఎగురుతారా నేను చూస్తుంటే నువ్వు నిజంగానే కడుపుతో ఉన్నవా లేదా అని డౌట్ మాకు కలుగుతుంది అని అంటారు. నేను నిజంగానే కడుపుతో ఉన్నానని మీకెందుకు తెలియదు అని వల్లి ఎంత చెప్తున్నా సరే నర్మదా ప్రేమలు మాత్రం మనం హాస్పిటల్ వెళ్లి చెక్ చేయించాలి అని అడుగుతారు. హాస్పిటల్ కి వెళ్తే కడుపు సంగతి బయట పడిపోతుంది అని రామరాజును చూసిన వల్లి కళ్ళు తిరిగి పడిపోయినట్లు నాటకం ఆడుతుంది. అయితే రామరాజు నర్మదకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.

దీరజ్ కోసం ఆరాటపడుతున్న ప్రేమ..

ధీరజ్ కారు డ్రైవింగ్ కోసం అని బయటికి వెళ్లిపోయి ఉంటాడు.. ప్రేమ తనకోసం ఆలోచిస్తూ చాలా వెలితిగా ఉంది అంటూ బాధ పడిపోతూ ఉంటుంది. ఏంటో రా ధీరజ్ నువ్వు ఇందాకే వెళ్లినా కూడా నాకు ఏదో సంవత్సరాల క్రితం వెళ్లిపోయినట్లు దిగులుగా ఉందిరా అని ఆలోచిస్తూ తన భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.. నీతో మాట్లాడాలని నిన్ను చూడాలని అనిపిస్తుంది ఏంట్రా ధీరజ్ నాకి బాధ అనే తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఫోన్ చేస్తే తను డ్రైవింగ్ లో ఉన్నాను అని చెప్తాడు. అయినా కూడా ప్రేమ వదలకుండా తనకి ఫోన్ చేస్తూ తనతో మాట్లాడి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది..

ధీరజ్ కు షాకిచ్చిన ప్రేమ..

Advertisement

ధీరజ్ ఎక్కడున్నాడు అనే కనుక్కొని ప్రేమ తన కోసం ఫుడ్ ఆర్డర్ పెడుతుంది.. ఒకటి కాదు రెండు కాదు రోజులో తను సంపాదించిన కన్నా ఫుడ్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాను అని బాధ పడిపోతూ ఉంటాడు. కార్లో ఎక్కడి వాళ్ళు మీ ఆవిడకు మీరంటే చాలా ఇష్టం అనుకుంటాను ఇన్నిసార్లు ఫోన్ చేస్తూ మీరు భోజనం చేశారా లేదా అని మీకోసం ఆర్డర్లు పెడుతుంది అని అడుగుతారు.. అది ప్రేమ కాదండి అతి ప్రేమ.. నేను సంపాదించిన దాని కంటే ఫుడ్ ఆర్డర్లకే ఎక్కువ అయింది అని ఉంటాడు ధీరజ్.. దీని ప్రేమను తట్టుకోలేకపోతున్నాను ఇలా అయితే నేను కారు నడిపినట్టే అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు..

ధీరజ్ కు షాకివ్వబోతున్న భద్ర..

భద్ర కారు కోసం లోన్ ఇచ్చిన వ్యక్తిని రమ్మని సేనతో చెప్తుంది. ఆ వ్యక్తి భద్ర వాళ్ళ ఇంటికి వచ్చి మీకు శత్రువు అని తెలియక ఆ ధీరజ్ కి కారు కొనడానికి లోన్ ఇచ్చాను అని అంటాడు.. నన్ను క్షమించండి మేడం నాకు ఈ విషయం తెలిస్తే అసలు లోన్ ఇచ్చే వాడిని కాదు అని అతను అంటాడు. నువ్వు లోనివ్వడం మంచి పని అయింది రా కానీ ఇప్పుడు ఇమీడియట్ గా కార్ని వెనక్కి తీసుకోవాలంటే ఏం చేయాలి అని భద్ర అడుగుతుంది.. ఆ కార్ని వెంటనే వెనక్కి తీసుకోవడం కుదరదు మేడం.. అయితే ఆ కారులో డ్రగ్స్ కానీ ఇంకా ఏదైనా కానీ దొరికితే మాత్రం కారుని సీజ్ చేస్తారు. అప్పుడు నా డబ్బులు పోతాయి అని అతను అంటాడు.. కానీ నీ డబ్బులుకి డబల్ నేను ఇస్తాను ఏదో ఒకటి చేసే ఇరికించాలి అని సేనా కూడా అతనితో అంటాడు.. ఇక భద్ర, సేనా ఇద్దరూ కలిసి ధీరజ్ కారులో డ్రగ్స్ పెట్టే ప్లాన్ చేస్తారు..

ధీరజ్, ప్రేమ రొమాన్స్..

Advertisement

ఈరోజు సాయంత్రం అయింది కదా ఇంకా స్నాక్స్ తిన్నాడో లేదో.. వాడికి ఆకలేస్తుందేమో.. వాడికి ఫోన్ చేసి స్నాక్స్ ఏమైనా ఆర్డర్ పెట్టాలి అని ధీరజ్ కు ఫోన్ చేస్తుంది.. అయితే డిరాజు వెనకాలే ఉండడం గమనించని ప్రేమ ఎక్కడున్నావు బాబు నీకోసం నేను స్నాక్స్ ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను కాస్త లొకేషన్ చెప్పమ్మా అని అడుగుతుంది. ఏంటే నువ్వు పెట్టేది ఇప్పటికే ఆడోళ్ళు ఎక్కువయ్యి డబ్బులు ఉన్నదని మొత్తం అయిపోయాయి అని ధీరజ్ అంటాడు.. ఇంట్లో ఖాళీగా కూర్చోలేక ఇలా ఆర్డర్లు పెడుతున్నావా ఏంటి అని ధీరజ్ ప్రేమ పై సీరియస్ అవుతాడు.. కానీ ప్రేమ మాత్రం ఎక్కడున్నావో చెప్పమ్మా అని అడుగుతుంది. ధీరజ్ నీ తలకాయ వెనకాల ఉన్నాను ఒకసారి వెనక్కి చూడు అని అంటాడు. వచ్చేసావా ఎప్పుడొచ్చావ్ రా అని ప్రేమ అడుగుతుంది.. నేను వచ్చేసానులే గాని నీ ఆడలేంటే ఇంట్లో ఖాళీగా కూర్చోలేక చేస్తున్నావా ఏంటి అని ధీరజ్ అడుగుతాడు.. వీళ్ళిద్దరి మధ్య కాస్త గొడవ ఆ తర్వాత ఇంకాస్త రొమాన్స్ మొదలవడంతో ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.

శ్రీవల్లికి దిమ్మతిరిగేలా ప్రేమ కౌంటర్..

అందరూ రాత్రి భోజనానికి కూర్చోవడంతో ప్రేమ కూడా అక్కడ భోజనం తినడానికి అని కూర్చుంటుంది.. అయితే నేనంటే కడుపుతో ఉన్నాను కడుపులో ఆకలిస్తే పిల్లలు ఏడుస్తాడని ముందే వచ్చి తింటున్నాను మరి ప్రేమ ఎందుకు ఇంత ముందు తింటుంది అని మళ్ళీ ప్రేమని ఇండైరెక్టుగా అడుగుతుంది. అయితే ప్రేమ నా సంగతి నీకెందుకు నోరు మూసుకొని నువ్వు తినాలనుకుంటే తిను అని అంటుంది. వదిన ప్రేమ తిక్క గురించి మీకు తెలియదు ఇలాగే ఒకడు ఏదో అంటే వాడి రాయి తీసుకొని బుర్ర పగలగొట్టేసింది అని ధీరజ్ చెబుతాడు.. ప్రేమ ఆనంద పనైనా చేస్తుంది అసలే తింగరిది మీరు దూరంగా ఉండండి అని శ్రీవల్లికి ధీరజ్ చెపుతాడు. నర్మదా ఆకలేస్తుంది అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అది చూసిన ప్రేమ అక్క ఇంకా భోజనం చేయలేదేమో అని బాధ పడిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు పల్లవి వార్నింగ్.. అవని దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×