E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: నీ దిక్కున్న చోటు చెప్పుకో.. అమూల్య పెళ్లి తర్వాతే ఆస్తి..భద్ర సంబరాలు..

Illu Illalu Pillalu Today Episodes: నీ దిక్కున్న చోటు చెప్పుకో.. అమూల్య పెళ్లి తర్వాతే ఆస్తి..భద్ర సంబరాలు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 22nd: ఆస్తి ఆస్తి అని అంటున్నావు కదా ఈ ఆస్తి ఈ ఇండ్లు అంత నా కష్టార్జితమే.. రక్తాన్ని దారి పోసి మరి నేను ఇంటిని కట్టుకున్నాను.. ఇది నేను సంపాదించుకున్న ఆస్తి రూపాయి రూపాయి పోగేసుకొని ఈరోజు ఇంతగా సంపాదించుకున్నాను అని రామరాజు అంటాడు. నేను సంపాదించుకున్న ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని తెగేసి చెప్పేస్తాడు రామరాజు.. ఆ మాట వినగానే ప్రసాద్ రావు నువ్వు ఇలా మాట్లాడతావని తెలిసే నేను లాయర్ ని తీసుకొని వచ్చాను.. రూల్స్ ప్రకారం కన్నబిడ్డలకి కన్నతండ్రి ఆస్తి వస్తుంది. లాయరు మాట ప్రకారం మీరు ఆస్తి పంచాల్సిందే అని ప్రసాద్ రావు అంటాడు.

ఆస్తి కోసం కోర్టుకు వెళ్లనున్న సాగర్..

ఆస్తిపంచకపోతే కచ్చితంగా కోర్టుకు వేస్తామని ప్రసాద్ రావు అంటాడు.. ఎలా మా అల్లుడికి రావాల్సిన ఆస్తిని తీసుకోవాలో మాకు బాగా తెలుసు అని ప్రసాద్ రావు అనడంతో రామరాజు ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ రెచ్చిపోతాడు.. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఏ కోర్టుకు వెళ్తారో ఏం చేసుకుంటారో అది చేసుకోండి అని రామరాజు అంటాడు. ఇది నా కష్టంతో సంపాదించుకున్న ఆస్తి ఎవరికి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని రామరాజు కోపంతో ఊగిపోతాడు.. ఇలా చెప్తే ఈనా వినడు మనం కోర్టు నుంచి నోటీసులు పంపిద్దామని సాగర్ అంటాడు.. ఆ మాట వినగానే రామరాజు షాక్ అవుతాడు.. ఆస్తికోసం కోర్టుకి కన్న కొడుకు వెళ్తున్నాడు అని బాధపడిపోతుంటాడు..

అమూల్య పెళ్లి తర్వాతే ఆస్తి పంపకం..

Advertisement

ఏం మాట్లాడుతున్నావ్ రా కన్న తండ్రి మీదనే నువ్వు పోలీసులు కేసు పెడతావా..? ఏంటి కోర్టుకు ఈడుస్తావా? నీ కన్న తండ్రి అన్న సంగతి కూడా నువ్వు మర్చిపోయావా ఎందుకురా ఇలా మారిపోయావు అని సాగర్ కాలర్ పట్టుకుని అడుగుతుంది వేదవతి.. నేను ఊరికే వెళ్ళట్లేదమ్మా మీ ఆయన చూడు ఎలా మాట్లాడుతున్నాడో అందుకే వెళ్ళాలనుకుంటున్నాను అని సాగర్ అంటాడు. ఏంట్రా నువ్వు ఆయన గురించి మాట్లాడేది ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది అన్న సంగతి కూడా మీరు మర్చిపోయి ఇలా గొడవలు పడుతున్నారని అడుగుతుంది వేదవతి.. అమూల్య పెళ్లయిన తర్వాత ఎవరు ఆస్తి వాళ్లకు నేనే దగ్గర ఉండి పని చేస్తాను అని వేదవతి అంటుంది.. అప్పటివరకు ఆస్తి గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని వేదవతి చెబుతుంది.

ప్రసాద్ రావు కు వేదవతి వార్నింగ్..

ఏమయ్యా పెద్దమనిషి ప్రసాద్ రావు గారు ఆస్తి కోసం తండ్రి కొడుకులని విడదీయాలని అనుకుంటున్నారా.. మీరు ఒక మనిషేనా అని వేదవతి దిమ్మ తిరిగిపోయేలా ప్రసాద్ రావు కి వార్నింగ్ ఇస్తుంది.. ఆస్తికోసం నా కొడుకుని నాకు కాకుండా చేశారు మీరు ఏం బాగుపడతారు ఇప్పుడు విన్నారు కదా.. నా కూతురు పెళ్లి అయిన తర్వాతే నేను ఆస్తి పంపకాలు దగ్గరుండి చేస్తాను అప్పటివరకు మీరు ఎవరు మాట్లాడదు ఇకనుంచి వెళ్ళిపొండి అని వేదవతి అంటుంది.. ఆస్తి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బయటికి రా అల్లుడు లేదంటే మాత్రం నీకు రూపాయి కూడా ఇవ్వరు అని ప్రసాద్ రావు అంటాడు.. ఇదే ఇంట్లో ఉండడం ఎందుకు వేరేగా ఉంటే సరిపోతుంది కదా అని శ్రీవల్లి నోరు జారుతుంది.

కుటుంబాన్ని విడగొట్టిన శ్రీవల్లి…

Advertisement

ఆస్తి కోసం కాదు ఈ ఇంట్లో నేను ఉండలేను అని సాగర్ అంటాడు. ఆ మాట వినగానే శ్రీవల్లి ఒకే ఇంట్లో ఉంటూ వేరేగా ఉండొచ్చు కదా అని సలహా ఇస్తుంది.. తండ్రి కొడుకులని విడగొట్టేలా సలహా ఇస్తావంటే తింగరి మొహం దాన అని వేదవతి శ్రీవల్లిని ఎంత తిడుతున్న సరే తాను మాత్రం చెప్పాలనుకున్న దాన్ని చెప్పేస్తుంది.. సాగర్ మరిది గారు బయటికి వెళ్లిపోయి ఎక్కడో అద్దె కొంపలో ఉంటూ పరువు తీయడం కంటే ఒకే ఇంట్లో ఉంటూ తన పని ఏదో తన చేసుకుంటే బాగుంటుంది కదా ఇంట్లో విషయాలు ఎవరికీ తెలియవు కదా అని వల్లి సలహా ఇస్తుంది. వల్లి సలహా మేరకు రామరాజు కూడా తనకి మద్దతు తెలపడంతో వల్లి ఇంట్లో గీత గీయాలని అనుకుంటుంది. సుకన్య వల్ల ఇద్దరు కలిసి ఇంట్లో అడ్డుగా సాగర్ వాళ్లకి సపరేట్గా గీతను గీస్తారు. అది చూసి వేదవతి కన్నీళ్లు పెట్టుకొని కుమిలిపోతుంది.

భద్ర, సేనా సంబరాలు..

రెండు ముక్కలైందని బాధపడుతూ ఉండగా.. బయట భద్రావతి అలాగే సేన ఇద్దరు కూడా టపాసులు పేలుస్తూ చాలా సంతోషంగా ఉంటారు. వీళ్లు టపాసులు పేలుస్తూ ఉండడం చూసి అందరూ ఏమైందని బయటకు వస్తారు. ఈ పనోడి కుటుంబం రెండు ముక్కలవుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని భద్రావతి ఆనంద పడిపోతూ ఉంటుంది. వచ్చేటప్పుడు అనాధనే కానీ వెళ్లేటప్పుడు మాత్రం నా వెనకాల ఒక పెద్ద కుటుంబమే ఉంది అని ఎన్నో గొప్పలు చెప్పుకున్నాడు.. ఇప్పుడు ఇల్లు రెండు ముక్కలైంది ఇది నేను ఆనందించాల్సిన విషయం అని భద్రవతి అనగానే వేదవతి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది.. కానీ భద్ర మాత్రం నా తీరు నాదే నా పగ నాదే అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read: Podarillu Today Episode : నారాయణను మార్చిన మహా.. టెన్షన్ పడుతున్న చక్రీ.. మహాను తీసుకొచ్చేందుకు ప్రతాప్ ప్లాన్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×