E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం ప్రేమ నిర్ణయం.. సాగర్, నర్మద ల మధ్య గొడవ.. వేదవతిని అడ్డంగా ఇరికించిన వల్లి..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం ప్రేమ నిర్ణయం.. సాగర్, నర్మద ల మధ్య గొడవ.. వేదవతిని అడ్డంగా ఇరికించిన వల్లి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 1st:ఏంటి ఆస్తుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావ్ నాన్న అని నర్మదా అడుగుతుంది. నా తమ్ముడికి సపోర్టుగా నేను నిలిచాను.. నాకు సపోర్ట్ గా మా మామగారు నిలిచారు ఇందులో తప్పేముంది నువ్వేం మాట్లాడద్దు నర్మదా అనేసి సాగర్ అంటాడు. ఇక ఆనంద్ రావు భాగ్యం మెల్లగా గొడవల నుంచి బయటకు వచ్చేస్తారు. రామరాజుకి నిజం చెప్పబోతున్న ఆనంద్ రావు మోహన నీళ్లు కొట్టి లేపుతుంది భాగ్యం.. బాబాయ్ గారు ఏదో చెప్పాలనుకుంటే నువ్వెందుకు ఆపుతున్నావు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు అని నర్మదకు అనుమానం మొదలవుతుంది.. మా అమ్మాయి ఫంక్షన్ ఇలా అయిపోయిందని బాధగా ఉందమ్మా అందుకే మేము వెళ్ళిపోతున్నాము అని భాగ్యం ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసే వెళ్ళిపోతుంది.. నర్మద మాత్రం వీళ్ళిద్దరూ ఏదో చేశారు అని అనుకుంటుంది..

బాధపడ్డ ధీరజ్..

ఇంట్లో అంత పెద్ద గొడవ జరగడానికి కారణం తనే అని ధీరజ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. తనని భావ సంతకం పెట్టుకొని ఇవ్వకుండా అక్క దారుణంగా అవమానించింది.. నా వల్లే సాగర్ అన్నయ్య ఆస్తి గురించి మాట్లాడారు అంటూ ధీరజ్ బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన ప్రేమ ధీరజ్ బాధ పడిపోతూ ఉండగా చూసి చాలా ఫీల్ అవుతుంది.. అరేయ్ ఈ గొడవ జరగడానికి కారణం నేనే కదరా ఐ యాం సారీ రా అని ప్రేమ బతిమలాడుతుంది.. నువ్వెలా కారణం అవుతావు. అలా జరగాలని ఉంది కాబట్టి అలానే జరిగింది అని ధీరజ్ అంటాడు.

రేపటి కల్లా నువ్వు కారు కొంటావు..

Advertisement

ఈ గొడవ జరగడానికి కారణం నేనే కదా.. మీ బావ చేత మీ అక్క వద్దన్నా సరే సంతకం పెట్టించుకోమని సలహా ఇచ్చింది నేనే కదా.. కానీ సంతకం పెట్టినందుకు మీ బావని మనల్ని తిడుతుంది అని అనుకున్నాను.. కానీ ఇలా దారుణంగా మాట్లాడుతుంది అని నేను అసలు ఊహించలేదు అని ప్రేమ అంటుంది. నా నగలని పెట్టుకొని తీసుకోమంటే తీసుకోవు. ఎలాగైనా సరే రేపు సాయంత్రం లోపు మనము కారు కొనేద్దాం.. ఆ కారుని అందరికీ చూపిద్దాం.. ఏదో ఒకటి నేను చేస్తాను అని ప్రేమ శపథం చేస్తుంది..

నర్మదా పై సాగర్ సీరియస్..

ఇంట్లో అంత పెద్ద గొడవ జరగడానికి కారణం సాగర్ నేనే అని అనుకుంటూ కోపంగా ఉంటాడు. నేను ఎంత చెప్పినా ఈ ఇంట్లో విలువ లేకుండా పోతుంది అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతున్న సాగర్ దగ్గరికి నర్మదా బాక్స్ తీసుకుని వస్తుంది.. ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరిగింది అసలు నీకు ఆస్తి గురించి ఎందుకు ఆలోచన వచ్చింది అని సాగర్ ని నర్మదా అడుగుతుంది. నీ ఆలోచన లేకపోతే ఇంకెవరైనా కూడా నీకు ఆస్తి గురించి సలహా ఇచ్చారా అని నర్మదా అడుగుతుంది. ఇది నా నిర్ణయం మాత్రమే ఇందులో ఎవరి ప్రమేయం లేదు అని సాగర్ చెప్తాడు. ఆస్తి గురించి మాట్లాడి ఎందుకు నువ్వు అందరికీ దూరం అవుతున్నావు అని నర్మదా అడగగానే సాగర్ సీరియస్ అవుతాడు. బాక్స్ కూడా వద్దని కోపంగా వెళ్ళిపోతాడు.

వేదవతి పై కోడళ్లు సీరియస్…

Advertisement

నర్మద పిలుస్తున్న కూడా సాగర్ వెళ్లిపోవడంలో ప్రేమ అక్కడికి వచ్చి ఏంటక్కా ఏం జరిగింది అని అడుగుతుంది. సాగర్ నా మీద కోపంతో వెళ్లిపోతున్నాడు.. నిన్న జరిగిన గొడవ ఎలా ఉందో మనమందరం చూసే ఉన్నాం కదా దాని గురించి అడిగితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు అని నర్మదా బాధ పడిపోతూ ఉంటుంది. అత్తయ్య వచ్చిన తర్వాత ఈ గొడవలు సద్దుమందుతాయని అనుకున్నాము. కానీ ఈవిడ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది అసలు అత్తయ్య ఎక్కడుంది అని ఇద్దరు వెతుకుతారు.. ముగ్గు వేస్తూ కనిపించిన వేదవతి దగ్గరికి వెళ్లి ఇద్దరు కూడదు కూడా సీరియస్ అవుతారు.. కోప్పడకుండా నిదానంగా ప్రశాంతంగా ఆలోచించి నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను ముందు ఈ ముగ్గు సంగతి చూడండి అని ముగ్గురు చాలా సంతోషంగా ముగ్గుని పూర్తి చేస్తారు..

వల్లి మాస్టర్ ప్లాన్..

ముగ్గురు ఆడవాళ్లు చాలా సంతోషంగా ముగ్గు వేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండడం చేసిన వల్లి తట్టుకోలేక పోతుంది… వీళ్ళ ముగ్గురు సంతోషాన్ని దూరం చేయాలి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది. రామరాజు బయట కూర్చుని ఉండడం గమనించిన వల్లి కావాలని వంటగదిలోకి వెళ్లి అక్కడ ఉన్న సామాన్లను కింద పడేస్తుంది. ఏదో పడిపోయింది అని అక్కడికొచ్చిన రామరాజు ఏంటమ్మా వల్లి ఏమైంది అని అడుగుతాడు.. మామయ్య గారు నాకు చాలా బాగా ఆకలి వేస్తుంది.. వంట గదిలోకి వచ్చి ఏదైనా చేసుకోవాలని అనుకున్నాను అని మళ్లీ అంటుంది. ఆ మాట వినగానే రామరాజు సీరియస్ అవుతాడు..

పీకల దాకా మెక్కిన వల్లి..

నువ్వు కడుపుతో ఉన్నావు అమ్మ నువ్వు ఇలాంటి పనులన్నీ చేయకూడదు.. అసలు మీ అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది అని అనగానే మళ్ళీ బయట వాళ్ళు ముగ్గురు గురించి చెప్తుంది.. కడుపుతో ఉన్న కోడలు ఇంట్లో ఉండదా? నువ్వు బయట ఏం చేస్తున్నావ్ అని రామరాజు గట్టిగా కేకలు వేసి వేధవతి నర్మదా ప్రేమలను పిలుస్తాడు.. వల్లి నీ సరిగ్గా చూసుకోవడం లేదు అని రామరాజు ముగ్గురుని తిట్టేస్తాడు.. ఒక బెల్ ఇచ్చి దానిని కొట్టినప్పుడు నీ దగ్గరికి వచ్చి నీకేం కావాలో వాళ్ళు ఇస్తారు అని రామరాజు అనగానే వల్లి రెచ్చిపోతుంది. ఇక మావయ్య గారు చెప్పినట్లుగానే ఆ ముగ్గురు కూడా వల్లికిని ఏం కావాలంటే అది చేసి పెట్టి పీకలు దాకా తినేలా చేస్తారు.. మళ్లీ కావాలని ఇదంతా చేస్తుంది అని అనుకుంటారు కానీ కడుపుతో ఉంది కదా అని తర్వాత సైలెంట్ అవుతారు. మొత్తానికి వల్లి ప్లాన్ అయితే బాగా వర్క్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న అవని.. పల్లవి ఫుల్ హ్యాపీ..పుట్టింటికి వెళ్లిపోయిన ప్రణతి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×