E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: నర్మదను ఇరికించిన శ్రీవల్లి.. టీచర్ గా పాఠాలు చెప్పబోతున్న ప్రేమ..

Illu Illalu Pillalu Today Episode: నర్మదను ఇరికించిన శ్రీవల్లి.. టీచర్ గా పాఠాలు చెప్పబోతున్న ప్రేమ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode may 19th: నిన్నటి ఎపిసోడ్ లో..  నర్మదా ట్రైనింగ్ కోసమని హైదరాబాద్ కి సాగర్ తో కలిసి వెళుతుంది. ఇక ధీరజ్ ఎలాగైనా సరే వచ్చే నెల నుంచి వాళ్ళ నాన్నకి పదివేలు ఇవ్వాలని పార్ట్ టైం జాబ్ చేస్తాడు. ఫుడ్ ని డెలివరీ చేస్తూ ఉంటాడు. అయితే ఒక కస్టమర్ మాత్రం అడ్రస్ చెప్పడానికి విసుక్కుంటాడు. నేను ఆల్రెడీ అడ్రస్ కరెక్ట్ గా చెప్పాను కరెక్ట్ గా పెట్టాను నువ్వు అలానే రా అనేసి ఫోన్ పెట్టేస్తాడు. చివరికి ఎలాగోలా ఆ డ్రెస్ ని కనుక్కొని ధీరజ్ అక్కడికి వెళ్ళగానే ఆ కస్టమర్ నేను ఏ టైం కి నీకు ఆర్డర్ పెట్టాను నువ్వు ఏ టైం కి డెలివరీ చేస్తున్నావు అని సీరియస్ అవుతాడు.. నిన్న ప్రేమ ట్యూషన్ పెట్టడానికి ధీరజ్ ఒప్పుకుంటాడు. ఏం చేస్తున్నావ్ ఇంట్లో వాళ్లకు అమర్యాదగా అనిపించేలా చేయకు అని సలహా ఇస్తాడు. నేను ట్యూషన్ మాత్రమే చెప్తున్నాను అంతేకానీ నేను ఇంకేమీ తప్పు చేయట్లేదు అని ప్రేమ అంటుంది. నువ్వు సపోర్ట్ చేస్తున్నావ్ కదా చాలు ఇకమీదట ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని ధీరజ్ పై తన ప్రేమను చూపిస్తుంది ప్రేమ.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. వేదవతి ఎందుకో తెలియదు అని ఎదురుగా కూర్చొని దిగిలుపడుతుంది. ఏమైందో అత్తయ్య అంత దిగులు పడుతున్నారు అంటే ఏం లేదు ఏదో కోల్పోయిన నన్ను ఫీలింగ్ కలుగుతుంది అని ప్రేమతో అంటుంది. మీరు ఇంత దిగులుగా ఉండడానికి కారణం నర్మదా అక్కే..  అక్క మీకు దూరంగా వెళ్లిపోయింది కదా అందుకే మీరు ఇలా ఫీల్ అవుతున్నారు అని ప్రేమ అంటుంది.. అందుకేనా సుమీ నాకు ఏందో ఇందాక నుంచి ఎవర్నో కోల్పోయిన అంత ఫీలింగ్ వస్తుంది అని అంటుంది. మీకు అక్క మీద ఉన్న ప్రేమ అక్క మీ మీద చూపిస్తున్న అభిమానం అంతే కదా అని అంటుంది.

Advertisement

ఇక అస్సలు ఆలస్యం లేకుండా అక్కకు ఒకసారి ఫోన్ చేయండి అని ప్రేమ తన ఫోన్ ఇస్తుంది. వేదవతి నర్మదకు ఫోన్ చేస్తుంది. ప్రేమ చెప్పు అని అనగానే ప్రేమ గాదు వేదవతి అని అంటుంది. అత్తయ్య గారు మీరా ఏంటి నేను లేనని బెంగ పెట్టుకున్నారా? దిగులు పట్టుకున్నారా? అందుకే ఫోన్ చేశారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది నర్మదా.. నీ మీద బెంగతో ఏమి కాదు దూరంగా వెళ్లిపోయారు కదా తిన్నారో లేదో అని కనుక్కుందామని ఫోన్ చేశాను అని వేదవతి అంటుంది. పక్కనే ఉన్న శ్రీవల్లి వీళ్ళని చూసి కుళ్ళుకుంటుంది. ఎలాగైనా సరే అత్తయ్యకు ఇద్దరు కోడల్ని దూరం చేయాలి అని కంకణం కట్టుకుంటుంది.

ఇక నర్మదతో శ్రీవల్లి మాట్లాడతాను అని అంటుంది. కావాలనే మాట్లాడుతుంది ట్రైనింగ్ అవ్వగానే మీరు ఎక్కడికి వెళ్తారు ఎంత డబ్బులు ఖర్చు పెడతారు అని రామరాజును చూసి మాట్లాడుతుంది. ఆ తర్వాత రామరాజు దగ్గరికి వెళ్లి ఇదిగో నర్మదతో మాట్లాడింది మావయ్య అని అడ్డంగా ఇరికిస్తుంది. నర్మదా సాగర్కిస్తుంది ఫోను.. సాగరు వాళ్ళ నాన్నతో మిల్లు గురించి అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటారు అది విన్న నర్మదా నిద్రపోతుంది. అక్కడ మీ నాన్నతోనే మాట్లాడుతూ ఇక్కడ మీ నాన్నతోనే మాట్లాడతావా దూరంగా వెళ్లి పడుకో అని సాగర్ ని దూరం పెట్టేస్తుంది..

Advertisement

ఇక తర్వాత రోజు ప్రేమ అనుకున్నట్లుగానే ట్యూషన్ ని మొదలు పెడుతుంది. ధీరజ్ రాగానే నేను ట్యూషన్ ని మొదలు పెట్టాను ధీరజ్ అని గొప్పగా చెప్పుకుంటుంది. ధీరజ్ ప్రేమను ఆట పట్టిస్తాడు. కానీ ప్రేమ తన కాళ్ళు పట్టుకోవడంతో ధీరజ్ లేదు లేదో నువ్వు మంచి సక్సెస్ సాధిస్తావు అని అంటాడు. మొత్తానికి ధీరజ్ అయితే ప్రేమకు ఆల్ ది బెస్ట్ చెప్తాడు.. ఇక సాగర్ నర్మద మధ్య ఒక డ్యూయెట్ సాంగ్ మొదలవుతుంది. భార్య ఆలకను పాటతో పోగొట్టేస్తాడు.. కవిత్వంతో నర్మదను పడేస్తాడు. అప్పుడే సాగర్ కి ఫోన్ వస్తుంది దాంతో బయటకు వెళ్ళిపోతాడు. మాత్రం ఫస్ట్ నైట్ చేసుకోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×