E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్ కు ప్రేమ అడ్వైజ్.. మిల్లుకు వెళ్లిన రామరాజు.. కంగారు పడిన వల్లి..

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్ కు ప్రేమ అడ్వైజ్.. మిల్లుకు వెళ్లిన రామరాజు.. కంగారు పడిన వల్లి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. నువ్వు ఏం కోల్పోయావో నీకు తెలియదు.. నర్మదా సాగర్ బయటకు వచ్చేస్తారు.. ఇక భాగ్యం ఆనందరావు బ్యాగ్సర్దుకుని వెళ్లడం చూసిన రామరాజు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు.. మేము మీ ఆరోగ్యం బాగోలేదని వచ్చాము. కూతురును ఇచ్చిన ఇంట్లో ఇన్ని రోజులు ఉండడం మంచిది కాదు అని వాళ్ళు అంటారు.. చందు నేను మిల్లుకు వెళ్తాను అని చెప్పగానే రామరాజు అతని రెడీ చేసి మరీ పంపిస్తాడు. అది చూసిన సాగర్ చాలా ఫీల్ అయిపోతాడు.. ఇక సాగర్ వాళ్ళు బయటికి వెళ్లిపోతారు.

నర్మదా మాత్రం వేదవతి తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె మాట్లాడకుండా వెళ్ళిపోతుంది.. తర్వాత ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా కారుని తీసుకోవడానికి డౌన్ పేమెంట్ కట్టాలి కదా.. మనం అక్కడికి వెళ్లాలి అని అనుకుంటారు. వీళ్ళిద్దరూ కలిసి డబ్బుల కోసం అని ఒక ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వెళ్తారు. అక్కడ అతనితో నేను కారు బిజినెస్ చేయబోతున్నాను. లోన్ కావాలి అని ధీరజ్ అడిగినా సరే.. ఏదో ఒక షూరిటీ కావాలి అని అతను చెప్పడంతో అక్కడి నుంచి వచ్చేస్తాడు.. నర్మదను తన ఆఫీసులో వల్లే అవమానించడంతో బాధపడిపోతూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నర్మదని ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆయన లంచం ఇచ్చి ఉద్యోగం కొన్నాడు అని హేళన చేస్తూ అవమానిస్తారు. వాళ్ల మాటలు విన్న నర్మదా బాధ పడిపోతుంది.. అయితే నర్మదతో పాటు పనిచేస్తున్న మరొక ఆవిడ అక్కడికి వచ్చి నర్మద గురించి మనకు తెలియదా ఎందుకు మీరు ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు అని అంటుంది.. ఏరోజైనా లంచాలు తీసుకొని తప్పు చేసిందా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కొంచెం బుద్ధుండాలి అని ఆమె ఇద్దరిని కడిగి పడేస్తుంది. నర్మదా నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను ఇంటికి వెళ్తాను అని వెళ్ళిపోతుంది.. ధీరజ్ డబ్బుల కోసం టెన్షన్ పడుతున్నాడు అని ప్రేమ బాధ పడిపోతుంది.. ఎలాగైనా సరే వాడిని ఈ మూడు నుంచి బయటికి తీసుకురావాలని ఐస్క్రీం కొనివ్వమని బ్రతిమలాడుతుంది.. ఇద్దరు కలిసి కాసేపు ఐస్ క్రీమ్ తింటూ సరదాగా మాట్లాడుకుంటారు.

అయితే ధీరజ్ బాధపడిపోతూ ఉంటే ఏంటి డబ్బులు కోసం బాధపడిపోతున్నావా మరేం బాధపడకు రా.. నా నగలు ఉన్నాయి కదా.. వాటిని తాకట్టు పెట్టి ఆ కారు కొందాం ఆ తర్వాత మళ్లీ నువ్వు ఇద్దువు అనేసి ప్రేమ అంటుంది.. ఆ మాట వినగానే ధీరజ్ షాక్ అవుతాడు.. అమ్మ తల్లి ఇంట్లో జరుగుతున్నవి సరిపోవా ఇప్పుడు మళ్లీ నువ్వు నగల గురించి తీసుకొస్తావేంటి అని అంటాడు.. మీ నాన్న కాళ్ళ మీద పడరా అప్పుడు నీకు డబ్బులు ఇస్తాడు కదా అని అంటే మా నాన్న కాళ్ళ మీద పడడం నాకు ఇబ్బంది కాదు. కానీ మా నాన్నకు తెలియకుండా నేను పైకి రావాలి అన్నది నా పాలసీ. అందుకే నేను మా నాన్న దగ్గరికి వెళ్లడం లేదు అని ధీరజ్ అంటాడు..

Advertisement

అయితే మీ గయ్యాళి అక్క ఉంది కదా ఆమె భర్త కూడా ఏదో కాంట్రాక్టుగా పనిచేస్తున్నాడు కదా అని ప్రేమ అంటుంది. ఏంటి మా అక్కని గయ్యాళి అంటావా అని అంటే లేదు లేదు మీ అక్క వాళ్ళ భర్త షూరిటీ సరిపోతుంది కదా అని ప్రేమ అద్భుతమైన అడ్వైజ్ ఇస్తుంది.. నువ్వు ఇన్నాళ్లకు మంచి పని చేశావు. ఇన్ని రోజులు నీ బుర్రలో ఐస్ క్రీమ్ మాత్రమే ఉంది అనుకున్నాను. కానీ ఇలా తెలివి కూడా ఉందని నాకు అర్థమైంది అని ధీరజ్ అంటాడు. ఇకపోతే వీళ్ళిద్దరూ కలిసి కామాక్షి దగ్గరికి వెళుతూ ఉంటారు.. రామరాజు రైస్ మిల్క్ రావడంతో ఒక్కసారిగా తిరుపతి చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు.

బావా నువ్వు మళ్ళీ రైస్ మిల్క్ వచ్చేసావా నాకు చాలా సంతోషంగా ఉంది బావ అని అనగానే.. అక్కడే ఉన్న చందు కూడా ఆవేశంగా వస్తాడు. ఏంటి నాన్న మీరు రైస్ మిల్లుకు వచ్చారు మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చందు అంటాడు. అప్పుడే వల్లి అక్కడికి వచ్చి ఆయాస పడిపోతూ ఉంటుంది. ఏంటమ్మా వాలి క్యారేజ్ తీసుకురావాలని నాకు చెప్తే నేను తీసుకొచ్చేవాడిని కదా.. ఎందుకు నువ్వు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని అంటాడు రామరాజు. మీరు రైస్ మిల్ కి వెళ్తున్నారన్న విషయాన్ని నాకు చెప్పలేదు కదా మావయ్య గారు అందుకే నేను మీ అబ్బాయి కోసం అన్నం పెట్టుకొని వచ్చాను అని అంటుంది.

ఎలాగో వచ్చారు కదా నాన్న రైస్ మిల్లు లెక్కలు ఒకసారి చూడండి అని చందు అంటాడు.. కానీ చందు ఆ మాట అనగానే ఎక్కడ తన బొక్కలు బయట పడతాయో ఇక మావయ్య గారు ఎక్కడ రైస్ మిల్లులోనే ఉండి పోతారో అని వల్లి కంగారు పడిపోతుంది.. అయితే మీరు బలే ఉన్నారండి బావగారు. అసలే ఆయన గాలి మారెందుకోసమని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆ బాధ్యతలను ఎందుకు మీరున్నారు తిరుపతి బాబాయి ఉన్నారు. ఇప్పుడు మా నాన్న కూడా వచ్చాడు కదా చూసుకోండి అని వల్లి అంటుంది.. హమ్మయ్య మామయ్యని నేను ఎప్పటికీ రైస్ మిల్లుకు రాకుండా చేశాను నాకు చాలా హ్యాపీగా ఉంది. లేదంటే మా నాన్నని బయటికి పంపించాల్సి వచ్చేది అని మళ్లీ బాధ పడిపోతుంది.

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ధీరజ్ రామరాజుకు నిజంగానే కొడుకునా?

ఇక రామరాజు తిరుపతిని తీసుకొని కలెక్షన్ల కోసం ఎక్కడికి వెళ్లాలో చూపిస్తానని వెళ్తాడు.. ఇక్కడికి వెళ్ళగానే కలెక్షన్స్ డబ్బులు కోసం అడుగుతాడు.. మొదటినుంచి మా తిరుపతి మీ దగ్గర డబ్బుల కోసం వస్తాడని చెప్తారు.. అద్దెను వసూలు చేసుకోవడానికి వచ్చిన సేన సాగర్ గురించి అడగ్గానే దారుణంగా అవమానిస్తాడు. ఆ తర్వాత రామరాజు కొడుకు ఎలాంటి పని చేశాడో తెలుసా అని చెప్పేసి అతని అవమానించేస్తాడు.. అతను కూడా వాళ్ళు చెప్పింది నమ్మేసి రామరాజు గురించి తప్పుగా అనుకుంటారు.. భద్ర కూడా వచ్చి చెప్పడంతో అక్కడ అవమానంగా ఫీల్ అయిన రామరాజు వెళ్లిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×