E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: అడ్డంగా ఇరుక్కున్న వల్లి.. వేదవతికి తెలిసిపోయిన నిజం.. నర్మద ప్లాన్ సక్సెస్..

Illu Illalu Pillalu Today Episode: అడ్డంగా ఇరుక్కున్న వల్లి.. వేదవతికి తెలిసిపోయిన నిజం.. నర్మద ప్లాన్ సక్సెస్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. అమూల్యను ఇరికించాలని చూశారా అని అందరు అనుకుంటారు. రామరాజుకి భద్ర వార్నింగ్ ఇస్తుంది. వేదవతి భద్రా కి వార్నింగ్ ఇస్తుంది. నీ అంత చూస్తాము అని భద్రవతి పోలీస్ స్టేషన్ కి వెళుతుంది.. అక్కడ విశ్వం ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిన సరే ఫలించవు. ఇక ధీరజ్ చేసిన పనికి వేదవతి సీరియస్ అవుతుంది. కానీ రామరాజు మాత్రం వాడు చేసింది కరెక్టే అని అంటాడు.. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ధీరజ్ చేసిన పనికి మెచ్చుకుంటూ ఉంటారు.. అయితే అప్పుడే వేదవతి వాళ్ళ అమ్మ పెద్దమ్మ ఇంట్లోకి వస్తారు.. మీరు చేసింది నిజంగానే కరెక్ట్ కాదు అల్లుడుగారు అని అంటారు..

ఏం మాట్లాడుతున్నారండి నేనేం తప్పు చేశాను అని రామరాజు అడుగుతాడు. రామరాజు అత్తలు ఎంతగా అమూల్య పెళ్లి గురించి చెప్పిన కూడా రామరాజు వినడు. ధీరజ్ ను ఇన్ని రోజులకు మంచి పని చేశాడని పొగిడేశారు.. శ్రీవల్లి విశ్వంను అరెస్ట్ చేసిన విషయాన్ని ఎలాగైనా సరే భాగ్యంతో చెప్పాలి అని ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ అక్కడికి వచ్చేస్తుంది. ఆ ఏజెంట్ కు దొరికిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. జాబు ఇచ్చే ఏజెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చి గుర్తుపట్టేస్తాడు.. అతను గనుక మన దగ్గర ఉంటే మన బండారం బయటపడుతుందని వాళ్ళు ముగ్గురు కూడా ఎలాగోలాగా తప్పించుకుంటారు. నర్మదను చూసి ఆ ముగ్గురు షాక్అయ్యి పారిపోతారు.. ఆ ఏజెంట్ నర్మద దగ్గరకొచ్చి సాగర్ వైఫ్ కదా అని అడుగుతాడు.. ఇక మొత్తం నిజాన్ని వల్లి గురించి నర్మదతో చెప్తాడు దాంతో నర్మదా షాక్ అయిపోతుంది. వల్లి అక్క ఇదంతా దగ్గరుండి చేసిందా? నేరుగా వెళ్లి వల్లిని అడిగితే నిజం బయటపడుతుందని నర్మద అనుకుంటుంది. శ్రీవల్లిని ఎలాగైనా సరే అడిగి తెలుసుకోవాలి అని నర్మదా శ్రీవల్లిని వెతుక్కుంటూ ఇంటికి వస్తుంది. మళ్లీ అప్పటికే పరిగెత్తుకుంటూ ఇంటికి రావడం చూసిన వేదవతి ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఎందుకు వల్లి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమైందబ్బా అని వేదవతి అనుకుంటూ ఉంటుంది.

ఆ నర్మద నన్ను చూసింది అంటే నేను చచ్చిపోతాను.. నర్మద చూసిందో లేదో ముందు అర్జెంటుగా వెళ్లి చీర మార్చుకోవాలని అనుకుంటుంది. నర్మద ఇంట్లోకి రావడం చూసినా శ్రీవల్లి వెంటనే గదిలోకి వెళ్లి చీర మార్చుకొని వెంటనే పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళుతుంది. అది చూసిన నర్మదా ఏంటి అంత హడావిడిగా వంటగదిలోకి వెళ్తుంది అని అనుకుంటుంది. వంటగదిలోకి వెళ్లిన తర్వాత శ్రీవల్లి టీ పెట్టుకోడానికి స్టవ్ వెలిగించి అన్ని వేసి సిద్ధం చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా వల్లి అక్క నువ్వు బయట నుంచి వచ్చావా అని అడుగుతుంది.. ఏం మాట్లాడుతున్నావ్ చెల్లి నేను లోపలే ఉన్నాను ఇదిగో ఇక్కడే ఉన్నాను కదా అని అంటుంది..

Advertisement

అయితే నువ్వు బయట నుంచి వచ్చావని నాకు అర్థం అవుతుంది అని ఎంత చెప్తున్నా సరే నర్మద మాత్రం నమ్మదు.. ఇక నర్మద ఒక ఏజెంట్ గురించి చూపించి ఇతను నీకు తెలుసా అక్క అని అడుగుతుంది. తెలుసు కదా ఆ రోజు సాగర్ ఫంక్షన్ లో కనిపించాడు సాగర్ ఫ్రెండేమో అని అంటుంది. అతను సాగర్ ఫ్రెండ్ కాదక్కా జాబ్ ఇప్పించిన ఏజెంట్ అనగానే వామ్మో వీడు దొంగ చచ్చినోడు వీడేనా మా ఇంట్లో ఇన్ని గొడవలు పెట్టింది అని అంటుంది. ఆ తర్వాత సరే అక్క నీకు ఇతను తెలియదు కదా నాకు ఒక టీ ఇస్తావా అని అడుగుతుంది. నర్మదా తెలివిగా టీ తాగేందుకు అక్కడ కూర్చొని ప్రేమకు ఫోన్ చేస్తుంది. ప్రేమ నర్మదక్క ఫోన్ చేసింది ఏంటి అని లిఫ్ట్ చేస్తుంది. అక్కడ నర్మదా బల్లి అక్కకి ఏమీ తెలీదా అని మళ్లీ మళ్ళీ అడుగుతుంది. నిజంగానే నాకు ఏమీ తెలియదు చెల్లి అని అనగానే సరే అక్క నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

Also Read : ‘కార్తీక దీపం’ సీరియల్ నుంచి డాక్టర్ బాబు అవుట్..కారణం ఇదే..?

ఇక ఆనంద్ రావు భాగ్యం అక్కడ ఏం జరుగుతుందో మళ్లీ ఎలా ఉందో ఆ నర్మద చూసిందో లేదో అని కంగారు పడిపోతూ ఉంటారు.. వల్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. అయితే ఏం నర్మదా ప్రేమ దగ్గరికి వెళ్లి కాల్ కట్ చేయొద్దు రికార్డు చేయని చెప్తుంది.. నర్మదా నన్ను చూసేసింది అమ్మ ఆ ఏజెంట్ గురించి అడిగింది కానీ నాకు తెలియదు అని చెప్పి ఏదో ఒకటి మేనేజ్ చేసి బయటపడ్డాను అని వల్లి అంటుంది.. ఆ విశ్వం గాడు జైలుకు వెళ్ళాడు అంటే కచ్చితంగా మనల్ని బయటకు లాగుతాడని నాకు భయమేస్తుంది అమ్మ అని వల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఆ తర్వాత అమూల్యని ప్రేమించమన్న విషయం ఎక్కడ బయట పడుతుందో అని నాకు కంగారుగా ఉంది అని అనగానే అక్కడే ఉన్న వేదవతి ఆ మాట విని షాక్ అయిపోతుంది.. ఇదంతా చేసింది మళ్ళీ నాని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×