E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్ పై రామరాజు ప్రశంసలు.. బాధపడుతున్న సాగర్.. శ్రీవల్లి బండారం బయటపడుతుందా..?

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్ పై రామరాజు ప్రశంసలు.. బాధపడుతున్న సాగర్.. శ్రీవల్లి బండారం బయటపడుతుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి పూజ చేసి ఉగాది పచ్చడిని ఇస్తుంది.. కానీ నర్మదా ప్రేమలకు మాత్రం శ్రీవల్లికి ఇవ్వమని చెప్తుంది. అయితే మరోసారి శ్రీవల్లి తనకి అనుగుణంగా మార్చుకుంటూ వాళ్ళిద్దరిని ఇరికిస్తుంది. మీరు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అత్తయ్య మామయ్యలకు మంచి పేరు తీసుకురండి అని శ్రీవల్లి కావాలని రామరాజు ముందర వాళ్ళిద్దరిని అంటుంది. దానికి రామరాజు వదిలేయమ్మ శ్రీవల్లి వాళ్ళందరూ నీలాంటి మంచి వాళ్ళు కాదు కదా..

నా ఇంటి పెద్ద కోడలుగా నువ్వు ఎంతో గొప్ప స్థానంలో ఉన్నావు.. నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు మారరు వాళ్ళు ఇంతే అని రామరాజు వెళ్లిపోతాడు.. ఇన్ని రోజులు తీపి అనుకున్నవి చేదుగా మారాయి అని వేదవతి కూడా వెళ్ళిపోతుంది. ప్రేమ నర్మదా అక్కడి నుంచి వచ్చేస్తారు.. ఏంటి ప్రేమ అలా వచ్చేసావు? ఏమైంది నీకు అని నర్మదా ఎంతగా బ్రతిమలాడిన సరే.  ప్రేమ మాత్రం చూసావా అక్క బల్లి అక్క ఎలా మాట్లాడుతుందో అందరూ నన్ను ఎలా అంటున్నారు అని బాధపడిపోతూ ఉంటుంది.. పోలీసులు విశ్వం ని అరెస్ట్ చేస్తారు. భద్ర సేన ఇద్దరు కూడా నా కొడుకుని అరెస్ట్ చేస్తారని వాళ్లపై రివేంజ్ స్టార్ట్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అమూల్యను ఇరికించాలని చూశారా అని అందరు అనుకుంటారు. రామరాజుకి భద్ర వార్నింగ్ ఇస్తుంది. వేదవతి భద్రా కి వార్నింగ్ ఇస్తుంది. నీ అంత చూస్తాము అని భద్రవతి పోలీస్ స్టేషన్ కి వెళుతుంది.. అక్కడ విశ్వం ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిన సరే ఫలించవు. ఇక ధీరజ్ చేసిన పనికి వేదవతి సీరియస్ అవుతుంది. కానీ రామరాజు మాత్రం వాడు చేసింది కరెక్టే అని అంటాడు.. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ధీరజ్ చేసిన పనికి మెచ్చుకుంటూ ఉంటారు.. అయితే అప్పుడే వేదవతి వాళ్ళ అమ్మ పెద్దమ్మ ఇంట్లోకి వస్తారు.. మీరు చేసింది నిజంగానే కరెక్ట్ కాదు అల్లుడుగారు అని అంటారు.. ఏం మాట్లాడుతున్నారండి నేనేం తప్పు చేశాను అని రామరాజు అడుగుతాడు.

తప్పు ఒప్పు వాళ్ళిద్దరికీ పెళ్లి అయిపోయింది అన్న విషయం ఊరందరికీ తెలుసు. అయితే వాళ్ళిద్దరికీ నిజంగానే పెళ్లి జరిపించి రెండు కుటుంబాలు ఒకటే ఎలా చేద్దామని ఇద్దరు అత్తలు అంటారు. కానీ రామరాజు మాత్రం రెండు కుటుంబాలు ఒకటవుతాయా ఏం మాట్లాడుతున్నారండి అని అంటాడు. ఆ తర్వాత ఈ పెళ్లితో మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి. ఒకసారి ఆలోచించండి అని ఆ ఇద్దరు అత్తలు అంటారు.. నా కూతురు జీవితాన్ని పణంగా పెట్టి నేను ఏ నిర్ణయం తీసుకోను. మీ ఇంట్లో ఉన్న నాలుగు రోజులు నా కూతురు గురించి నేను ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు అని రామరాజు అంటాడు.

Advertisement

మీరు అలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోకండి. నా కూతురు విషయంలో నేను ఎలాంటి తప్పు చేయాలి అని అనుకోవడం లేదు అని రామరాజు అంటాడు. ఇక తర్వాత మీరు ఎప్పుడూ ఈ విషయం గురించి మాట్లాడాలంటే నా ఇంట్లోకి కూడా రావద్దు అని రామరాజు అనగానే.. ఆ ఇద్దరు అత్తలు వేదవతి నువ్వైనా చెప్పు అని అంటారు.. నా భార్య నా మాటే వింటుంది తన మాట నా మాట వేరుగా ఉండవు అని రామరాజు అనగానే ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. ఇన్ని రోజులు నా చిన్న కొడుకుకి బాధ్యత తెలియదు అని అనుకున్నాను. కానీ ఇవాళ వాడు చేసిన పనికి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని రామరాజు అంటాడు..

రైస్ మిల్లు బాధ్యతలుని నా పెద్ద కొడుకు తీసుకుంటే, నా కూతురు బాధ్యతల్ని నా చిన్న కొడుకు తీసుకున్నాడు అని వాళ్ళిద్దరి మీద ప్రశంసలు కురిపిస్తాడు.. ఇంట్లో ఇంకొకడున్నాడు వాడు మన ఇంటి లెక్కల్లో లేడు వాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని రామరాజు సాగర్ ను అనడంతో సాగర్ బాధపడిపోయి లోపలికి వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత ఏమి మాట్లాడకుండా కోపంగా ఆఫీస్ కి వెళ్ళిపోతాడు.. నర్మదా నేను వస్తానని ఎంతగా అంటున్న సరే అతను మాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. శ్రీవల్లి విశ్వంను అరెస్ట్ చేసిన విషయాన్ని ఎలాగైనా సరే భాగ్యంతో చెప్పాలి అని ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ అక్కడికి వచ్చేస్తుంది.

Also Read : ఫీల్ అయిపోయిన పల్లవి..నిజం చెప్పబోతున్న చక్రధర్.. అవనిని చంపేందుకు పల్లవి ప్లాన్..

ఏమైంది తమ్ముడు ఎందుకు ఇంతగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అడుగుతారు. ఆ విశ్వం ని పోలీసులు అరెస్ట్ చేశారు. అమూల్యని ప్రేమించమని నేనే చెప్పానని మన విషయం గురించి బయట పెడితే.. మన గతి ఇంతే అనేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. దీనికి ఎంత టెన్షన్ పడాలా ఏం కాదు నేను చూసుకుంటాను అని భాగ్యం అంటుంది. ఇక ఆ జాబు ఇచ్చే ఏజెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చి గుర్తుపట్టేస్తాడు.. అతను గనుక మన దగ్గర ఉంటే మన బండారం బయటపడుతుందని వాళ్ళు ముగ్గురు కూడా ఎలాగోలాగా తప్పించుకుంటారు. నర్మదను చూసి ఆ ముగ్గురు షాక్అయ్యి పారిపోతారు.. ఆ ఏజెంట్ నర్మద దగ్గరకొచ్చి సాగర్ వైఫ్ కదా అని అడుగుతాడు.. ఇక మొత్తం నిజాన్ని వల్లి గురించి నర్మదాతో చెప్తాడు దాంతో నార్మదా షాక్ అయిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో శ్రీవల్లి బండారం బయట పడుతుందేమో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×