E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: రామరాజు దెబ్బ అదుర్స్.. నర్మద, ప్రేమ కాపురాల్లో శ్రీవల్లి చిచ్చు.. సాగర్, నర్మద మధ్య దూరం..

Illu Illalu Pillalu Today Episode: రామరాజు దెబ్బ అదుర్స్.. నర్మద, ప్రేమ కాపురాల్లో శ్రీవల్లి చిచ్చు.. సాగర్, నర్మద మధ్య దూరం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. అమూల్యను అసలు పెళ్లి పెట్టుకొని నువ్వు ఎందుకు బయటకు వెళ్ళావు అని అందరు గుచ్చి గుచ్చి అడుగుతారు. ధీరజ్ ప్రేమనే కదా బయటకు తీసుకొని వెళ్ళింది అని అంటాడు. దానికి ప్రేమ వదినకు ఈ విషయానికి ఎటువంటి సంబంధం లేదు అని అమూల్య అంటుంది.. మరి ఎవరు తీసుకొని వెళ్ళమన్నారు అని అందరూ గుచ్చి గుచ్చి అడుగుతారు. శ్రీవల్లి తన పేరు ఎక్కడ చెప్తుంది అని భయపడిపోతూ ఉంటుంది.. కానీ అమూల్య మాత్రం శ్రీవల్లి పేరు చెప్పదు. శ్రీవల్లి తన పేరు ఎక్కడ బయటపడిపోతుందని టెన్షన్ పడిపోతూ ఉంటుంది..

నన్ను బయటకు తీసుకెళ్లింది ఎవరో కాదు నేనే వెళ్ళను వాడు నన్ను చివరిగా మాట్లాడాలి అని పిలిస్తే గుడ్డిగా నమ్మి వెళ్లాను. కానీ వాడు నాకు కిడ్నాప్ చేశాడు అని అమూల్య శ్రీవల్లి పేరు బయటకు తీసుకురాకుండా చెప్తుంది. అయితే శ్రీవల్లి అమ్మయ్య నా పేరు చెప్పలేదు సేఫ్ అని అంటుంది. అమూల్ ఎంత చెప్తున్నా సరే ధీరజ్ మాత్రం వినకుండా ప్రేమదే తప్పు అని తనని దూరం పెట్టేస్తాడు. ఒకవైపు నర్మదా ఎంత చెప్తున్నా సరే ధీరజ్ మాత్రం ఇందులో నా నిర్ణయాన్ని మార్చుకోను అని కఠినంగా చెప్పేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ధీరజ్ మాత్రం ప్రేమ చెప్పిన మాటని వినకుండా తనని అసహ్యించుకుంటాడు.. ప్రేమ ఎంత చెప్తున్నా సరే నువ్వు చేసిన పనికి నిన్ను ప్రేమించాలని అనిపించడం లేదు. పెళ్లి పీటల నుంచి లేచిపోయిన నిన్ను ప్రేమించాను చూడు అది నేను చేసిన తప్పు. నీకు నాలాంటి వాళ్ళు కాదు ఆ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయితేనే కరెక్ట్ అంటూ ప్రేమ గురించి ధీరజ్ దారుణంగా మాట్లాడుతాడు.. నీ మొహం కూడా నాకు చూపించడానికి వీల్లేదు అని చెప్పేసి వెళ్తాడు. ఇదంతా విన్న నర్మదా ధీరజ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అర్థం అవుతుందా అని అడుగుతుంది. నేనేం మాట్లాడాలో నాకు బాగా తెలుసు వదిన మీరు ఏమి ఈ విషయాల్లో కల్పించుకోవద్దు అని ధీరజ్ అంటాడు.. ప్రేమని నర్మద ఎంత ఓదార్చిన సరే ప్రేమ మాత్రం ధీరజ్ నన్ను బాధ పెట్టాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. శ్రీవల్లి మాత్రం తను వేసిన ప్లాను సక్సెస్ అయింది అని డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇన్ని రోజులు నువ్వు తెలివితక్క దానివి ఎలా బతుకుతావు అని ఆలోచించను ఇప్పుడు మాత్రం నువ్వు మంచి పని చేశావు అని భాగ్యం మెచ్చుకుంటుంది..

ఆ ఇద్దరి కోడలను మీ అత్త మామ ఎప్పటికీ క్షమించరు ఆ ఇంటికి నువ్వే రానివి అని భాగ్యం అంటుంది.. ఆ తర్వాత రామరాజు తాగుతూ ఆ విశ్వం గాడు ఇంత పని చేస్తాడని అస్సలు అనుకోలేదు అని బాధపడిపోతూ ఉంటాడు.. తిరుపతి కూడా అవును బావ వాడిని అస్సలు వదిలిపెట్టే పనేలేదు నువ్వు వదిలిపెట్టిన నేను వదిలిపెట్టను అని అంటాడు.. అమూల్యని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెడతాడా హింసించాడా అని ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.. ఈ క్రమంలో రామరాజుకి కోపం ఎక్కువైపోయి వాని అప్పుడెప్పుడో కాదు ఇప్పుడే ఇరగ్గొడతాను అని కోపంగా బయలుదేరిపోతాడు.. కోపంలో ఉన్న రామరాజు విశ్వం దగ్గరికి వెళ్లి చితగ్గొట్టేస్తాడు. నా కూతురునే కిడ్నాప్ చేస్తావా నా కూతురినే నువ్వు కొడతావా అని విశ్వాన్ని కొట్టేస్తాడు..

Advertisement

 బయట ఉన్న తిరుపతి ఈ విషయాన్ని ఎవరో ఒకరికి చెప్పాలి అని ఎదురుగా వచ్చిన ధీరజ్ కి చెప్తాడు.. నేను చూసుకుంటానులే మామ నువ్వేం కంగారు పడకు అని రామరాజును వెతుక్కుంటూ ధీరజ్ కూడా వెళ్ళిపోతాడు. రామరాజుని చూసిన ధీరజ్ విశ్వం ని కొట్టకుండా ఆపుతాడు.. దీన్ని నేను చూసుకుంటున్నానా? నువ్వు పదా అనేసి ధీరజ్ తీసుకొని వెళ్తాడు. ఇక తర్వాత నర్మదను ప్రేమను చందు తిడతాడు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మీ భార్యలు ఎందుకు ఇలా చేస్తున్నారు కొంచమైనా ఆలోచించండి. మీరు ఎందుకు కంట్రోల్ పెట్టడం లేదు అని చందు క్లాస్ పీకుతాడు.. అప్పుడే వచ్చిన శ్రీవల్లి తాను మంచిదనిపించుకోవడానికి నర్మదా ప్రేమలను తిడుతుంది.. సాగర్ ధీరజ్ లను ఇంకాస్త రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది..

Also Read :పల్లవికి దిమ్మతిరిగే షాక్.. పార్వతి దెబ్బకు మైండ్ బ్లాక్.. అవని నిజం చెప్పేస్తుందా..?

నర్మద దగ్గరికి వెళ్లిన సాగర్ చాప మీద పడుకోడానికి అన్ని తీసుకుంటాడు.. అయితే సాగర్ నీ నర్మదా అడుగుతుంది.. నా దగ్గర ఏది దాచకుండా ఉంటావని అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని అంటాడు.. ఇక అటు ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా గొడవ పడతారు. ఉదయం వేదవతి పూజ చేసి ఉగాది పచ్చడిని ఇస్తుంది.. కానీ నర్మదా ప్రేమలకు మాత్రం శ్రీవల్లికి ఇవ్వమని చెప్తుంది. అయితే మరోసారి శ్రీవల్లి తనకి అనుగుణంగా మార్చుకుంటూ వాళ్ళిద్దరిని ఇరికిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×