E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: నిజం చెప్పేసిన అమూల్య.. నోరువిప్పిన ప్రేమ.. రామరాజు ఇంటికి తిరిగివచ్చిన అమూల్య..

Illu Illalu Pillalu Today Episode: నిజం చెప్పేసిన అమూల్య.. నోరువిప్పిన ప్రేమ.. రామరాజు ఇంటికి తిరిగివచ్చిన అమూల్య..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ పుట్టిన రోజు కావడంతో రేవతి తన కూతుర్ని తలుచుకొని బాధ పడిపోతూ ఉంటుంది.. పుట్టినరోజు నాడు కూడా నా కూతురికి పిరికిడు అన్నం తినిపించలేకపోతున్నాను అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అమూల్య ఎంతగా ఓదారుస్తున్నా సరే నా కూతురికి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. భద్రావతి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది కానీ రేవతి మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది. అయితే అమూల్య ప్రేమ వదిన పుట్టినరోజు కదా పెద్దమ్మ అందుకని బాధ పడిపోతుంది అని జరిగిన విషయాన్ని చెప్తుంది. వాడి ప్లేస్ లో నేనున్నా కూడా అదే చేస్తాను అని అంటుంది భద్ర.

నువ్వెందుకు ఏడుస్తున్నావు నాకు అర్థం కావడం లేదు అని భద్ర రేవతిని అడుగుతుంది. ఇవాళ మీ మేనకోడలు పుట్టినరోజు అని మీరు మర్చిపోయారేమో కన్నతల్లిగా నాకు గుర్తుంది అని రేవతి బాధపడిపోతుంది.. ధీరజ్ విశ్వం ని కొట్టుకుంటూ బయట పెద్ద రచ్చ చేస్తాడు. అది చూసిన శ్రీవల్లి ఇంట్లో వాళ్ళందరిని పిలిచి బయటకు రమ్మని అరుస్తుంది.. అందరూ బయటికి వస్తారు ధీరజ్ ఎందుకు విశ్వక్ని కొడుతున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు వేరే దాంతో తిరుగుతావా అని ధీరజ్ విశ్వాన్ని కొడతాడు.. అయితే ధీరజ్ ఇక విశ్వం ని చంపేందుకు రెడీ అవుతాడు. ఆగన్నయ్య నువ్వు అన్నందుకు కొడుతున్నావ్ అని చంపేసి నువ్వు జైలుకెళ్తావా అని అమూల్య అంటుంది.. వాడు నీ మెడలో తాళి కట్టి ఇప్పుడు వేరే దాంతో తిరుగుతున్నాడు అమ్మ దీని చంపేసిన, జైలుకెళ్ళినా పర్వాలేదు అని ధీరజ్ అంటాడు.. ఆ మాట వినగానే అమూల్య నాకసలు పెళ్లే కాలేదు వీడు నా మెడలో తాళి కట్టలేదు అని గట్టిగా అరుస్తుంది.. అయితే తాళి కట్ట లేదా మరి నీ మెడలోకి తాళి ఎలా వచ్చింది అని అందరూ అడుగుతారు..

ఇక ప్రేమ నర్మదా ఇద్దరు కూడా అమూల్య చెప్పింది నిజమే ఆ తాళి వాడు కట్టలేదు అని అంటారు.. వాడు తాళి కట్టలేదంటే ఇందులో ఏదో మతలబ్ ఉంది.. అసలేం జరిగిందో చెప్పండి అని వేదవతి సీరియస్ అవుతుంది. ఇక ప్రేమ నిజంగానే అమూల్య మెడలో ఆ తాళి వేసుకోలేదు. మెడలో తాళి వేసుకోమని చెప్పాను అని ప్రేమ అంటుంది.. ఏం మాట్లాడుతున్నారే ఏంది మీరు చెప్పేది అర్థం కావడం లేదు అని వేదవతి అంటుంది.. ఇక రామరాజు ఆపండి. అమ్మ అమూల్య వాడు నీ మెడలో తాళి కట్ట లేదా అయితే ఆ తాడు తీసి వాడి మొహం కొట్టేసి రా వెళ్దాం అనేసి అంటాడు.. మాట వినగానే అమూల్య నా మెడలోని తాళిని తీసి విశ్వం మోహన కొట్టేస్తుంది.

Advertisement

ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ధీరజ్ తో ప్రేమ మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కానీ ప్రేమ మాటలు వినడానికి కూడా ఇష్టపడడు.. నన్ను ఎంత మోసం చేస్తావని అసహ్యించుకుంటాడు ప్రేమ బాధ పడిపోతూ ఉంటుంది. అందరూ రాత్రి ఒకచోట కూర్చుని బాధ పడిపోతూ ఉంటారు.. కూర్చొని ప్రేమ బాధ పడిపోతూ ఉంటే అక్కడికి నర్మదా వస్తుంది.. ఏమి బాధపడకు. ఏం జరగాలో అది జరుగుతుంది నువ్వు రా వెళ్దాం అనేసి ప్రేమని నర్మదా లోపలికి తీసుకొని వెళుతుంది. ఇక అసలు ఏమైంది ఎందుకు నువ్వు వాడితో వెళ్ళావ్ అని అందరూ అడుగుతారు. దాంతో అమూల్య వాడు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు అని చెప్తుంది.. ఈరోజు ఏంటమ్మా నువ్వు చెప్పేది వాడిని నువ్వు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడా అని అనగానే అవునన్నాయా నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు అని అమూల్య అంటుంది.

Also Read : పల్లవికి ఎన్ని కష్టాలో.. రాజేశ్వరిపై పార్వతి కౌంటర్.. అవని దెబ్బకు పల్లవి ఫ్యూజుల్ అవుట్..

చందు తప్పంతా నీవైపే ఉంది అమ్మ.. అమూల్య నువ్వు వాడి దుర్మార్గుడు అని తెలిసి కూడా వాడి దగ్గరికి వెళ్లాలని ఎలా అనుకున్నావు అని చందు సీరియస్ అవుతాడు.. సాగర్ మాత్రం నువ్వు ఎందుకు వెళ్ళావు అని అరుస్తాడు.. శ్రీవల్లి తన పేరు ఎక్కడ బయటకు వస్తుందని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అంత రాత్రిపూట నువ్వు వాడి దగ్గరికి ఎందుకు వెళ్లావు చెప్పు అని చందు కూడా అడుగుతాడు. మరి నిన్ను ఎవరు తీసుకెళ్లారు ఎందుకు నువ్వు అర్ధరాత్రి వాడిని కలవడానికి వెళ్ళావు అని చందు అడుగుతాడు.. చెప్పు అమూల్య నిన్ను బయట కలవడానికి తీసుకెళ్లింది ఎవరు? ప్రేమనే కదా వాళ్ళ అన్నయ్యతో మాట్లాడమని తీసుకొని వెళ్ళింది అని ధీరజ్ అంటాడు..ప్రేమ వదినకు ఈ విషయానికి ఎటువంటి సంబంధం లేదు అని అమూల్య అంటుంది.. మరి ఎవరు తీసుకొని వెళ్ళమన్నారు అని అందరూ గుచ్చి గుచ్చి అడుగుతారు. శ్రీవల్లి తన పేరు ఎక్కడ చెప్తుంది అని భయపడిపోతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో శ్రీవల్లి పేరు బయట పెడుతుందేమో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×