E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న అమూల్య.. ధీరజ్, విశ్వక్ మధ్య గొడవ..గ్రాండ్ గా హోలీ సంబరాలు..

Illu Illalu Pillalu Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న అమూల్య.. ధీరజ్, విశ్వక్ మధ్య గొడవ..గ్రాండ్ గా హోలీ సంబరాలు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి పూజ చేసి ప్రేమకు ఆశీర్వాదం ఇస్తుంది. అంటే అన్నాను అంటారు కానీ మీరు మాత్రమే బర్త్డేకి కేక్ కట్ చేశారు నన్ను పిలవాల్సిన పని లేదా అని వేదవతి ఫీల్ అవుతుంది. నాకు తెలియకుండా సర్ప్రైజ్ గా చేశారు అత్తయ్య నాకు తెలిసి ఉంటే మిమ్మల్ని ఎందుకు పిలవను. మీరు అసలే నాకు ముద్దుల అత్త కదా అనేసి ప్రేమ ఐస్ చేస్తుంది.. ఈ మాటలకేం తక్కువ లేదు అని పూజ అవ్వగానే ఆశీర్వదిస్తుంది. అయితే ధీరజ్ నాకు ప్రపోజ్ చేశాడు అని చెప్పగానే దానికి అర్థం తెలియక నీ మీద కోప్పడ్డాడ నాకు ఎంత బాధగా ఉందో అనేసి వేదవతి అంటుంది.

ప్రపోజ్ చేయడం అంటే నాకు ఐ లవ్ యు చెప్పాడు అని అనగానే మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి అత్త అనేసి ప్రేమ అడుగుతుంది. మాకు ఇలాంటివి ఏమీ లేవు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అంతే పెళ్లి చేసుకున్నాము అని వేదవతి అంటుంది. వీరిద్దరి మధ్య రొమాంటిక్ టచ్ మొదలవుతుంది ఇది ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. అమూల్యకి తన బర్త్ డే సందర్భంగా పాయసం ఇవ్వాలని ప్రేమ వెళుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ నర్మదా ఇద్దరు కూడా అమూల్యకి పాయసం ఇవ్వడానికి బయటకు వెళ్తారు. అమూల్యకి పాయసం ఇచ్చి తినమని చెప్తారు.. ఏంటి వదిన స్పెషల్ అని అమూల్య అడుగుతుంది. ఈరోజు మీ వదిన బర్త్డే అని నర్మదా చెప్పగానే హ్యాపీ బర్త్డే వదిన అని అమూల్య అంటుంది. అయితే అమూల్య ఆ పాయసం తింటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు ఎమోషనల్ అవ్వకుండా ముందు పాయసం తిను అని నర్మదా ప్రేమ అంటారు. పక్కనే దాక్కొని చూస్తున్న శ్రీవల్లి పాయసం ఇవ్వడానికి వెళ్లారా అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ వీళ్ళని చూసి సంతోషంగా ఉంటాడు. ఇక్కడ నువ్వు ఇలా తీసుకోవడం ఎవరైనా చూస్తే తిడతారు అని లోపలికి వెళ్ళమని అమూల్యని పంపిస్తారు. అది చూసిన విశ్వక్అమూల్యను కొడతాడు..

 నా చెల్లిని కొడతావా అనేసి ధీరజ్ కోపంగా వెళ్లి విశ్వక్ ను కొడతాడు.. నువ్వు ఎవరు అసలు అడగడానికి నా భార్య నేను కొట్టుకుంటాను ఏమైనా చేసుకుంటాను నీకెందుకురా అనేసి విశ్వక్ అంటాడు.. నువ్వు నా భార్య దగ్గరికి రావద్దు అని విశ్వక్ అంటాడు. చెప్పు అమూల్య అలా మౌనంగా ఉంటావ్ ఏంటి? నీ మెడలో తాళి కట్టిన భర్తని అని నువ్వు చెప్పు.. అందుకే నేను నిన్ను కొడతాను తిడతానని చెప్పు అనేసి అంటాడు.. ప్రేమ మాత్రం విశ్వక్ని కొడుతుంది. ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావ్ ఏంట్రా దున్నపోతా అని తిడుతుంది.

Advertisement

ఈ ఆ తర్వాత శ్రీవల్లి విశ్వ కి విషయం ఎలాగైనా చెప్పాలి అని అనుకుంటుంది. కానీ శ్రీవల్లి నిజం చెప్పబోయి ఆగిపోతుంది. ఇప్పటికే నర్మదకు నా మీద చాలా విషయాల్లో అనుమానం ఉంది. ఇది కూడా నేనే చెప్పానని తెలిస్తే నా మీదకి మరో పాముని వదిలేస్తుంది. నన్ను చంపేంతవరకీ వదిలిపెట్టదు అని అనుకుంటుంది. నువ్వు ఆ విషయం గురించి తెలుసుకోవాలి అంటే అమూల్య మెడలో తాళి కట్టింది ఎవరో తెలియాలి అని నువ్వు అనుకుంటే మాత్రం కామాక్షిని ఇన్వాల్వ్ చేయాలి. ఆమె వల్లే నీకు ఈ నిజం తెలుస్తుంది అని శ్రీవల్లి అదిరిపోయే సలహాలు ఇస్తుంది.. ఇకపోతే ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా కామాక్షి దగ్గరికి డబ్బులు కోసమని వెళ్తారు.

Also Read : చక్రధర్ ను అవమానించిన భానుమతి.. పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. పార్వతి కన్నీళ్లు..

అప్పటివరకు నగలతో నిండా ముస్తా వైపు కూర్చున్న కామాక్షి ధీరజ్ వాళ్ళని చూసి ఏంట్రా ఇలా వచ్చారు అని అడుగుతుంది.. ఫైనాన్స్లో నేను కారును తీసుకుంటున్నాను.. నాకు కొంచెం డబ్బులు కావాలి అక్క బావ 10 లక్షలు కావాల్సి వస్తుంది అని అనగానే అంత డబ్బులు మాకు దగ్గర ఎక్కడ ఉన్నాయి అని కామాక్షి అంటుంది.. అంత కాదక్కా ఒక రెండు లక్షలు కావాలి అని అడగ్గానే.. నాకు ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్లిన కామాక్షి వెంటనే చీరని మార్చుకొని రావడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మా పరిస్థితి ఇలా ఉంది బాబు మేము ఎలా నీకు డబ్బులు ఇవ్వగలము అని కామాక్షి కావాలని అంటుంది. డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు హోలీ ఆడమని అనగానే హోలీ ఆడుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో రామరాజు వెంట హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతాయి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×