E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: గుడ్ న్యూస్ చెప్పిన ప్రేమ.. ధీరజ్ మాటతో ఫుల్ హ్యాపీ.. ప్రేమ పై శ్రీవల్లి రివేంజ్ స్టార్ట్..

Illu Illalu Pillalu Today Episode: గుడ్ న్యూస్ చెప్పిన ప్రేమ.. ధీరజ్ మాటతో ఫుల్ హ్యాపీ.. ప్రేమ పై శ్రీవల్లి రివేంజ్ స్టార్ట్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. తండ్రికి క్షమాపణలు చెప్పడానికి వెళ్లిన సాగర్ కు ఆయన మాట విని షాక్ అవుతాడు. నన్ను మా నాన్న అర్థం చేసుకోడు అంటూ బాధపడతాడు.. నాకు ఇష్టమైన జాబును చేయాలి అనుకోవడం కూడా తప్పేనా? మా నాన్న ఇంతే నర్మదా ఇక ఎప్పటికీ మారడు అని సాగర్ అంటాడు. నువ్వు కేవలం మీ నాన్నకి చెప్పాలని అనుకున్నావు అంతే.. ఎవరైనా కూడా ఆయన ప్లేస్ లో ఉంటే అలానే అనుకుంటారు అని నర్మద ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా సరే.. సాగర్ మాత్రం మా నాన్న ఇంతే నన్ను ఇంతే అర్థం చేసుకుంటాడు అని బాధపడిపోతూ ఉంటాడు.. ఆ తర్వాత రాత్రి అవ్వగానే ప్రేమకు ధీరజ్ ఇవ్వాలని అనుకుంటాడు.. అర్ధ రాత్రి అందరిని రమ్మని చెప్పి కేక్ కటింగ్ కి పిలుస్తాడు.. అది చూసిన ప్రేమ షాక్ అవుతుంది. నా బర్త్ డే నీకు గుర్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను రా అని ప్రేమ అంటుంది. నీ బర్త్ డే ని మర్చిపోతే నీకు అదే గుర్తుపెట్టుకోవడానికి అని ధీరజ్ అంటాడు.. వీరిద్దరూ ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ మాట్లాడుకోవడం చూసిన నర్మదా.. మీరు చూసుకోవడం ఆపేసి కేక్ కట్ చేసి మా మోహన కేక్ ముక్క పడేస్తే తినేసి వెళ్ళిపోతాం.. ఆ తర్వాత మీరిద్దరే కలలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు అని అంటుంది.. మొత్తానికి ధీరజ్ ప్రేమకు ప్రపోజ్ చేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. వేదవతి పూజ చేసి ప్రేమకు ఆశీర్వాదం ఇస్తుంది. అంటే అన్నాను అంటారు కానీ మీరు మాత్రమే బర్త్డేకి కేక్ కట్ చేశారు నన్ను పిలవాల్సిన పని లేదా అని వేదవతి ఫీల్ అవుతుంది. నాకు తెలియకుండా సర్ప్రైజ్ గా చేశారు అత్తయ్య నాకు తెలిసి ఉంటే మిమ్మల్ని ఎందుకు పిలవను. మీరు అసలే నాకు ముద్దుల అత్త కదా అనేసి ప్రేమ ఐస్ చేస్తుంది.. ఈ మాటలకేం తక్కువ లేదు అని పూజ అవ్వగానే ఆశీర్వదిస్తుంది. అయితే ధీరజ్ నాకు ప్రపోజ్ చేశాడు అని చెప్పగానే దానికి అర్థం తెలియక నీ మీద కోప్పడ్డాడ నాకు ఎంత బాధగా ఉందో అనేసి వేదవతి అంటుంది. ప్రపోజ్ చేయడం అంటే నాకు ఐ లవ్ యు చెప్పాడు అని అనగానే మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి అత్త అనేసి ప్రేమ అడుగుతుంది. మాకు ఇలాంటివి ఏమీ లేవు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అంతే పెళ్లి చేసుకున్నాము అని వేదవతి అంటుంది.

Advertisement

మావయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని అనగానే ప్రేమ వెళ్లి బర్త్డే అని చెప్పి ఆశీర్వాదం తీసుకుంటుంది. ప్రేమ పుట్టిన రోజు కాబట్టి ఏదైనా స్వీట్ చేసి పెట్టు అని వేదవతి తో రామరాజు అంటాడు. ప్రేమకు ఒక్కదానికే కాదండి అందరికీ నేను స్వీట్ చేసి పెడతాను అని వేదవతి అంటుంది. ఇక తర్వాత నర్మదా సాగర్ ని కూడా పిలువు అందరికోసం పాయసం చేశాను అని వేదవతి అంటుంది.. నర్మదక్క అత్తయ్య పిలుస్తుంది అని ప్రేమ అక్కడి నుంచి ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అందరి ఆశీర్వాదం తీసుకున్నావా అని అనగానే అందరి ఆశీర్వాదం తీసుకున్నాను ఇక నీ ఒక్కడి ఆశీర్వాదం తీసుకోవాలి అని ప్రేమ అడుగుతుంది.

ఆశీర్వాదం ఇవ్వడం ఏంటి నేను అప్పుడే పెద్దవాడిని అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది.. ఇక తర్వాత ప్రేమ అక్షింతలు ఇచ్చే ధీరజ్ని దీవించమని అడుగుతుంది.. డి రాజు సుపుత్ర ప్రాప్తిరస్తు అని అనగానే ఏంట్రా అలా దీవించేసావు అని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ప్రేమ బర్త్డే గిఫ్ట్ గా కారు ఇవ్వబోతున్నాను అని అనగానే ప్రేమ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. వీరిద్దరి మధ్య రొమాంటిక్ టచ్ మొదలవుతుంది ఇది ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి భాగ్యం కి ఫోన్ చేస్తుంది. భాగ్యం మాత్రం ఆనందరావుని రైస్ మిల్కు వెళ్లేందుకు రెడీ చేస్తూ ఉంటుంది.

Advertisement

Also Read :పల్లవికి చెమటలు.. పార్వతికి మాటిచ్చిన అవని.. నిజం బయటపడుతుందా..?

ఫోన్ లిఫ్ట్ చేయగానే అమూల్య మెడలో తాళి వేసుకోమని చెప్పింది ఎవరో కాదు ఆ సీమటపాకాయ్ ప్రేమ అనే అని శ్రీవల్లి అంటుంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఆ తర్వాత ప్రేమని శాశ్వతంగా పుట్టింటికి పంపించొచ్చు అని మాట్లాడుతూ ఉంటుంది. అయితే చందు ప్రేమ పుట్టిల్లు అని వినిపించడంతో ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ ప్రేమ గురించి ఏం చెప్తున్నావు అని అడుగుతాడు.. అడ్డంగా బుక్కయ్యాను అనుకున్న శ్రీవల్లికి చందు కి ఏమీ తెలియదని అనుకోవడంతో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది.. ఆ తర్వాత ప్రేమ సంగతి బయట పెడతానని శ్రీవల్లి సంతోష పడిపోతూ ఉంటుంది.. ఇక ప్రేమ నర్మదా ఇద్దరు కూడా అమూల్యకి పాయసం ఇవ్వడానికి బయటకు వెళ్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×