E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య.. భాగ్యం ప్లాన్ సక్సెస్.. భద్రకు షాకిచ్చిన ప్రేమ.. రామరాజు వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య.. భాగ్యం ప్లాన్ సక్సెస్.. భద్రకు షాకిచ్చిన ప్రేమ.. రామరాజు వార్నింగ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 6th : శ్రీవల్లి ధీరజ్ అరెస్ట్ అయిన విషయాన్ని భాగ్యంతో చెబుతుంది.. భాగ్యం ఆనందరావు అలాగే సుకన్య ముగ్గురు కలిసి చాలా సంతోషంగా ఉంటారు.. ధీర ఇరుక్కున్నాడు.. కాబట్టి నీ కడుపు సంగతి బయటపడే అవకాశం లేదు అని అనుకుంటారు.. అంతేకాదు ధీరజ్ అరెస్ట్ అయిన తర్వాత రామరాజు కుటుంబం ప్రవర్తన ఎలా ఉంటుంది అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా నటించి చూపిస్తారు.. మొత్తానికి ధీరజ్ అరెస్టు అయ్యాడని భాగ్యం కుటుంబం చాలా సంతోషంగా ఉంటారు.

నాకే వార్నింగ్ ఇస్తాడా..?

ఆ ప్రసాద్ రావు కి మేమే నిజం చెప్పామని మా మీద కక్ష కట్టిన ఆ నర్మదను తీసుకుని మన ఇంటికి వచ్చి వార్నింగ్ ఇస్తాడా స్వాతిముత్యం గాడు. ఇప్పుడు జైల్లో మగ్గిపోతున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని భాగ్యం అంటుంది. వీళ్ళందరూ చేసిన పర్ఫామెన్స్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. ఇప్పుడు నర్మదా వేరే కాపురం విషయంలో బాధపడిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఆ పొట్టి మిరపకాయ తన భర్త జైల్లో ఉన్నాడని కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. ఆ ఇంటికి నేనే రాజు నేనే మంత్రి అని శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటుంది.. అంతే కదూ రైస్ మిల్ ని మనం సొంతం చేసుకున్న సమయం కూడా ఇదే అని భాగ్యం అంటుంది..

భద్రకు వార్నింగ్ ఇచ్చిన ప్రేమ..

Advertisement

ధీరజ్ మీద కోపంతోనే ఇలా చేశారు అని ప్రేమ భద్రావతి ఇంటికి చాలా ఆవేశంగా వెళుతుంది.. భద్రావతి అంటూ కేకలు వేస్తూ ప్రేమ వెళ్లడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి అత్తను పట్టుకొని పేరు పెట్టి పిలుస్తున్నావు అని భద్ర అంటుంది.. ధీరజ్ ని అరెస్ట్ చేయించింది మీరే కదా ఎందుకు అరెస్ట్ చేయించారు అని ప్రేమ అడుగుతుంది. ఏంటే మేనత్తాన్ని కూడా గౌరవం లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావు. ఏం తల పొగరు ఎక్కిందా అని ప్రేమను భద్ర అడుగుతుంది.. ధీరజ్ మీకేం అన్యాయం చేశాడని అరెస్ట్ చేయించారు అని ప్రేమ అడగ్గానే అవునే మేమే అరెస్టు చేయించాం ఇప్పుడేంటి నువ్వు అరుస్తున్నావు అని భద్రవతి అంటుంది..

విశ్వంను కొట్టిన ప్రేమ..

ఆ ధీరజ్ గాడు ఆరోజు నన్ను అరెస్ట్ చేయించి జైల్లో కూర్చోపెట్టాడు అప్పుడు నీకు కోపం రాలేదా.. నీకు ధీరజ్ కి పోలిక ఉందా.. అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసావు కాబట్టి నిన్ను జైలుకు పంపించారు.. కానీ ధీరజ్ ఏం తప్పు చేశాడని మీరు జైలుకు పంపించాలని చూశారు అని ప్రేమ సీరియస్గా అడుగుతుంది.. అటు రేవతి మన కూతురిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వ్యక్తిని మీరు ఇలా అరెస్ట్ చేయించడం మంచిది కాదండి ప్రేమ బాధ పడిపోతుంది అని చెప్పినా కూడా సేన భద్ర ఇద్దరు కూడా నువ్వు లోపలికి వెళ్ళు అని అరుస్తారు.. అత్తనే పేరు పెట్టి పిలుస్తున్నావా అయితే నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు బయటికి వెళ్ళు అని ప్రేమని బలవంతంగా భద్ర బయటికి తీసుకుని వస్తుంది.. నిన్ను కొట్టలేదు కదా అని ప్రేమ అనగానే ఇంకాస్త రెచ్చిపోయిన భద్ర ప్రేమని బయటకి తీసుకొచ్చి గెంటేస్తుంది.

వేదవతికి నిజం తెలిసిపోతుందా..?

Advertisement

ధీరజ్అరెస్టు అవ్వడానికి కారణం వీళ్ళు అని ప్రేమ చెప్పగానే ఒక్కసారిగా రామరాజు కుటుంబం షాక్ అవుతుంది.. నా కొడుకు అరుస్తావడానికి కారణం మీరా? ఎందుకు నా కొడుకు మీద మీకు అంత కక్ష అని వేదవతి అడుగుతుంది. ఆరోజు నా కొడుకుని నీ కొడుకు అరెస్ట్ చేయించినప్పుడు గుర్తుకు రాలేదా కన్న ప్రేమ అని సేన వేదవతిని అడుగుతాడు.. నా కొడుకుకి నీ కొడుకుకి పోలికేంటి అని వేదవతి సీరియస్ అవుతుంది. నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసారా నీ కొడుకుని అరెస్ట్ చేయించాడు తప్ప వేరే ఉద్దేశం నా కొడుకుకి లేదు అని వేదవతి అంటుంది. నా కొడుకు జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నారు అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది..

కాళ్ళు పట్టుకుంటాను వదిలెయ్యండి..

నా కొడుకు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు.. జీవితంలో పైకి రావాలని ఆశ పడుతున్నాడు.. వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటి వాడి జీవితాన్ని మొగ్గలోనే తుంచేయకండి.. వాడికి చాలా భవిష్యత్తు ఉంది.. మీ పగ నా మీదే కదా నన్ను ఏదైనా చేయండి అని రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ సీన్అందరిని కంటతడి పెట్టిస్తుంది. తన కొడుకు కోసం రామరాజు పడుతున్న బాధను చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. నన్ను ఏదైనా చేయండి మీ కాళ్లు పట్టుకుంటాను నా కొడుకుని వదిలేయండి అని రామరాజు బ్రతిమలాడుతాడు. కానీ సేన భద్రావతి రామరాజు అంటే పౌరుషానికి పేరు కదా.. అలాంటిది మా కాళ్లు పట్టుకుంటానని అంటావా చూసావా అక్క రామరాజు ఎంతకు దిగజారాడు అని సేన అంటాడు.. మొత్తానికి ఈ రెండు కుటుంబాల మధ్య మరోసారి యుద్ధం నడుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: కమల్ మనసు గొప్పది.. ప్రణతి మాటతో పల్లవి షాక్.. రాజేశ్వరిని చంపేశారా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×