E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: లంచం తీసుకున్న సాగర్.. నర్మదకు వల్లి పై అనుమానం.. చివరిలో షాకింగ్ ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: లంచం తీసుకున్న సాగర్.. నర్మదకు వల్లి పై అనుమానం.. చివరిలో షాకింగ్ ట్విస్ట్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 27th:శ్రీవల్లి నాటకం రక్తి కడుతుంది. కడుపులో బిడ్డ పోయినని తెలుసుకున్న చందు బయటికి వెళ్లి రామరాజుని హగ్ చేసుకుని మరి బాధ పడిపోతూ ఉంటాడు. అసలు నాకు చాలా బాధగా ఉంది నాన్న అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన రామరాజు ఊరుకోరాని ఓదారుస్తాడు.. అయితే నర్మదని దగ్గరికి కూడా రానివ్వకుండా పేదవాతి సీరియస్ గా ఉండడం చూసినా భాగ్యం బ్యాచ్ లోపలికి వెళ్లి డాన్సులు వేస్తారు.. నర్మదని అడ్డంగా ఇరికించాము అని శ్రీవల్లి వాళ్ళు డాన్సులతో రచ్చ చేస్తారు.. ఇక శ్రీవల్లి ప్లాన్ అందరికీ చెప్పి ఒక్కసారిగా అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది..

హమ్మయ్య.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..

నర్మద వాళ్ళు ఎంత ఆలోచించినా సరే ఈ ప్లాన్ చేసింది ఎవరు అన్న విషయాన్ని కనిపెట్టడం వాళ్ళ కాదు. మనం చాలా సంతోషించాల్సిన విషయం. నర్మదా ను ఇరికిస్తే అది మళ్ళీ నీ జోలికి రాదు కదా.. తను నా జోలికి రావడం కాదు తనని అసలేం జరిగిందో తెలుసుకునేలా చేసేలా అన్ని ప్లాన్లు చేస్తుంది.. కానీ ఇప్పుడు నర్మదకి ఆ ఛాన్స్ లేకుండా చేశాను కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను.. ఇప్పటినుంచి నా మీద కాస్త గౌరవం పెరుగుతుంది.. ఇకమీదట నా గురించి ఆలోచించే ఛాన్స్ కూడా నర్మదకు ఇవ్వను అని అనగానే అందరూ మాస్ సాంగ్ కి డాన్స్ చేస్తారు.. మొత్తానికి వల్లి ప్లాన్ అయితే బాగా సక్సెస్ అవుతుంది.. హాస్పిటల్లో అందరూ కలిసి డాన్స్ చేస్తూ చాలా సరదాగా ఉంటారు..

నర్మదకు శ్రీవల్లి పై అనుమానం..

Advertisement

అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? వల్లి అక్కకి కడుపు పోవడానికి యాక్సిడెంట్ కి ఏంటి సంబంధం అని ధీరజ్ ప్రేమ నర్మదలు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు.. వల్లి అక్కకి సడన్గా ఇలా జరగడం ఎక్కడో ఏదో తేడాగా ఉంది అని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళావు కదా వదినా మరి యాక్సిడెంట్ ఎలా జరిగింది.. అసలు సడన్గా యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఏంటి అన్నది ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదని ధీరజ్ అంటాడు.. మిల్కీ ఆక్సిడెంట్ ఎలా అయింది వదిన అని ధీరజ్ మళ్లీమళ్లీ గుచ్చి గుచ్చి అడుగుతాడు. ఏమో ధీరజ్..

నాకు అది అర్థం కావడం లేదు సడన్గా సైడ్ నుంచి ఆటో వచ్చింది.. ఆటోలో ఉన్న అమ్మాయి కళ్ళకు అర్థాలు పెట్టుకుని మొహానికి కర్చీఫ్ కట్టుకుంది అని చెప్పగానే ధీరజ్ ఏంటి వదిన నువ్వు మాట్లాడేది.. కళ్ళకు అద్దాలు పెట్టుకుందా? అందులో ఈ ఏరియాలో లేడీ ఆటో డ్రైవర్లు లేరు కదా మరి ఆ అమ్మాయి ఎవరు అని ధీరజ్ అంటాడు. ఎవరో కావాలని ఇదంతా చేసినట్లు కనిపిస్తుంది అని అందరూ అనుమానిస్తూ ఉంటారు.

సుకన్య దొరికిపోతుందా..?

Advertisement

వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా సుకన్య దాన్ని దొంగచాటుగా వింటుంది. అసలు ఆక్సిడెంట్ గురించి మళ్లీ కడుక్కోవడానికి గురించి మీరు తెలుసుకోవడం అసాధ్యం అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది.. ఆటో డ్రైవర్ గురించి మాట్లాడగానే నా పర్ఫామెన్స్ అలా ఉంది నన్ను పట్టుకోవడం అంత సులువు కాదు అని సుకన్య ఆలోచిస్తూ ఉంటుంది.. లేడీ డ్రైవరు ఎవరూ లేరు ఎవరు ప్లాన్ చేశారు అనేది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. అక్కడున్న సీసీటీవీ కెమెరాలను వాటిని పరిశీలిస్తే ఆటోని డ్రైవ్ చేసుకొని వచ్చిన అమ్మాయి ఎవరో తెలుస్తుంది అని ధీరజ్ అనగానే సుకన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను అడ్డంగా దొరికిపోయినట్టున్నాను ఒకవేళ ఆ ఆటో నడిపింది నేనే అని తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తారు అని సుకన్య కంగారు పడిపోతూ ఉంటుంది. అంతేకాదు ఈ విషయాన్ని వెంటనే మళ్ళీ చెప్పాలని అక్కడికి వెళుతుంది..

సాగర్ లంచం తీసుకున్నాడా…?

సాగర్ ఆఫీస్ లో శాలరీ వచ్చింది అని తన ఫ్రెండ్స్ అందరూ పార్టీ కావాలని అడుగుతారు. కానీ సాగర్ మాత్రం నాకు వచ్చిన శాలరీ కన్నా వడ్డీలు కట్టడమే ఎక్కువ అయిపోయింది అని బాధ పడిపోతూ ఉంటాడు. ఇకముందు నేను మంచి పార్టీని ఇస్తాను ప్రస్తుతానికి అయితే నేను వడ్డీలు కట్టిన తర్వాత మీకు ఇస్తాను అని చెప్పడంతో అప్పుడే అక్కడికి వస్తాడు ప్రసాద్ రావు.. నీ దగ్గర డబ్బులు లేవు కదా అల్లుడు అంటూ బయటికి వెళ్దాం పద అని తీసుకొని వస్తాడు. జాబ్ చేసుకుంటూ నీకు నువ్వే వడ్డీలు కట్టుకుంటూ ఉంటే ఇంక సంపాదించేది ఏమీ లేదు.. నువ్వు ఈ ఫైల్ మీద సంతకం పెడితే నీకు ఇప్పుడే డబ్బులు వస్తాయి అని ప్రసాద్ రావు అంటాడు. సాగర్ ఏం మాట్లాడకుండా సంతకం పెట్టగానే ప్రసాద్ రావు పదివేల డబ్బులు నీ సాగర్ జోబులో పెడతాడు. 25 లక్షలు పెట్టి జాబ్ కొన్నావు ఇలా ఉంటే ఆ 25 లక్షలు ఎలా వస్తాయి అని ఆ ప్రసాద్ రావు అంటాడు. డబ్బులు వచ్చాయన్న ఆనందంలో ఉన్న సాగర్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి పార్టీకి వెళ్దామని అంటాడు.

వల్లి మాస్టర్ ప్లాన్ సక్సెస్..

శ్రీవల్లి లోపల కాయలు తింటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.. అయితే అప్పుడు అక్కడికి వచ్చిన సుకన్య కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్లుగా కేకలు పెడుతుంది. ఏంటి ఏమైంది ఎందుకు అంతలాగా అరుచుకుంటూ వస్తున్నావు అని శ్రీవల్లి అడుగుతుంది.. ఆటో డ్రైవింగ్ చేసినందుకు నా మీద అనుమానం వచ్చింది.. నన్ను గనక వాళ్ళు కనుక్కుంటే కచ్చితంగా నువ్వు నీ కడుపు నాటకం బయటపడిపోతుంది అని దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు నీ గురించి ఆలోచించకుండా నేను చేస్తాను అని వల్లి మాస్టర్ ప్లాన్ చేసి నాటకం మొదలు పెడుతుంది.. వల్లికి ఏదో జరిగిందని అందరూ కంగారు పడిపోతూ ఉరుక్కుంటూ వల్లి దగ్గరికి వస్తారు. తన నాటకంతో నర్మదకు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది వల్లి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: శ్రీయాకు నొప్పులు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. ఆస్తి కోసం ఇంట్లో రచ్చ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×