E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: కొడుకు కోసం వేదవతి త్యాగం.. ధీరజ్ భాదను పోగొట్టేందుకు ప్రేమ ప్లాన్..

Illu Illalu Pillalu Today Episode: కొడుకు కోసం వేదవతి త్యాగం.. ధీరజ్ భాదను పోగొట్టేందుకు ప్రేమ ప్లాన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 22 nd: నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ ఒకసారి ఆయన మిల్లుకు రావాలి అంటాడు. మరొకసారి నాకు నీకు ఏ సంబంధం లేదు నువ్వు సంపాదించి ఇవ్వాలి అని అంటాడు. ఇలా ఒక్కసారి రెండుసార్లు అంటే పర్వాలేదు కానీ ప్రతిసారి ఇలా అంటూ ఉంటే ఎలా ఆయన మాటను వినాలి అన్నయ్య. నాక్కూడా కొంచెం ఆత్మాభిమానం ఉంటుంది కదా అని ధీరజ్ అనగానే అన్నదమ్ములు నీ ఇష్టం రాని వదిలేస్తారు. ఇక వేదవతి తండ్రి కొడుకులను ఒకచోట చేర్చి కలపాలని ప్లాన్ వేస్తుంది. ప్రేమ కూడా సపోర్ట్ చేస్తుంది.. తండ్రి కొడుకులు కలిసి భోజనం చేస్తే కోపం తగ్గిపోతుందని అనుకుంటుంది వేదవతి.. ప్రేమ, వేదవతి కలిసి ఇద్దరినీ భోజనం దగ్గర కూర్చోబెడతారు. కానీ రామరాజు భోజనం నుంచి మధ్యలోనే వెళ్ళిపోతాడు.. అయితే వేదవతి ధీరజ్ కు నిజం చెప్పాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. వేదవతి తండ్రి కొడుకులు మధ్య గొడవకి కారణం నేనే అని బాధపడుతూ ఉంటుంది. వీళ్ళ మధ్య దూరం ఎప్పుడు తగ్గుతుందా అని వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. కొడుకు, తండ్రికి దూరం రోజు రోజుకు పెరుగుతుంది.. ఏదోకటి చెయ్యాలి. ముందు ప్రేమను వాడు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. నేను వేరే దారిలేక తాళి కట్టమని అడిగితే కట్టాడు అని నిజం చెప్పేస్తాను అని వేదవతి అంటుంది.. ప్రేమ నర్మదా వేదవతి దగ్గరికి వచ్చి మాకు బాధపడదని చెప్పారు అత్తయ్య మీరు ఇప్పుడు బాధపడుతున్నారా అని అడుగుతారు. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాతే ధీరజ్ కి కష్టాలు మొదలయ్యాయి అని వాడు బాధపడుతున్నాడు. ప్రేమతో పెళ్లి జరగడానికి కారణం నేనే అని ఆయనకు తెలిసేలా చేస్తాను. వాడి మీద నాకు కోపం తగ్గిపోతుంది అని అనుకుంటుంది.

Advertisement

నిజానికి నాకు ఆరోజు ఇచ్చిన మాట ప్రకారం వాడికి పెళ్లి చేశాను. ఇప్పుడు వాడిపై కోపం పెరగడానికి నేనే కారణం అయిపోయాను. ఈ పెళ్లి జరగడానికి అసలు కారణం నేనే అన్న విషయాన్ని ఆయనకు చెప్పేస్తాను అప్పుడు కోపం తగ్గిపోతుంది అని వేదవతి అంటుంది.. నువ్వు ఇప్పుడు వెళ్లి నిజం చెప్తే ముగ్గురం ఆయనకు ఎన్ని రోజులు అబద్ధం చెప్పామని అనుకుంటారు.. మన ముగ్గురం కలిసి ధీరజ్ పెళ్లి చేశామని మావయ్య గారు మన ముగ్గురు మీద ద్వేషం పెంచుకుంటారు. ఇప్పుడు చెప్పడం అవసరమంటావా అని నర్మదా అంటుంది. అయితే వేదవతి నర్మద మాట విని చెప్పడం ఆపేస్తుంది.

Also Read: ధనుష్ – నాగార్జున ‘కుబేర ‘.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..?

Advertisement

ఇకపోతే ధీరజు వాళ్ళ నాన్న అన్న మాటలు విని బాధపడుతూ ఉంటాడు. వీడు ఇలా బాధపడడానికి కారణం నేనే వీడి బాధను ఎలాగైనా పోగొట్టాలని ప్రేమ అనుకుంటుంది.. ధీరజ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. రేపు ఫైనల్ ఎగ్జామ్ అన్న సంగతి నీకు తెలియదా..? ముందు బుక్ పట్టుకొని చదువుకో అని ఆర్డర్ వేస్తుంది. ఇక ధీరజ్ చేసేదేమి లేక చదువుకుంటాడు. మధ్యలో నిద్ర పోవడంతో ప్రేమ మీద పడుకుంటాడు. ప్రేమ మనసులో ధీరజ్ పై ప్రేమ పుడుతుంది. ఈ దూరం కాస్త పోయి దగ్గర అవుతారేమో చూడాలి.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×